Profile cover photo
Profile photo
Purnachand GV
1,045 followers -
ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, సాహితీ వేత్త, శతాధిక గ్రంథకర్త పరిశోధకుడు, ఆం.ప్ర. ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల గ్రహీత
ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, సాహితీ వేత్త, శతాధిక గ్రంథకర్త పరిశోధకుడు, ఆం.ప్ర. ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల గ్రహీత

1,045 followers
About
Purnachand GV's interests
Purnachand GV's posts

‘తెలుగు భాష – కొత్త రూపు::
మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’
జాతీయ సదస్సు
04-06-2017 ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకూ
విజయవాడ గాంధీనగరంలోని హోటల్ ఐలాపురంలో
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి మూడేళ్ళైన సందర్భంగా ‘తెలుగు భాష – కొత్త రూపు :: మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు” అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ జాతీయ సదస్సు నిర్వహిస్తోంది.
04-06-2017 ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకూ విజయవాడ హోటల్ ఐలాపురంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో జరిగే ఈ సమ్మేళనంలో తప్పక పాల్గొన వల్సిందిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం.
భాషా సంస్కృతుల పరంగా కొందరు నిపుణుల పత్ర సమర్పణలతో పాటు భాషావేత్తలు, సాంకేతిక నిపుణులు, భాషాభిమానులైన ప్రముఖుల అభిప్రాయాలను కూడా ఆహ్వానిస్తున్నాం.
1. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషలో తీసుకురావలసిన మార్పులు
2. నూతన సాంకేతికతా ప్రయోజనాలను ఇంగ్లీషుతో సమానంగా తెలుగు భాషకు కూడా అందించేందుకు చేయవలసిన కృషి
3. పాలనా భాషగా తెలుగు అమలులో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారం
4. తెలుగు మాధ్యమ విద్యాలయాల పరిరక్షణకు, పరిపుష్టికి చేపట్టవలసిన చర్యలు
5. ప్రాంతీయ పదాలుగా ముద్రపడి, నిరాదరణకు గురౌతున్న మాండలిక పదాలను తెలుగు జాతీయ పదాలుగా గుర్తింపు తెచ్చే విషయమై మీ సూచనలు
6. వ్యావహారిక భాష-వ్యాకరణాంశాలు
7. సర్వ సమగ్ర తెలుగు నిఘంటు నిర్మాణం
8. కొత్త తెలుగు నుడి ప్రయోగాలు-పదనిథి
9. యంత్రానువాద ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కారం
10. తెలుగు బోధనా విధానం నవీకరణ విషయమై మీ సూచనలు
11. పాఠ్యపుస్తకాల్లో తెలుగు భాష-నవీకరణ
12. జన సామాన్యంలో వాడుకలో ఉన్న ఇతర భాషా పదాల స్వీకారం
13. సాంకేతికంగా తెలుగు లిపి నవీకరణ
14. శాసనాలు, ఇతర సాహిత్యాధారాలలో కనిపించే ప్రాచీనకాలం నాటి తెలుగు పాలనా పదాలను నేటి వ్యవస్థకు తగిన రీతిలో పునర్నిర్వచించుకో గలగటం.
15. తెలుగు భాష విషయంలో ప్రసార మాధ్యమాల స్వీయ నియంత్రణ-కట్టుబాట్లు
16. వాణిజ్య ప్రకటనల్లో తెలుగు భాష విషయంలో స్వీయ నియంత్రణ-కట్టుబాట్లు.
17. సినిమాలలో తెలుగు భాష స్వీయ నియంత్రణ-కట్టుబాట్లు
18. పొరుగు రాష్ట్రాలలో తెలుగు భాష
19. ప్రజలో, ముఖ్యంగా యువతలో తెలుగు భాషానురక్తిని, తెలుగు సాహిత్యంపట్ల అభిరుచిని పెంపొందింపచేసేందుకు చేపట్టవలసిన విస్తృత కార్యక్రమాలు
20. తెలుగు భాషా పరిరక్షణ కేంద్రాలుగా గ్రంథాలయాల సేవలను వినియోగించటం, గ్రంథాలయ వ్యవస్థకు పరిపుష్టి కలిగించటం.
21. ఇవి కాక తెలుగు భాష నవీకరణకు సంబంధించి ఇంకా ఏదైన కొత్త అంశం పైన కూడా మీ అభిప్రాయాలను వ్రాసి పంపవచ్చు.
మీ అభిప్రాయాలను, సూచనలను apdirectorculture@gmail.comకు గానీ,
శ్రీ గుత్తికొండ సుబ్బారావు, అధ్యక్షులు కృష్ణాజిల్లా రచయితలసంఘం, guttikondasubbarao@gmail.com కు గానీ,
డా. జి వి పూర్ణచందు, ప్రధాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితలసంఘం purnachandgv@gmail.com కు గానీ పంపవచ్చు.
ఈ సదస్సుకు విచ్చేయవలసిందిగా మీకు మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము
కార్యక్రమం
04-06-2017 ఆదివారం
ఉదయం 10 నుండి 11.30 వరకు: ప్రాంరంభ సభ. ఉదయం 11.30 నుండి 1 గంటవరకు: మొదటి సదస్సు
మధ్యాహ్నం 1 గంటనుండీ 2.30 వరకు: రెండవ సదస్సు సాయంత్రం 2.30 నుండి నుండి 4 గంటల వరకు: మూడవ సదస్సు
గమనిక
‘‘తెలుగు భాష – కొత్త రూపు::మారుతున్న సమాజానికి అనుగుణంగా భాషలో రావలసిన మార్పులు’’ జాతీయ సదస్సులో ప్రతినిథిగా పాల్గొనవలసిందిగా మీకు మరొక్కసారి ఆహ్వానం పలుకుతున్నాం
1. ఈ సదస్సులో ప్రతినిథిగా పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు
2. సదస్సుకు ప్రతినిథులుగా రాగోరేవారు తమ పేర్లను శ్రీ గుత్తికొండ సుబ్బారావు, సెల్: 09440167697కు గానీ, డా. జి వి పూర్ణచందు, సెల్: 9440172642కు గానీ చిరుసందేశం ద్వారా తెలియపరచండి.
3. ప్రతినిథులందరికీ భోజనం టీ ఉపాహారాల ఏర్పాట్లు ఉంటాయి. వసతి ఏర్పాట్లు స్వయంగా చేసుకోవలసి ఉంటుంది
డా. దీర్ఘాసి విజయభాస్కర్
సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖఅన్నానికి అన్నమే ప్రత్యామ్నాయం:: డా. జి వి పూర్ణచందు
మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో దేశం మొత్తం మీద ఒక్క తెలుగు వాళ్ళేఅన్నాన్ని తింటున్నారు. ఉత్తరాది వారికి రోటీలే అన్నం. దక్షిణాదిలో తమిళ, కన్నడ మళయాళీలు సాంబారు ప్రధానంగా ఉండే సాపాటు తీసుకుంటారు. వరి అన్నం తెలుగు వారికి ప్రధాన ఆహారం. వరి అన్నానికి కేలరీలు ఎక్కువ కాబట్టి, వరికి బదులుగా రాగి, జొన్న, సజ్జ, ఆరికెలు ఇలాంటి ఆహార ధాన్యాలతోనూ అన్నం వండుకోవచ్చు.
