Profile

Cover photo
pappu sreenivasa rao
Lives in Hyderabad
1,888 followers|709,096 views
AboutPostsYouTube

Stream

pappu sreenivasa rao

Shared publicly  - 
 
హైదరాబాద్ లో వర్షము పడుచున్నది, 'పాదబాటల' మీద వెళ్ళు పాదచారులు ఇంచుక జాగ్రత్త వహించవలెనని సూచన. (కార్టూన్ ఓనర్ గారికి కృతజ్నతలతో)
 ·  Translate
17
pappu sreenivasa rao's profile photoవీవెన్ వీరపనేని's profile photoSujatha Bedadakota's profile photoBhãskar Rãmarãju's profile photo
6 comments
 
తెలుగుకి తెగులు
కొంతకాలం పోతే ఇది తెలుగేనా అనిపిస్తుంది 
 ·  Translate
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
వామ్మో వాయ్యో వాట్సప్ లో గుడ్‌మార్నింగ్ చెప్పలేదని కంప్లైంట్లు చేసే రోజులొచ్చేసాయి నాయనోయ్...వా 
 ·  Translate
16
Nagini Kandala's profile photoమీ భారతీయుడు's profile photo
3 comments
 
Lol.. :D :D
Why don't you wish...?? Its our right... :P :D
https://www.youtube.com/watch?v=lAvPe6RkkG4
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
పాటలు రాయడంలో, రచనలు చెయ్యడంలో కానీ ఎక్కడా ఆలశ్యం చెయ్యకపోడం, అవసరానికి తగ్గట్టుగా అక్కడికక్కడే రాసివ్వడం, వేగంగా కావాల్సిన మార్పులు చేర్పులూ చెయ్యగలగడం వంటి వాటిల్లో ప్రసిద్ధులు కాబట్టి వేటూరి సినిమా పరిశ్రమలోనయినా పత్రికా రంగంలోనయినా అందరికీ కావాల్సిన రచయితగా, గౌరవించబడ్డ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలా ఆయన ఖర్చు విషయంలో నిర్మాతల పాలిట కల్పవృక్షంగా ఉండేవారు
 ·  Translate
12
N.V. Siva Rama Krishna's profile photokamal ji's profile photopappu sreenivasa rao's profile photo
7 comments
 
అవసరమే పెట్టండి +kamal ji 
 ·  Translate
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
మొన్న కొరియర్ కుర్రాడొచ్చి ఓ పేకట్ ఇచ్చి అందినట్టు ఓ సంతకం గీకించుకుని వెళిపోయాడు. చూడ్డానికి భారీగా ఉంది ఇదెవరు పంపార్రా బాబూ అనుకుని డౌటనుమానం వచ్చి మెల్లిగా పై కవరు తీసి చూడగానే కళ్ళు చెదిరే ఫ్రేం కట్టిన నా సొంత పుటొవు, మా ఇంట్లో నన్నే గోడకెక్కిద్దామని ప్లాన్ చేసి నాకే పంపారెవరో అనుకున్నా, వెంటనే నాతో నేనే పుటొవు దిగేసి ఇక్కడ పోస్టేసేసా.
ఇంత శ్రమ తీసుకుని బొమ్మేసి దానికో అద్భుతమయిన ఫ్రేం కట్టించి మరీ కొరియర్ లో పంపిన చిత్రకారిణి '+జయ 'మనస్వి' 'గారికి మీరు ఓ గోప్ప చిత్రకారిణిగా పేరు తెచ్చేసుకోవాలని కోరుకుంటూ శతాధిక ధన్యవాదాలండోయ్. 
 ·  Translate
41
mala kumar's profile photo'నెమలికన్ను' మురళి's profile photoజయ 'మనస్వి''s profile photopappu sreenivasa rao's profile photo
22 comments
 
