Profile cover photo
Profile photo
Prabhakar Mandaara
62 followers
62 followers
About
Prabhakar Mandaara's posts

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
జీనా హైతో మర్‌నా సీఖో - జార్జిరెడ్డి జీవన రేఖలు, రచన: కాత్యాయని, హెచ్‌బిటి ప్రచురణ, ధర రూ.60/

''మన సమాజం కుళ్ళిపోయింది. ఆ కుళ్ళు మన జీవితాల్లోని అన్ని అంశాల్లోకీ, మన యూనివర్సిటీల్లోకీ కూడా వ్యాపించింది. మేము చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. గొంతులెత్తి నిరసన స్వరాలను విన్పించాం, మా నిరసనలు అరణ్య రోదనలయ్యాయి. ఊరేగింపులై కదిలాం, పోలీసులను మాపై ప్రయోగించి భగ్నం చేశారు. మా ఆగ్రహం హింసాత్మకంగానూ బద్దలయినప్పుడు, అతి దారుణమైన హింసతో దాన్ని అణిచివేశారు. మాకు మేమే సంఘటితమై, హింసకు ప్రతిహింసతో జవాబివ్వటం తప్ప మాకింకొక మార్గమేమున్నది?''

1971లో ఫాలీ బిల్లిమోరియా రూపొందిన 'క్రైసిస్‌ ఇన్‌ ద క్యాంపస్‌' అనే డాక్యుమెంటరీలో మాట్లాడుతూ జార్జిరెడ్డి వెల్లడించిన అభిప్రాయమిది.... 
1972, ఏప్రిల్‌ 14వ తేది. 
సాయంత్రం నాలుగు కావొస్తోంది.

హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణ విద్యార్థులతో సందడిగా ఉంది.

యూనివర్సిటీ లైబ్రరీలోంచి పాతికేళ్ళ ఓ యువకుడు వెలుపలికొచ్చాడు. ఐదున్నరడుగుల ఎత్తు, తెల్లని దృఢమైన శరీరం, చురుకైన కళ్ళు... నల్ల చారలున్న గోధుమరంగు షర్టూ, బ్లూ కలర్‌ జీన్స్‌, నడుముకు వెడల్పాటి బెల్ట్‌ ధరించాడు. కాళ్ళకు హవాయి స్లిప్పర్లు. పేరు జార్జిరెడ్డి. ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌లో పరిశోధక విద్యార్థి.

దారిలో ఎదురయిన వాళ్ళను పలకరిస్తూ, లా కాలేజి మీదుగా జియోఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌ వైపుగా నడుస్తున్న జార్జ్‌, మిత్రుడు శ్రీధరమూర్తి పిలుపుతో ఆగాడు. అతడూ, మరి కొంతమంది విద్యార్థులూ కలిసి బాడ్మింటన్‌ ఆడుతున్నారు.

''హలో జార్జ్‌, ఆడుతావా కాస్సేపు?''

''లేదులే, ఇంజనీరింగ్‌ కాలేజికెళ్తున్నా, ఎలక్షన్లు రేపే గదా, పనులెంతదాకా వచ్చాయో చూడాలి. హాస్టల్స్‌లో ధూల్‌పేట నించి మనుషుల్ని దించేశారు.''

''మరి, ఒక్కడివే పోవటమెందుకు?''

''అంతమంది పోలీసులున్నారు, ఏం కాదులే!'' ముందుకు నడుస్తూనే శ్రీధరమూర్తికి జవాబిచ్చాడు జార్జ్‌.

యూనివర్సిటీ వాతావరణం పైకి మామూలుగానే కనబడుతున్నా, లోలోపల గూడుకట్టుకుంటున్న ఉద్రిక్తత విద్యార్ధులందరికీ తెలుస్తూనే ఉంది. అది ఏ క్షణాన ఏ రూపంలో బద్దలవుతుందోనన్న ఆందోళన వాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
 ...  ... 
... 
జీవించింది పాతికేళ్ళే అయినా, చే గెవారా లాగా తరతరాలను ఉత్తేజపరిచే ఉద్యమ జీవితం ...
మొదలు పెడితే చివరి వరకూ ఏకబిగిన చదివించే కాత్యాయని గారి అద్భుత శైలి ... 
మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. 
తప్పక చదవండి. చదివించండి.  

జీనా హైతో మర్‌నా సీఖో 
జార్జిరెడ్డి జీవన రేఖలు, 
రచన: కాత్యాయని, 
హెచ్‌బిటి ప్రచురణ, ధర రూ.60/- 
http://hyderabadbooktrust.blogspot.in/2016/01/60.html
Photo
Wait while more posts are being loaded