అన్నాన్ని తినాల్సిన పద్దతి ఆయుర్వేద గ్రంథాల్లో వివరంగా ఉంది. కఠినంగా అరిగే పదార్థాలను మొదటగానూ, మృదువైన పదార్థాలను మధ్యలోనూ, ద్రవ పదార్థాలను చివరగానూ తినాలని భావప్రకాశ వైద్యగ్ర౦థ౦లో పేర్కొన్నారు. తెలుగు వారి అన్నం తినే పద్ధతి ఇలానే ఉంటుంది. కూర, పప్పు, పచ్చడి, పులుసు, చారు, మజ్జిగ ఈ వరుసలోనే మనం భో౦చేస్తున్నాం. కాశీ మొదలైన ఉత్తరాది ప్రా౦తాల ప్రజలు నెయ్యీ, నూనెలు కలిగిన రొట్టెలు ము౦దు తిని, ఆ తరువాత అన్నంతో మృదువైన పప్పు, పచ్చడి, ద్రవరూపమైన ఆహార పదార్థాలు తింటారని కూడా ఈ వైద్య గ్రంథంలో ఒక వివరణ కనిపిస్తుంది. ఇటీవల కొన్ని హోటళ్ళవాళ్ళు భోజనానికి ము౦దు పూరీ లేదా పుల్కా ఇచ్చి ఆ౦ధ్రాభోజనం అని పిలవటం మొదలు పెట్టారు. ఇది అన్యాయ౦. తెలుగువాళ్ళకు పూరీ చపాతీలతో అన్నం తినే అలవాటు లేనే లేదు.
అన్నం విషం అనేది అబద్ధం. అన్నానికి బదులుగా ఇడ్లీ, అట్టు, పూరీ, బజ్జీ, పునుగుల్ని తేలికగా అరిగే అల్పాహారంగా అపోహపడి, అన్నం కంటే వాటినే అధికంగా తింటున్నాం. అన్నం విషయంలో మనం కొంత ఆలోచన చేయాల్సి ఉంది. బియ్యం, గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఆరికలు ఇంకా ఇతర తృణధాన్యాలను సద్వినియోగ పరచుకోవటం మీద మన తెలివి తేటలు ఆధారపడి ఉన్నాయి.
అన్నం వలన ఆయువు, వీర్యపుష్టీ, బలం, శరీరకాంతి, పెరుగుతాయి. దప్పిక, తాపం, బడలిక, అలసట తగ్గుతాయి. ఇంద్రియాలన్నీ శక్తిమంతం అవుతాయి. బియ్యాన్ని దోరగా వేయించి వండితే తేలికగా అరుగుతుంది. జ్వరంలో కూడా హోటల్ టీఫిన్లకన్నా జావ, లేదా మెత్తగా ఉడికించిన అన్నమే మంచిది. ఆయుర్వేద శాస్త్రంలో జ్వరం వస్తే అన్నానికి బదులు ఇడ్లీ పెట్టాలని చెప్పలేదు. ఉదయం పూట మెతుకు తగలకూడదంటూ రోజూ టిఫిన్లను తినటం జీర్ణకోశాన్ని దెబ్బ కొట్టుకోవటమే అవుతుంది.
రాత్రిపూట వండిన అన్నంలో పాలు పోసి తోడుపెట్టి ఉదయాన్నే తింటే, చిక్కి శల్యమైపోతున్న పిల్లలు ఒళ్ళు చేస్తారు. తిన్నది వంటబట్టని అమీబియాసిస్ వ్యాధి, గ్యాస్ట్రయిటిస్ అనే పేగుపూత వ్యాధి తగ్గుతాయి. వేయించిన బియ్యాన్ని వండిన అన్నంలో మజ్జిగ పోసుకుని తింటే, విరేచనాల వ్యాధిలో ఔషధంగా పని చేస్తుంది.వాము కలిపిన మజ్జిగ పోసుకొని అన్నం తింటే శరీరంలోని విషదోషాలకు విరుగుడుగా ఉ౦టు౦ది. ఆయా ధాన్యాలను బట్టి కొద్దిగా హెచ్చు తగ్గులున్నప్పటికీ రాగి, జొన్న సజ్జ, గోధుమలతో వండిన అన్నాలకు కూడా ఇవే లక్షణాలు ఉ౦టాయి.
అల్ల౦+ఉప్పు గానీ, మిరియాలు+ఉప్పుగానీ, ధనియాలు+జీలకర్ర+శొ౦ఠి గానీ మెత్తగా నూరిన పొడిని మొదటి ముద్దగా తినటం తెలుగు వారి సా౦ప్రదాయ౦. విందుభోజనాల్లో మొదట లడ్డూని వడ్డించినా దాన్ని మధ్యలో గానీ చివరికి గానీ తినడం మన పద్ధతి. వడ్డనంతా పూర్తయ్యాకే తినడం మానేసి, వడ్డించింది వడ్డించినట్టుగా తినే అలవాటు వలన స్వీటుతో భోజనం ప్రారంభించే అలవాటు కొత్తగా సంక్రమించింది మనకి! భోజనం చివరి భాగంలో కఫం పెరుగుతుంది కాబట్టి,కఫాన్ని తగ్గించే పచ్చకర్పూరం, లవంగం వగైరా వేసిన తాంబూల సేవనతో తెలుగువారి భోజన ప్రక్రియ ముగుస్తుంది. తమలపాకులకు ఔషధంలోని సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శరీర ధాతువులకు అందించే గుణం ఉంది. దీన్ని సర గుణం (వ్యాపించటం) అంటారు.
స్థూలకాయ౦, రక్తపోటు, షుగర్ వ్యాధుల్లో జొన్నలతో వంటకాలు మేలు చేస్తాయి. ఇతర ధాన్యాల కన్నా ఇనుము, జి౦కు ఎక్కువగా ఉ౦టాయి కాబట్టి, జొన్నలు కేలరీలను పెరగనీకు౦డా శక్తినిస్తాయి. కరువు కాల౦లో పండి, అన్నార్తిని తీరుస్తాయి. తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో ఇవి పండుతాయి. ఏ విధమైన రంగూ, రుచీ, వాసనా లేకు౦డా తటస్థ౦గా ఉ౦టు౦ది కాబట్టి, జొన్నపి౦డి వివిధ వంటకాలలో కలుపు కోవటానికి అనువుగా ఉ౦టు౦ది. తెల్ల జొన్న అన్నం బలకరం, రుచికరం, వీర్యవృద్ధినిస్తుంది. లై౦గికశక్తి పె౦చుతుంది. గర్భాశయ దోషాలున్న స్త్రీలకు జొన్నన్నం మేలు చేస్తుంది. తినగానే శరీరానికి వంటబడతుంది. ఆపరేషను జరిగిన వారికి గాయాల పాలిట పడ్డవారికి మంచిది.
జొన్నంబలి, జొన్న స౦కటి, జొన్న రొట్టెలు, జొన్నరవ్వ ఉప్మా, జొన్న కిచిడీ, జొన్న పేలాలు ఇవన్నీ రుచికరంగా చేసుకోవచ్చు. గోధుమపి౦డితో కలిపి పూరీ పరోటా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు, జొన్నరవ్వ కలిపి వండిన జొన్న పులగం చాలా రుచిగా ఉ౦టు౦ది. జొన్న పేలాలు షుగర్ రోగులకు మంచివి, పేగులకు శక్తినిస్తాయి. వీర్య కణాలు తక్కువగా ఉన్నవారు రోజూ జొన్నపేలాలు తింటూ ఉ౦టే వీర్యానికి చలవనిచ్చి కణాల స౦ఖ్య పెరుగుతాయి. జొన్న పేలాల పి౦డిని పాలలో కలిపి పరమాన్నం కాచుకోవచ్చు. పాలలో వేసి తోడు పెట్టి తిన్నా రుచిగా ఉ౦టు౦ది. తాలి౦పు పెట్టుకొ౦టే కమ్మని “జొన్నదధ్ధ్యోదనం” అవుతుంది. చిన్నపిల్లల్లో కలిగే షుగర్ వ్యాధిలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రత్యామ్నాయ ధాన్యాలను కూడా తింటూ ఉ౦డటం అవసరం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మొలకెత్తిన సజ్జల్లో ప్రొటీను అనేక రెట్లు వృద్ధి చె౦దుతుంది. వీటి సన్నని రవ్వతో చేసిన ఉప్మా గోధుమలు లేదా పెసలు సజ్జలతో అట్టు, చక్కిలాలు, కారప్పూస లాంటివి కూడా వండుకోవచ్చు. సజ్జల్లో ప్రొటీను, రాగుల్లో కేల్షియం బాగా ఉ౦టాయి. ఈ రె౦డి౦టినీ కలిపి వండుకొ౦టే వరి అన్నానికి నిజమైన ప్రత్యామ్నాయం అవుతాయి. ‘మొలకెత్తిన రాగులు, సజ్జలు’ బొజ్జలు తగ్గడానికి గొప్ప ఆయుధాలని గుర్తి౦చాలి.