మురళీ గారో జయ గారు గోడెక్కిస్తే మీరు ఏకంగా మేఘాల్లో తేలించేస్తున్నారు +'నెమలికన్ను' మురళి 
 ·  Translate
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
వేటూరి రచనలలో భావం ఒక broader outline లో అకాశంలో నక్షత్రాలలాగ వెదజల్లబడి ఉంటుంది. ఆ outline పరిధికి లోబడి పాఠకుడు నక్షత్రాల భిన్న కూర్పుతో కవి చెప్పదల్చుకున్న భావాన్నే కాక తనకు తోచిన భిన్న భావరాశులెన్నో సృష్టించుకునే వెసలుబాటు వేటూరి రచనలలో హెచ్చుగా ఉంటుంది. ఏరుకునే వారికి ఏరుకున్నంత. కూర్చుకునే వారికి కూర్చుకున్నంత. అర్థం చేసుకునే వారికి చేసుకున్నంత.
 ·  Translate
14
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
ఈ రోజు వేటూరి జయంతి.ఆ సందర్భంగా వేటూరి వ్రాసిన 'శ్రీ వేంకటేశ్వర పదములు' అన్న ప్రైవేట్ ఆల్బం లో ని ఒక పాట పై విశ్లేషణ  

"వేదాంతం అంతా మూడిటి మధ్య సంబంధం గురించి చెబుతుంది. అవి జీవుడు (జీవాత్మ), ప్రపంచం (జగత్తు), ఈశ్వరుడు (పరమాత్మ). ఈ మూడూ ఒకటే అనేది అద్వైతవేదాంతం. అద్వైతం అంటే – “రెండవది లేనిది” అని అర్థం. అద్వైతసారం: ఉన్నది ఒకటే – బ్రహ్మం. మాయ వలన బ్రహ్మమే విడి విడిగా అనేక జీవులుగా, వస్తువులుగా (ప్రపంచం), ఈశ్వరుడిగా కనిపిస్తోంది. తెల్లదైన సూర్యరశ్మి తేమ ద్వారా చూస్తే ఏడు రంగులుగా కనిపించినట్టు అన్నమాట. శంకరాచార్యుల నుండి, నిసర్గదత్త వరకు గురువులు అందరూ ఇదే విషయాన్ని అనేక దృష్టాంతాలతో (ఉదాహరణలతో) వర్ణించి చెప్పారు. వీటిలోని అనేక అంశాలను స్పృశిస్తూ వేటూరి కలం నుండి పల్లవించిన ఈ పాట" మీకోసం.
 ·  Translate
కథానాయకదర్శకనిర్మాతాదుల ఒత్తిడి లేకుండా వ్రాయడం ఏ చలన చిత్ర కవికైనా వరమే. బహుశా అందుకేనేమో, వేటూరి private albums కొన్నిటికి ఆణిముత్యాల వంటి పాటలు వ్రాసారు. “శ్రీ వేంకటేశ్వర పదములు” అనే…
14
Add a comment...
Have him in circles
1,888 people
mahavir singh rawat's profile photo
Trends Bull's profile photo
Amal Shah's profile photo
kartik pappu's profile photo
BEE VEE ESS AAR KE's profile photo
sunil kumar's profile photo
Sri Kanth Modukuri's profile photo
వెంకట్ బల్లికురవ's profile photo
yadaiah golla's profile photo

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
ఈరోజు వేటూరి గారి వర్ధంతి.ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఆయన వ్రాసిన ఒక పాట సాహిత్య విశ్లేషణ మీకోసం