టిఫిన్ల తయారీకి కూడా రాగి, జొన్న, సజ్జ ల్లాంటి ప్రత్యామ్నాయ ధాన్యాలకు ప్రాధాన్యతనిస్తే ఆరోగ్యానికి మంచిది. శనగపిండి, చింతపండు, అల్లం వెల్లుల్లి మషాలా, నూనెలు ఇవి తేలిగ్గా అరిగే అన్నాన్ని కష్టంగా అరిగిస్తున్నాయి. వీటిని వలనే అన్నం “హెవీ” అవుతోంది. మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు, బఠాణీలు, మొక్కజొన్నలు వీటిని ఎక్కువగా తింటున్నాం మనం ఇప్పుడు.
బియ్యంకన్నా వీటిలో కేలరీలు అతిగా ఉన్నాయి. ఈ పప్పు ధాన్యాల్లో బియ్యం వగైరా కలిపి వండిన ఇడ్లీలు, అట్లు, బజ్జీలు, పునుగులూ అన్నంకన్నా కష్టంగా అరుగుతాయి. వీటికి నెయ్యి,కారప్పొడి, సాంబారు, అల్లపచ్చడి, శనగ/వేరుశనగపచ్చళ్ళు తోడు కావాలి. అవి లేకుండా టిఫిన్లను తినటం సాధ్యం కాదు. ఎప్పుడో సరదాగా పండక్కో పబ్బానికో మాత్రమే తినవలసిన టిఫిన్లను రోజూ తప్పనిసరిగా తింటే పొట్ట చెడుతుంది. టిఫిన్లనేవి మన దినచర్యలో ఒక భాగం కాకూడదు. ఏ విధంగా చూసినా టిఫిన్లకన్నా అన్నమే మెరుగు!
అన్నానికి బదులుగా టిఫిన్లను తినటం ఆకలి తీర్చుకోవటానికి కాదు, ఆకలి చంపుకోవతానికి! భోజనానికి ఇంకా సమయం ఉన్నప్పుడు అందాకా ఓ కప్పు కాఫీ/టీ తాగటం ఆకలిని తీర్చటానికా లేక చంపటానికా అనేది ఆలోచించాలి! టిఫిన్లూ అంతే ఆకలిని చంపుతాయి. అవి అన్నానికి ప్రత్యామ్నాయం ఎంతమాత్రమూ కాదు.

నోట్ల రద్దు:: డా. జి వి పూర్ణచందు
అదను దలంచి కూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్ధ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ బొదుగు మూలము గోసిన బాలు వచ్చునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా !
సూర్యుణ్ణి దేవుడిగా భావించి మయూరుడు సూర్య శతకం వ్రాస్తే, సూర్య వరప్రసాదియైన మారవి వెంకయ్య కవి ‘భాస్కరా’ అనే మకుటంతో భాస్కరశతకాన్ని వ్రాశాడు. 1550-1650 కాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, ప్రాంతాల్లో నివశించిన ఈ కళింగ కవి అరసవిల్లి సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ భాస్కర శతకం వ్రాశాడు.
“భాస్కరా ! రాజు ప్రజారంజకుడైతే, ప్రజలు డబ్బు అడిగినా ఉదారంగా ఇచ్చే స్తారు. అట్లా కాకుండా వాళ్లని కొట్టి తెమ్మని పీడిస్తే మొదటికే మోసం వస్తుంది. పశువుల పొదుగు పిదికితే పాలు వస్తాయి. పొదుగు కోస్తే రావు” అంటాడి పద్యంలో కవి.
ప్రజల అవసరాల కొద్దీ ప్రభువు పాలిస్తుంటే, ఆ ప్రభుత్వ ప్రయోజనాలకోసం ప్రజలు కష్టాలు భరించి సహకరిస్తారు. “నేను అర్థరాత్రి నిర్ణయం తీసుకున్నాను. దీనివలన ప్రజలారా! మీకు కష్టాలు కలుగుతాయి. భరించి సహకరించండి... అని ఏ రాజు గారైనా అంటే ఆయన పాలన ప్రజారంజకం అయినప్పుడు ప్రజలు కొన్నాళ్ళు తప్పకుండా భరిస్తారు. సహకరిస్తారు!
రైలురేట్లు ఘనంగా పెంచిన ఒక రైల్వే మంత్రిగారు అదేమిటండీ అనడిగిన వాళ్ళని, “మీకు రైల్వేలు బాగు పడాలని లేదా?, దేశం బాగు పడాలని లేదా?” అనడిగితే, ప్రజలు భరించారు. ప్రభుత్వ భాషలో సహకరించారు. ప్రజలు సహక రించడం అంటే ఏమిటీ...? వేసిన పన్నుల్నీ, పెంచిన రేట్లనీ, చేసిన తప్పుల్నీ ఔదల దాల్చటం. కుయ్యో మొర్రో అని మూలక్కుండా బాధే సౌఖ్యమనే భావనలో జీవించటం ....అంతేకదా!
రేట్లు పెంచినా ప్రజలు రైళ్ళెక్కుతున్నారు కాబట్టి, ప్రజలు ఆమోదించి సహకరించినట్టే! నోట్లు రద్దు చేసినా బ్యాంకు వాళ్ళ ఛీత్కారాలను భరిస్తూ క్యూలో నిలబడి వంటా వార్పు మానుకుంటున్నారు. కాబట్టి, ప్రజల ఆమోదానికి, మోదానికి అది సంకేతంగా ప్రభువులు భావిస్తారు.
పంచాంగ ముహూర్తం ప్రకారం స్వాతంత్ర్యం అర్ధరాత్రి వచ్చిందే గానీ, నిర్ణయం అర్ధరాత్రి తీసుకున్నది కాదు. నోట్ల రద్దూ అంతే! అది సరికొత్త అద్భుత ప్రయోగం కూడా కాదు. 1973లో జనతాపార్టీ పెద్దనోట్ల రద్దు ప్రయోగం చేసింది. కానీ, దాని ఫలితాల మీద విశ్లేషణ లేదు. అ అనుభవాన్ని పరిగణనలోకి ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు, అప్పటికన్నా ఇది ఏ విధంగా మెరుగైనదో తెలీదు. ఇప్పుడు పాతనోట్లు పోయి కొత్త నోట్లు అంతకన్నా పెద్ద డినామినేషన్లో వస్తున్నాయి. ఇవి నల్లబాబుల చేతుల్లో నలక్కుండా నేలమాళిగల్లోకి చేరవన్న హామీ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు.
1968-నూజివీడు హైస్కూల్లో చదువుకునే రోజుల్లో మహాకవి దుర్గానంద్ గారితో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. వారబ్బాయి అంబికానాథ్ నా సహాధ్యాయి. అంతర్గోళాలు, చిరంతన, భీతాంగన లాంటి రచనలు చేశారాయన. చిరంతన ఖండకృతి వ్రాస్తున్నప్పుడు వారిదగ్గరే ఉన్నాను. నాలో సాహిత్య పిపాస కలగటానికి ఆయన ప్రథమ కారకుడు.
అద్భుతమైన సిద్ధాంతాలు అనేకం ప్రతిపాదించేవారాయన. అవి కనీసం యాబై యేళ్ళ తరువాత గానీ జనానికి అర్ధం కానివిగా ఉండేవి. 1960ల్లోనే ఆయన ‘డేటెడ్ కరెన్సీ’ ఉండాలని, నల్లధనాన్ని అరికట్టాలంటే అది చాలా అవసరం అనీ వ్రాశారు. ఆయన సూచించిన పద్ధతిలో మూడేళ్ళ వరకే ఈ నోట్లు చెల్లుతాయని, 1920 వరకే చెల్లుబాటు అని ఎక్స్‘పైరీతేదీతో నోట్లను ముద్రించి జనవరి 1 నుండీ అమల్లోకి తెస్తే సామాన్యుడికి ఇబ్బంది కలగని రీతిలో తీవ్రవాదుల దగ్గర దొంగ నోట్ల చెలామణీని అరికట్టగలిగి ఉండేవారు. మూడేళ్ళకు మించి డబ్బుని ఎవరూ నేలమాళిగల్లో నిలవచేసే అవకాశం ఉండదు.
యూపీ, పంజాబు ఎన్నికలయ్యాక, ఈ నోట్ల రద్దు నిర్ణయం వలన దేశానికి ఆర్ధికంగా ఇంత ఆర్ధిక ప్రయోజనం కలిగిం దని ప్రధాని ప్రెఅకటిస్తే, ప్రజలు కష్టాలు పడినందుకు ఫలితం దక్కింది లెమ్మని సంతోషిస్తారు. భాస్కర శతక కర్త కూడా తనమాట నిజమైందని సంతోషిస్తాడు.
గేదె పాలిచ్చినంత సేపూ అది తన మహిమే నంటాడు. దాని పొదుగు కూడా కోయాలని చూసిన రోజు పాడిగేదె తన ప్రతాపం చూపిస్తుంది. అందాకా భూమాతలా భరిస్తుంది.
దేశంలో నల్లబాబులెవరో చిన్న పిల్లవాణ్ణడిగినా చెప్తారని ప్రధానే స్వయంగా అన్నారు. ఆ నల్లబాబులు 2017లో కూడా అధిక ధనవంతుల జాబితాలో కొనసాగితే, మన నాయకులంతా ఇదే పద్ధతిలో ధన రాజకీయాలు కొనసాగిస్తే, యథాప్రకారం కొండచిలువ మాదిరి రేట్లు పెరుగుతూ పోతుంటే, నోట్ల రద్దు అనేది కొత్త మిలీనియంలో పెద్ద ప్రహసనమే అవుతుంది.

కుదురు దారి :: డా. జి వి పూర్ణచందు
సరిగా తెనుగు నేర్పు చక్కని యేర్పాటు నాటలేదటంచు కనంగ వలయు,
ఎల్లపల్కులకును తల్లి సంస్కృతమనుకొనుట తప్పని కనుగొనవలయు,
తెనుఁగు పుట్టును గుట్టు తెలిసికో, తెన్‘పల్కులెన్నొ కావలెనని యెఱుఁగ
వలయు,
అవి నేర్చుకొనుటకు అనువగు తెరవులు కని, తెల్వి హెచ్చించుకొనగ వలయు,
ప్రాకృతము బాగుగా చదువంగవలయు
మదివిరియఁజేయ ఇంగ్లీషు చదువవలయు
తగిన పొత్తంబులన్ వ్రాసి తనర వలయు
ఇదియె తెనుఁగుతల్లిని కొల్చు కుదురుదారి
మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు కృష్ణాతీరంలో పుట్టి విశాఖ తీరంలో ‘కవిగారు’గా ప్రసిద్ధులైన తెలుగు భాషాభిమాని. భాషోద్యమ ప్రవర్తకుడు. తెలుగు వాళ్ళు ఆంగ్లాన్ని, సంస్కృతాన్ని బాగా చదవాలి. కానీ, వాళ్ళు ఆంగ్లమానస పుత్రులో సంస్కృత మానస పుత్రులో కాకూడదని, తెలుగుని స్వతంత్రభాషగా గుర్తించి, గౌరవించి తెలుగు పుత్రులుగా వెలగాలని చాటిన ఉద్యమ శీలి ఆయన
తెలుగు భాష దేశంలో రెంవ పెద్దభాష. హిందీ తరువాత దేశంలో ఎక్కువమంది ఈ భాషను మాట్లాడుతున్నారు. సంస్కృతం ఇంగ్లీషు ఇంకా ఇతరభాషలను తేలికగా ఇముడ్చుకోగల సౌలభ్యం ఈ భాషకు ఉంది. ఏ భాషా పదాన్నయినా దాని ఉచ్చారణను తెలుగులో వ్రాయగలిగే అనువు తెలుగు భాషకుంది. కాబట్టి, దీన్ని మహాభాషల్లో చేర్చాలని మొట్టమొదటిసారిగా కోరిన వ్యక్తి శ్రీ కవిగారు. వాడుక భాషకు గిడుగు చేసిన సేవ ఎంతటిదో అసలైన తెలుగు భాషకోసం, దాని విరివి(వికాసం) కోసం, దాని ‘కావలి’ కోసం కవిగారు చేసిన కృషి కూడా అంతటిది.
మనం ఆంధ్రులం, తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం గానీ మనలో ఆంధ్రత్వం, తెలుగుతనం కొరవడుతోంది. పేర్లలోనూ పలుకులోనూ, సంతకాల్లోనూ, ఆహార పానీయాల్లోనూ తెలుగుతనం పోతోంది. పండుగలు పబ్బాల్లోంచి తెలుగుతనంమాయమై పోయింది. చదువుల్లో తెలుగు ఎప్పుడో పోయింది. పాలనలో తెలుగు అసలు చేరనే లేదు. వీధుల్లో బడ్డీకొట్లలో కూడా ఇంగ్లీషు లోనే ‘తెలుగుతాంబూలాలు’ అమ్ముకుంటూన్నారు. పూటకూళ్ళ అయ్యలు అన్నాన్ని ‘రైసు’ అంటేనే జనం తింటున్నారని చెప్తున్నారు. అమ్మలు ‘మమ్మీ’లయ్యారు. 1930ల లోనే ఈ పరిస్థితి దాపురిస్తోందని వాపోయిన వ్యక్తి ‘కవిగారు’.
రోజువారీగా మనం మాట్లాడే మాటల్లో ఇంగ్లీషు, సంస్కృతాలను వదిలేస్తే మిగిలే తెలుగు తక్కువ. బస్సు రోడ్డున స్పీడు గా పోతోంది అనే 4 మాటల వాక్యంలో బస్సు, రోడ్డు, స్పీడు మూడూ పోతే, పోతోంది ఒక్కటే తెలుగు. అది కూడా ఎప్పుడు పోతుందో తెలీదు. కవిగారు వీలైనంత వరకు సంస్కృతం లేదా ఇంగ్లీషు లేకుండా తెలుగు మాట్లాడటం, వ్రాయటం గురించి విశేష కృషి, ప్రచారం చేశారు.
కవి గారు వ్రాసిన ఈ పద్యం వ్యాఖ్యానం అవసరం లేని తేటతెలుగులో ఉంది. “సరిగా తెనుగు నేర్పే చక్కని యేర్పాటు ఈ రోజుల్లో లేదు. ఎల్ల పలుకులకీ అంటే భాషలకీ తల్లి సంస్కృతమే అనటం తప్పు. తెలుగు పుట్టు గుట్టు తెలుసుకోండి.తెలుగు లో ఉన్న సంస్కృత మాటలు తెన్ పల్కులే (తెలుగు మాటలే) కావచ్చేమో పరిశోధించి కనుక్కోండి. చక్కని తెలుగు మాటల్ని నేర్చుకోవటానికి అనువైన తెరవులు అంటే పద్ధతులు తెలుసుకుని తెలివి పెంచుకోండి. ప్రాకృతాన్ని బాగా చదవండి. ఆ భాషలో అచ్చతెలుగుపదాలు అనేకం కన్పిస్తాయి. మనో వికాసం కోసం ఇంగ్లీషు కూడా నేర్చుకోండి. చక్కటి తెలుగులో మంచి పొత్తాలు (పుస్తకాలు) వ్రాసి గొప్పవాళ్ళు కండి. ఇదే తెలుగుతల్లిని కొలిచే కుదురు దారి” అంటారు `కవిగారు'.