చంద్రోదయాన్ని కక్షలు, ద్వేషాలూ లేని చల్లని మనసుకి సంకేతంగా చూపిస్తున్నాడు కవి. చంద్రోదయానికి ముందు సంధ్య వస్తుంది, ఈ సంధ్యలో ఎరుపుని “రక్తంతో తడిసిన ఎరుపుగా” వర్ణిస్తున్నాడు. ఇది దాటితేనే వెన్నెల వెలుగులు! గానమనే ఆకాశంలో (గానాంబరం) స్వరసంగతులెన్నో తారల్లా మణికాంతులు వెదజల్లినట్టు నీ మనసులో మానవత్వమూ తళుక్కుమనాలి, “కర్కోటక భావాలు” వదిలెయ్యాలి. హింసా, క్రోధం వద్దనీ, ఎదలోని ఆవేశాన్ని నృత్యంగా మలుచుకోమనీ, అలా చేస్తే చిగురించే (సద్యోజాతం) శాంతస్వరూపానివి అవుతావని హితబోధ చేస్తున్నాడు. స్వర్గంలాంటి జీవితాన్ని పగలూ, ద్వేషాలూ పెంచుకుని వల్లకాడు చేసుకోకు అన్నది సారాంశం. ఎంత మంచి సందేశం!
 ·  Translate
11
1
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి
వేటూరి సైట్ కోసం ఒక యాప్ క్రియేట్ చెయ్యబడింది (ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం) 

లింకిదిగో మీకోసం 

https://play.google.com/store/apps/details?id=appinventor.ai_bandarushiva.veturi
 ·  Translate
A fan site for Veturi Sundararama Murthy, popularly known as Veturi, was a ...
12
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
అప్పుడు అక్కడ ఉన్న నాగార్జున గారు ఈ పల్లవి విని చాలా ఆనందించి, ఇక నుంచి మిమ్మలిని నేను ‘హలో గురు’ అనే పిలుస్తాను అని, అప్పటినుండి ఆవిధంగా పిలవడం చేశారు.
 ·  Translate
8
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
సత్తి....ఓ మంచి పనోడు
ఆయనకూడా తెత్తన్నారండి యెనకాల
నెలబాలుడు..అంటే నేనేనన్నమాట
నాలాంటోడ్ని ఒక్కడ్ని కంటేనే దడుసుకు చచ్చిపోతారు,మళ్ళీ నాలా ఇంకోడా...

సునీల్...పెర్‌ఫెక్ట్ టైమింగ్, వాయిస్ క్లారిటీ,ఒంటినిండా గోదారి జిల్లాల యెటకారం వంటబట్టించుకున్న ఒక చక్కటి నటుడు.ఎటువంటి పాత్రనయినా ఆకళింపు చేసుకుని హాస్యాన్ని చక్కగా పండించగల నటుడు. తెలుగు సినీ చిత్ర రంగానికి లభించిన వరం. తనకి అందివచ్చిన ప్రతి పాత్రనీ సమర్ధవంతంగా పోషించి ప్రేక్షకులని కడుపారా నవ్వించి మెప్పించిన కళాకారుడు.

మనిషికి ఎదగాలన్న కోరిక ఉండడం తప్పులేదు,అందుకు ప్రయత్నించడం కూడా తప్పుకాదు ఒకటి రెండు సార్లు ఓడినా కూడా,కానీ అక్కడ మనం సరిపోము అని తెలిసిన తర్వాత కూడా అక్కడే పట్టుకు వేళ్ళాడుతూ చక్కటి అవకాశాల్ని జారవిడుచుకుంటూ తన భవిష్యత్తుని చేతులారా పాడుచేసుకుంటున్నాడు అనిపిస్తోంది.ఉత్తరోత్రా సినిమా పరిశ్రమ ఒక మంచి హాస్య నటుడ్ని కోల్పోయిందేమో అనిపిస్తోంది.

చరిత్ర గమనించు సునీల్, నీకు ముందు కొంతమంది హాస్యనటులు హీరోలుగా చేసి విజయం పొందినా విఫలం అయినా వెనక్కి వచ్చి తమలోని ప్రతిభాపాటవాలు ఇక్కడే ప్రదర్శించారు, అత్యున్నత శిఖరాలకి చేరారు కూడా.