తెలుగు భాష సంస్కృతం లోంచి పుట్టిందనే వాదాన్ని ఆయన ఒప్పలేదు. సంస్కృతం, తెలుగు అక్కచెల్లెళ్ళే గానీ అమ్మాకూతుళ్ళు కారని, తెలుగులో కనిపించే చాలా సంస్కృతం మాటలు తెలుగు పదాలే కావచ్చని, అవి తెలుగులోంచి సంస్కృతంలోకి వెళ్ళినవి కావచ్చని ఆయన గట్టిగా నమ్మారు. తెలుగు భాషని తెలుగు వాళ్ళకీ, తెలుగేతరులక్కూడా చక్కగా నేర్పేవాళ్ళు లేరని అభిప్రాయపడ్డారు. నిజమే! ఒక విదేశీయుడికి తెలుగు ఎలా నేర్పాలో మన పండితుల్లో ఎంతమందికి తెలుసు?
తెలుగు నేర్చుకుంటే తెలివి పెరుగుతుందనీ, ఇంగ్లీషు నేర్చుకుంటే మనో వికాసం కూడా కలుగుతుందనీ 80 యేళ్ళ క్రితం చాటిన మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారిని సముచిత రీతిలో గౌరవించుకోవటం మన ధర్మం. భాషాభివృద్ధికి కృషి చేసే వ్యక్తులకు ఆయన పేరుతో ప్రభుత్వం పురస్కారం ప్రకటిస్తే భాషను, భాషోద్యమాన్నీ గౌరవించుకొన్నట్టు అవుతుంది.

తెలుగు వారి ‘రస’యోగం
వంటింటి ఔషధం చారు: డా. జి వి పూర్ణచందు
“సారం భోజనసారం సారం సారంగలోచనాధరతః / పిబ ఖలు వారం వారం నోచేన్ముథా భవతి సంసారః -భోజన పదార్ధాలలో సారవంతమైనదీ, సారంగపక్షుల వంటి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృతం కంటే సారభూతమైనదీ చారు (రసం)! అంత సారభూతమైనది కాబట్టే దానికి సారం(చారు, రసం) అనే పేరు కలిగింది. అట్టి సారాన్ని రోజూ తాగని వాడి సంసారం వృథా.” 15వ శతాబ్దినాటి ‘యోగరత్నాకర౦’ వైద్య గ్ర౦థ౦లో తెలుగువారికి ఇష్టమైన ఆహార పదార్థాల వివరణ ఉంది. అందులో చారు గురించి వివరిస్తూ ఈ శ్లోకాన్ని వ్రాశారు. రోజూ చారు తాగితే స్త్రీ పురుషుల్లో లైంగిక శక్తి, ఆసక్తి ద్విగుణం బహుళం అవుతాయని దీని భావం.
చారు గురించి ఇంత ‘చారువాక్కు’ మనం ఎక్కడా చదివుండం. ‘చారుతులసీదళ రామా... ’ అంటే కరివేపాకు దొరక్క తులసాకులు వేసి రాముడు కాచిన చారని నమ్మే ఈ కాలం గణపతులకు చారు మహిమ అర్ధం కాని మాట నిజం. లై౦గిక శక్తిని పెంపొందించే ఔషధాన్ని వాజీకరం (aphrodisiac) అ౦టారు, వంటింట్లో దొరికే గొప్ప వాజీకరం ఈ చారు!
చారు త్రాగితే, పిల్లలకు శరీర దారుఢ్యం, పెద్దలకు ‘ఆ అదనపు’ శక్తీ కలుగుతాయి. సాంప్రదాయ బద్ధంగా చారు కాచుకు తాగితే, ”ప్రియే చారుశీలే” అని పాడని వారు ఉండరు.
‘చారు’ను నమ్మండి!
మించారు అంటే వెలుగు. చారు శరీరానికి మించారుని కలిగిస్తుంది. పచారాలంటే మిరియాలు, ధనియాలు, జీలకర్ర లాంటి సుగంధద్రవ్యాలు. పచారాలతో తయరైనది చారు. అలాంటి చారుకు సరైన ప్రచారం లేదు.
చారుని ‘రసం’ అని, సూపు అనీ, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. సారం అనే సంస్కృత పదం తెలుగు వాళ్ల నోళ్ళలో పడి చారుగా మారింది. చారులో వివిధ పోషక పదార్ధాలతో పాటు మిరియాలు, ఉప్పు జీలకర్ర, ధనియాలు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వీటి సారం ఉంటుంది. అది వాతాది దోషాలు పోగొడ్తుంది. శరీరంలో చురుకుని, నోటికి రుచినీ, జీర్ణశక్తినీ పుట్టిస్తుంది.
కొద్దిగా పెసరపప్పు లేదా అలచందలు కలిపి కాచిన పప్పుచారుని “సూపం” (సూప్ అనే పదానికి ఇది పూర్వ రూపం) అంటారు. చింతపండు లేని పప్పుచారుకట్టు అంటే! ఇది వీర్యవృద్ధిని కలిగిస్తుంది. శోభనం రాత్రి అల్లుడికి పెసరకట్టుతో తేలికగా అన్నం పెట్టి అమ్మాయికి పాల గ్లాసిచ్చి పంపటం ఒక ఆచారం. రాత్రి పూట తరచూ పెసరకట్టు పోసుకుని అన్నం తినేఅలవాటు ఇప్పటికీ చాలా మందిలోఉంది. చారులోనే ఉన్నది పెన్నిధి. మనసు పడిన మగువ, మనసు కింపైన చారు రెండూ సుఖసంసారానికి మూలస్తంభాలు. చారుని నమ్మితే పోయేదేమీ లేదు, అనారోగ్యం తప్ప!
చారును కమ్మగా త్రాగండి
కంచంలో అరచెయ్యిని బోర్లించి, మణికట్టు మునిగేవరకూ చారు పోసుకుని అందులో కొద్దిగా అన్నం బా కలుపుకుని బాగా కలిపితే ఆ చారన్నంలో ఇతర సారములతో బాటు అన్నసారం కూడా ఉంటుంది. చారు త్రాగవలసిన ఆహార ద్రవ్యమే! పులుసులాగా తినవలసినది కాదు. దాని తయారీలోనే ఆ తేడా ఉంది.
దానిమ్మ గింజలు, మామిడి ముక్కలు, వెలగపండు, నిమ్మపండు, టమోటా లాంటి పుల్లని ద్రవ్యాలతో చారు కాచి, ఆవ గింజలతో తాలింపు పెట్టిన చారుని “ రాగం” అని పిలుస్తారు. రాగం సంసారంలో అనురాగం పెంచుతుందన్నమాట. చారులో చింతపండు అతిగా కలపటం అనే అలవాటు తెలుగిళ్ళలో ఎక్కువ చింతపండు నీళ్ళను చారుగా తాగితే జీర్ణశక్తితో పాటు లైంగిక శక్తి కూడా తగ్గిపోతుంది. సంవత్సరం క్రితంనాటి బాగా మాగిన నల్ల చింతపండు కొద్దిగా వేసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజీలో నిలవ వుంచే చింతపండుకి మాగిన లక్షణాలుండవు. కాబట్టి, అది శరీరానికి “చురుకు” పుట్టించకపోగా తగ్గిస్తుంది.
ఏదైనా ఒక ద్రవ్యాన్ని నీళ్ళు పోసి ఉడికించినప్పుడు ఆ ద్రవ్యంలోని సారం నీటిలోకి చేరుతుంది. ఉడికించటం అనే ప్రక్రియను మొదలు పెట్టాక మనిషి మొదట గ్రహించిన సత్యం ఇదే.
పచ్చిద్రవ్యం లోంచి రసం తీస్తే దాన్ని ‘స్వరసం’ అనీ, నీళ్ళలో ఉడికించి నప్పుడు వచ్చిన సారాన్ని కషాయం లేదా క్వాథం అనీ పిలుస్తారు. స్వరసంలో ఆ ద్రవ్యంలోని రసాయనిక విలువలన్నీ పూర్తిగా ఉంటాయి. కరిగే స్వభావం ఉన్న(water soluble) రసాయనాలు మాత్రమే కషాయంలో ఉంటాయి. అందుకని సుగంధ్ద్రవ్యాలతో చేసిన చారుపొడి వేసి చారుని బాగా మరిగించాక, పొయ్యి మీంచి దించబోయే ముందు అందులో టమోటా రసం లేదా నిమ్మరసం లాంటివి కలిపి ఒక్క క్షణం సేపు ఉంచి దించేస్తే ఆ చారులో పూర్తి పోషకాలు పదిలంగా ఉంటాయి.
ఉత్తేజకర ఔషధంగా చారు
అలసటను పోగొట్టి ఉత్తేజితుల్ని చేసే పదార్ధంగా (రెస్టోరేటర్) చారుని పాశ్చాత్యులు గుర్తించింది 17వ శతాబ్దిలోనే! ఈ రెష్టోరేటర్ షాపులే క్రమేణా రెష్టారెంటు వ్యవస్థకు దారితీశాయని (వికీపీడియా సౌజన్యం) రెష్టారెంట్ల చరిత్ర చెప్తోంది. ఫ్రెంచి వాళ్ళు సృష్టించిన వ్యవస్థ ఇది. మొత్తం మీద చారుని ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ నిరూపణ చెప్తోంది.
చారు గొప్ప తనం చెప్పగానే బజార్లో చారు దొరుకుతుందేమోనని వెదకటం మనలోని ఒక బలహీనత. ధనియాలపొడి ప్రయోజనం గురించి ఒక చోట వ్రాస్తే, వెంటనే డజన్ల కొద్దీ ఫోన్లు వచ్చాయి,.” ధనియాలపొడి ఏ షాపుల్లో దొరుకుతుంది?” అని అడుగుతూ. ప్రతిదీ డబ్బు పారేసి కొనేద్దామనే ఆలోచన సరైనది కాదు. అది పరోక్షంగా కల్తీ వ్యాపారానికి దారి తీస్తుంది..
పోషక విలువలు కలిగిన చారుని పాశ్చాత్యులు ఇష్టపడటం మొదలుపెట్టాక చారు తయారీ అనేది ఒక కుటీరపరిశ్రమ అయ్యింది. కొన్ని రసాయనాలు కలిపి నిలవబెట్టి, రెడీమేడ్ డబ్బాచారుని “కండెన్సుడు సూపు” పేరుతో అమ్మటం మొదలు పెట్టారు. ఎగుమతులు దిగుమతులు పుష్కలంగా జరిగాయి. ప్రిజర్వేటర్లు కలిపిన నిలవ చారుకి జనం అలవాటుపడిపోసాగారు. ఆ చారుని ఇంట్లో కాచుకుంటే తాజాగా ఉంటుంది! అందుకు బద్ధకించి, ఇలా విష రసాయనాలు కలిసిన అనేక డబ్బా తిళ్ళకు తలుపులు తెరుస్తున్నాం మనం కూడా!
బహుళార్ధ సాధకంగా చారుపొడి
15-16 శతాబ్దాల కాలంలో యోగరత్నాకరం, భావప్రకాశ, క్షేమ కుతూహలం, లాంటి కొన్ని వైద్య గ్రంథాలు దక్షిణాదిలో వెలువడి ప్రసిద్ధి పొందాయి. ఆరోగ్యం కోసం ఆహార విహారాలను చెప్పటం అనే విధానానికి ఈ వైద్య గ్రంథాలు నాందీ పలికాయి. స్థానికులకు స్థానికంగా దొరికే ద్రవ్యాలే శరీరానికి అనువుగా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. చారు మనకు ప్రాచీన వంటకం. మిరపకారం వెయ్యకుండా వండుకోగలిగిన ఏకైక ఆహార ద్రవ్యం చారు. చారు ప్రత్యేకత ఇదే
మిగతా వంటకాలలో కూడా ఇదే సూత్రాన్ని మనం పాటించవచ్చు. పాటిస్తే మన పూర్వీకుల్లా మనం కూడా పర్వతాలు ఫలహారం చేయగల జీర్ణశక్తిని సంపాదించుకోగలుగుతాం.
క్షేమ కుతూహలం అనే వైద్య గ్రంథంలో వేసవారం అనే చారు పొడి గురించి ఉంది. దీన్ని కూరకారంగానూ, సాంబారు పొడి గానూ, చారుపొడిగా కూడా వాడుకోవచ్చు. ఇది బహుళార్ధ సాధకంగా ఉపయోగపడుతుంది.
చేపలు, మాంసం లాంటివి వండబోయే ముందు వేసవారాన్ని వేసి బాగా ఉడికించి, నీళ్ళు వార్చితే వాటిలోని విషదోషాలు పోతాయని క్షేమకుతూహలం గ్రంథం చెప్తోంది. ఈ పొడిని వేసి వేయించితే కూర కమ్మగా ఉంటుంది. శాకాహారం అయినా మాంసాహారం అయినా ఈ వేసవారాన్ని కూరకారం (కర్రీ పౌడర్)గా వాడుకోవచ్చు. అలాగే వేడి అన్నంలో చింతపండు రస, వేసవారం పొడి తగినంత కలిపితే రుచికరమైన కమ్మని పులిహోర తయారౌతుంది. వేసవారం పొడితో సాంబారు కూడా కాచుకోవచ్చు. చారుపొడిగా దీన్ని వాడుకోవచ్చు.
వేసవారం తయారీ విధానం క్షేమకుతూహలం గ్రంథంలో ఇలా ఉంది: “హిన్గ్వార్థ మరీచం, జీరం, హరిద్రా ధాన్యకం, తథా క్రమేణా వర్థితం” అనే సూత్రం ప్రకారం, ఇంగువపొడి ఒక చెంచాడు, అల్లం ముద్ద రెండు చెంచాలు, మిరియాలపొడి నాలుగు చెంచాలు, జీలకర్రపొడి ఎనిమిది చెంచాలు, కొమ్ములు కొట్టిన పసుపు పదహారు చెంచాలు, ధనియాలపొడి ముప్పైరెండు చెంచాలు -సరిగ్గా ఇదే మోతాదులో కలిపి తగినంత ఉప్పు చేర్చుకుంటే ఆ పొడిని వేసవారం అంటారు.
ఇష్టమైన కూరగాయ, ఆకుకూర లేదా దుంపకూరల రసంలో ఈ వేసవారం పొడిని తగినంత కలిపి మరిగించి, దించేటప్పుడు తగినంత టమోటా రసం కలుపు కుంటే కమ్మని చారు తయారౌతుంది. దీనికి వేరే తాలింపు అవసరం లెదు. కావాలంటే పెట్టుకోవచ్చు. రుచికోసం కరివేపాకు, కొత్తిమీర లాంటివి చేర్చుకోవచ్చు. ఘాటు కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడిని అదనంగా చేకలుపుకోవచ్చు. ఈ ఘాటు చారునే మన ప్రాచీన కవులు “యొర్రచేరులు” అన్నారు.
చారు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి?
వేసవారంతో కాచిన చారుని భోజనానికి ముందు తాగితే నోటికి అన్నహితవు కలుగుతుంది. తినబోయే అన్నం సుఖంగా జీర్ణం అవుతుంది. తిన్నతరువాత భుక్తాయాసం కలుగకుండా ఉంటుంది. ఆహారంలో పోషకాలు వంటబడతాయి.