ఇప్పటికయినా మించిపోయింది లేదు సునీల్ నువ్వు నీ గమ్యం మార్చుకుని నీలోని అసలుసిసలు హాస్యనటుడ్ని మాకు మళ్ళీ ప్రదర్శించాలని కోరుకుంటూ....

నీ అభిమానుల్లో ఒకడు


http://1080.plus/Dg_ldsbfF74.video
 ·  Translate
Watch Sunil Best Comedy Punch Dialogues || Comedian Sunil - VOL 1 Comedian Sunil Varma is one of the Top Comedians in the Telugu Film Industry, having a good sense of humor too and his Bheemavaram accent is a major asset in his comedy punches. Click Here To Watch More Videos : Talking movies with iDream - Exclusive Interview : https://goo.gl/uKKRpo Trending Videos : https://goo.gl/Nn1ETH 2015 Telugu Short Films : https://goo.gl/RqFjRy SIIMA Award...
20
Bhãskar Rãmarãju's profile photo
 
అయ్యబాబోయ్ అని సునీల్ అన్నంత ఇదిగా ఎవ్వరూ అనలేరేమో 
 ·  Translate
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
పాట అనేది శబ్దానికి సంబంధించినది కాబట్టి పాటలో/సంగీతంలో శబ్దాలంకారాలు ముఖ్యం. ఈ శబ్దాలంకారాల వల్ల పాటకి శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం అబ్బి భావయుక్తంగా, లయబద్ధంగా, వినసొంపుగా ఉంటుంది. ఈ విషయం బాగా తెలిసిన వారు కాబట్టే వేటూరి గారు తమ రచనల్లో శబ్దాలంకారాలకి ప్రాముఖ్యత ఇచ్చి సినీ సాహిత్యానికి అర్థ పరంగానూ, శబ్ద పరంగానూ కొత్త సొబగులద్దారు. ఈ పాటలో కూడా ఆది అంత్యప్రాసలు, శబ్దాలంకారాలు, శ్లేష, వర్ణనల్లో కొత్తదనం, పదప్రాసలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వేటూరి గారికి తెలుగు భాషపై, పదాలపై ఉన్న పట్టుని కూడా ఈ పాటలో మనం చూడవచ్చు.
 ·  Translate
12
Add a comment...

pappu sreenivasa rao

Shared publicly  - 
 
#వేటూరి  
పెళ్ళయ్యే వరకూ విరహం తప్పదు కదా! అప్పటి వరకూ చెలిచూపుల ప్రేమలేఖలే శుభలేఖలుగా అందుకోవాలి. ఆ ప్రేమలేఖ “తనని తానుగా ఉండనివ్వని ఊహల జోరుకి తాళలేక” ఆ అమ్మాయి రాసినది! అంతటి ప్రేమా విరహం నిండిన ఘాటైన ప్రేమలేఖ అన్నమాట! (దీనినే వేటూరి “పొలిమేర దాటే చలికాగలేక” అంటూ తనదైన శైలిలో చిలిపిగా పలికించాడు). ఈ విరహాన్నీ, ఈ దూరాన్నీ తగ్గించమని ఆ అమ్మాయి జడలోని జాజిపూలని అబ్బాయి వేడుకుంటే, తమ సువాసననే ఇద్దరికీ మధ్య వంతెనగా వేసి కలిపాయట ఆ విరజాజి పువ్వులు! ఎంత అద్భుతమైన భావం! సాహో వేటూరి, సాహో!
 ·  Translate
9
Add a comment...
People
Have him in circles
1,888 people
mahavir singh rawat's profile photo
Trends Bull's profile photo
Amal Shah's profile photo
kartik pappu's profile photo
BEE VEE ESS AAR KE's profile photo
sunil kumar's profile photo
Sri Kanth Modukuri's profile photo
వెంకట్ బల్లికురవ's profile photo
yadaiah golla's profile photo
Basic Information
Gender
Male
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Currently
Hyderabad