భోజనం మధ్యలో తాగితే త్వరగా కడుపునిండి, డైటింగ్ చేయటానికి అనువుగా ఉంటుంది. భోజనంలో చివరి ఐటమ్ గా తీసుకుంటే భోజన తృప్తి కలుగుతుంది. ఎప్పుడు తీసుకున్నా దాని గుణధర్మాలలో మార్పు ఉండదు. సారవంతమైన చారులో పులుపు కోసం చింతపండు వాడక పోవటం లేదా అతి స్వల్ప మాత్రలో వాడటం వలన ఉప్పు కూడా చాలా తక్కువగా పడుతుంది. అందువలన బీపీ రోగులకు, గుండె జబ్బులున్నవారికి చెడు చేయకుండా ఉంటుంది
చారులో సారం పెరగాలంటే..?
క్యారెట్, ముల్లంగి, టమోటా, క్యాబేజీ బీర, పొట్ల సొర లాంటి కూరగాయలను అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉడికించవలసిన అవసరం లేదు. ఉడికిస్తే వాటి సుగుణాలు దెబ్బతింటాయి కూడా! ఇలాంటి ద్రవ్యాలను స్వరసం (జ్యూస్) తీసుకుని, కాగుతున్న చారుని పొయ్యి మీంచి దించబోయే ముందు ఆ చారులో కలిపి కొన్ని క్షణాలు ఉమ్మగిలనిస్తే రుచి చెడకుండా ఉంటుంది. పూర్తి పోషకాలు అందుతాయి. టమోటాలను ఉడికిస్తే, సారాన్ని, కమ్మని రుచిని కూడా కోల్పోతుంది.
అన్ని కూరగాయలు, ఆకు కూరల రసాలతోనూ తోనూ మనం చారు కాచుకోవచ్చు. నీళ్ళలో చారు పొడి కలిపి చారు కాస్తారు కదా.... మామూలు నీళ్ళకు బదులు ఇష్టమైన కాయగూరనో ఆకుకూరనో మిక్సీలో వేసి పలుచని రసం తీసి అందులో చారుపొడి కలిపి చారు కాచుకుంటే ఆ కూరలోని పోషక విలువలు కూడా అందుతాయి!
రకరకాల కూరగాయల ముక్కలు వేసి వండిన ధప్పళం పులుసు (ముక్కల పులుసు)ను తెలుగువాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చేమ, కంద, ఆలు, చిలకడదుంపల్ని. ఇఅతర కూరగాయల్నీ పలుచగా గుజ్జు చేసి, వేసవారం పొడివేసి చారు కాచుకుంటే, ఆ “ధప్పళం చారు” అమోఘంగా ఉంటుంది.
చిక్కుడు గింజలు, బీన్సు వీటిని ఉడికించి ఉలవచారు పద్ధతిలో కాచుకుంటే చాలా పోషకవంతమైన చారు అవుతుంది.
కొబ్బరిని తురిమి పిండ వచ్చిన ద్రవాన్ని కొబ్బరి పాలు అంటారు. వేసవారం పొడిని నీళ్ళలో వేసి మరిగించి, పొయ్యి మీంచి దించబోయే ముందు అందులో ఈ కొబ్బరి పాలు, టమోటా రసం, ఎండుద్రాక్ష, కిస్మిస్ లాంటీ డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక్క నిమిషం సేపు ఉంచి దించండి. కమ్మని చారు తయారౌతుంది. ఇది పిల్లలకు పోషకవంతం.
బూడిద గుమ్మడి, గుమ్మడి, సొర, బీర, పుచ్చకాయ, కరుబూజ వీటి పండ్ల రసాన్ని వేసవారం కలిపి చారు కాచుకుంటే చాలా మేలు చేస్తుంది. చలవ చేస్తుంది. వేడి తగ్గుతుంది. రోజుకో రకం కూరగాయలతో చారు కాచుకోగలిగిన వాళ్ళ వంట ధన్యం. ఇది గొప్ప ఉత్తేజకర ఆహార ద్రవ్యం.
బాగా చిలికిన మజ్జిగలో కొద్దిగా ఆవపిండి, తగినంత వేసవారం పొడి కలిపితే కమ్మని మజ్జిగ చారు తయారౌతుంది. దీన్ని కాయనవసరం లేదు. రోజువారీ భోజనంలో మజ్జిగ లేదా పెరుగుకు బదులుగా ఈ చల్లచారును కలుపుకుంటే చలవ నిస్తుంది. అమీబియాసిస్ వ్యాధిలో ఇది ఉత్తమ ఔషధం.
చారుల్లోకెల్లా ఉలవ చారు గొప్పది. స్థూలకాయం తగ్గటానికి ఉలవచారు బాగా తోడ్పడుతుంది. అందులో అతిగా చింతపండు కలపకుండా ఉంటే అది మేలు చేసేదిగా ఉంటుంది. .
రాగిపిండి, జొన్నపిండి, బియ్యప్పిండి వీటిలో ఏదో ఒక దానిని నానబెట్టి, మిక్సీ పట్టి ఒక బట్టలో వేసి పిండితే చిక్కని పాలవంటి ద్రవం వస్తుంది. ఇందులో వేసవారం పొడి వేసి మరిగించి, దించబోయే ముందు టమోటారసం లేదా నిమ్మరసం లేదా దానిమ్మ గింజలు కలుపుకుని, ప్రొద్దున పూట ఉపాహారంగా తీసుకుంటే దండిగా ఉంటుంది.
కూరగాయలే కాదు, మాంసరసాన్ని కూడా చారు కాచుకోవచ్చు. మాంసాన్ని కైమా కొట్టించి నీళ్ళలో వేసి, చారుపొడి కలిపి బాగా ఉడికిస్తే, చిక్కని మాంసరసం తయారవుతుంది. దాన్ని చారుపొడి వేసుకుని చారు కాచుకోవచ్చు.
కొన్ని తెలుగు ప్రాంతాల్లో “బోటి చారు” అనే వంటకం ఉంది. కోడి, బాతు, పావురం లాంటి పక్షుల అంతరావయవాలను బోటి (గిజ్జర్డ్) అంటారు. వీటిని నీళ్లలో బాగా ఉడికించి “బోటి చారు” తయారు చేస్తారు. చారు అంటే నీళ్ళలా పుల్లగా ఉండేది కాదని, అది సర్వశక్తిదాయకమైన గొప్ప పానీయం అనీ గ్రహించాలి. వేసవిలో వడదెబ్బ కొట్టకుండా ఉండాలన్నా, సీతాకాలం వేడి పుట్టాలన్నా, వానల కాలం ఉత్సాహంగా ఉండాలన్నా సర్వకాల సర్వావస్థలందూ చారునే త్రాగండి!
ఈ నెల ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో నా వ్యాసం

కస్తూరి రంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు
అల్లూరి వేంకటాద్రిస్వామి:: డా. జి. వి. పూర్ణచందు
‘అమరము నాంధ్రము కావ్యము’ అంటూ, ఆంధ్ర భాష కూడా దేవభాషేనన్న వాగ్గేయకారుడు శ్రీమాన్ అల్లూరు వేంకటాద్రిస్వామి- తిరువరసుగానూ, శ్రీమత్ పరమహంస తిరువేంగడ రామానుజ జియరుగానూ వైష్ణవ భక్తకోటిలో ప్రసిద్ధుడు. హరికథాగానానికి విశిష్టత తెచ్చినవాడు. భద్రాచల రామదాసు పరంపరకు చెందిన కవి ఆయన.
“యేమయ్యా రామయ్యా” అని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిలా సంభావించిన వాడాయన. శ్రీరంగం రంగనాథస్వామిని కస్తూరి రంగయ్యగా తెలుగింట నిలిపాడు. ‘కస్తూరిరంగయ్య, కరుణింపవయ్య, సుస్థిరముగ నమ్మితి నయ్య’ అనే హరికీర్తన వీరిదే!
“పరాకు సేయుట, పాడిగాదురా పరమపురుష వరదా” పాట హరిదాసుల నోట వినిపిస్తూనే అంటుంది.
‘బిరాన బ్రోవక నిరాకరించుట బిరుదు నీకు దగురా-వరదా’ అని ప్రశ్నిస్తాడు ప్రభువును.
వేంకటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు సిద్ధాంతం నంబి, ఆ నంబి గారి శిష్యుడు బుక్కపట్టణం తిరువేంగడదాసు...ఇలా వీరి శిష్యపరంపర తమిళనాట కొనసాగుతోంది. పెరంబూరులో ‘అల్లూరి వెంకటాద్రి స్వామి భక్తజనసభ’ పనిచేస్తోంది. ‘శ్రీమాన్ అల్లూరి వెంకటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి సంఘం’ శ్రీరంగంలో ఏటా వెంకటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది.
1955లో గానకళాప్రపూర్ణ శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్ పాడిన వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదు కేంద్రాల నుంచి భక్తి రంజని రేడియో కార్యక్రమంలో ప్రసారం అయ్యేవి. విజయవాడ రేడియో కేంద్రంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినపాటల సి డి దొరుకుతోంది.
క్రీస్తు శకం 1807లో అక్షయనామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సోమవారాన ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజాం రాజ్యంలోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహారంలో ఈయన జన్మించారు. శ్రీవత్స గోత్రీకుడు. తండ్రి వేంకయ, తల్లి వేంకమ. ప్రక్కనే ఉన్న జుజ్జూరు గ్రామం లోని నృసింహ దేవాలయంలో ఈయన తపోదీక్షలో ఉండేవాడు. భద్రాచలం నుంచి తిరిగి వస్తూ దారిలో ఆగిన తూము నరసింహ దాసు ఈయనకు తన తంబురా, గజ్జెలు, కరతాళాలు మెచ్చిఇచ్చి ఆశీర్వదించాడు.
ఈ సంఘటన తరువాత వెంకటాద్రి స్వామి పరమ వైష్ణవుడిగా మారిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళి, అక్కడి నుంచి భక్తజనంతో కలిసి కంచి చేరి అక్కడే స్థిరపడిపోయాడు.
ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా కంచికే చేరేవి.
‘శ్రీ వేంకటాద్రిస్వామి హరినామ కీర్తనలు’ పేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తకం వెలువడింది. 170కి పైగా కీర్తనలు ఇందులో ఉన్నాయి. అందులో ఆయన జీవిత చరిత్ర కూడా సంక్షిప్తంగా ఉంది. 1972లో ఆర్ వెంకటేశ్వర్ సంకలనం చేసిన ‘శ్రీ వేంకటాద్రిస్వామి కీర్తనలు’ పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం 2009లో డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్ ఓపెన్ లైబ్రరిలో (ఓఎల్.5402127M) ఉంచింది. 1930 లలో ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా తమిళంలో వెలువడింది.
శ్రీ పి సాంబమూర్తి ‘సౌత్ ఇండియన్ మ్యూజిక్’ పరిశోథనాగ్రంథంలో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువందల సంవత్సరాల జ్ఞాపక సంచికలో ఈయన నివాసం ట్రిప్లికేన్ అని అంది.
ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ‘ఆంధ్రయోగులు’ గ్రంథంలో ప్రచురించిన వ్యాసంలో వేంకటాద్రిస్వామికి పాము పడగ పట్టటం, సీతారాములు కలలో కనిపించటం లాంటి కథలున్నాయి, కృష్ణాజిల్లా జుజ్జూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈయన బాల్యం అంతా గడిచినట్టు కనిపిస్తుంది.
జుజ్జూరులో కొండపైన విగ్రహం స్వయంభువుకాగా, దానికి కొంచెం దిగువున యోగానంద నరసింహస్వామి గుడి అంది. 14-07-1818న పదేళ్ళ వయసులో ఉన్న వేంకటాద్రి స్వామికి తూము నరసింహదాసు తన తంబురా, కరతాళాలు అందించాడు. ఈ తాళాలు, తంబూర... చెన్నై ముత్యాలపేట గజేంద్రవరద మందిరంలో భద్రంగా ఉన్నాయని రామరాజుగారు పేర్కొన్నారు.
29-1-1820 న తన 13 వ ఏట ఎవ్వరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళపాటు అక్కడ రామనామ సంకీర్తన చేస్తూ, తూము వారిచ్చిన తంబురా, కరతాళాలకు అదనంగా కాళ్ళకు గజ్జెలు కట్టి ఆడి పాడటం అలవాటు చేసుకొన్నాడు.
“తంబురు తాళము చేత ధరియించి వేడుక మీఱ గంభీరముగా కాళ్ళగజ్జలు ఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జె0దుచు” అంటూ తన హరికథాగాన విధానం గురించి చెప్పుకున్నాడు.
వరదరాజ స్వామి పుష్ప కైంకర్యానికి పూలతోట పెంచటం కోసం తన ఆటని, పాటని ఉపయోగించుకొని డబ్బు సంపాదించటానికి వీధులలో బిచ్చమెత్తడంతో కంచిలో ఆయన జీవితం ప్రారంభమయ్యింది. ఇది 1828 నాటి సంగతి. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్ళు!
పది రూపాయలైనా కళ్ళచూడనిదే భోజనం చేయకూడదనే నియమం పెట్టు కొన్నాడు. కంచిలో ఇంటింటికి తిరిగి తాను రచించిన కృతులు పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ ప్రాచుర్యాన్ని పొందాడు.
దేశ సంచారం ప్రారంభించి, అనేక వేల రూపాయలు భగవంతుని పేర సేకరించి కాంచీపురంలో దేవీ దేవులకు రెండు పుష్పవనాలు, శ్రీచందనం, శయ్యాగృహంలో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియం మొదలయిన కైంకర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మంటపాన్నీ, ఇంకా కంచి నగరంలో వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేయించాడు. మహాబలిపురం లోని గుడిని కూడా బాగుచేయించాడు.
ఆరాధనాది కార్యక్రమాల కోసం, రూ. 5,000 పెట్టి మామండూరిలో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పించాడు. కంచి వరదరాజ స్వామి కోసం రత్నాలు పొదిగిన వైరముడిని చేయించి, గరుడోత్సవ సమయంలో అలంకరించే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయించాడు.
శ్రీరంగం రంగనాథ స్వామి పాండియకుండె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయించమని కలలో చెప్పగా, నిద్ర లేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బంగారాన్ని, రత్నాలనూ సేకరించటంలో పడ్డాడు. మరకతం ఒక్కటీ దొరకక చింతాక్రాంతుడై ఉంటే మళ్ళీ స్వామి కలలో కనిపించి, బంగ్లాదేశంలో మాధవదాసు అనే ఆయన ఇంట మరకతం తన కోసమే అందనటంతో మాధవదాసుని కలుసుకొని మరకతం తెచ్చి కిరీటం పూర్తి చేయించాడు. రంగనాథుడికి రెండు కిరీటాలు, ఒక మకరకంఠి కూడా చేయించాడు. తిరుప్పళాతురై ఊరుని కొని, దానిని స్వామివారికి నిత్య నైవేద్యాలకోసం సమర్పించాడు.
ఆముక్తమాల్యద కావ్యంలొ ప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవికి అలంకరించే కిరీటం అమ్మవారి కోరిక మీద వీరు చేయించినదేనట! మాన్య మిత్రులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి, అల్లూరి వారు చేయించిన అమ్మవారి వైరముడి కిరీటం చూపించమని అడిగితే పురోహితులు అమ్మవారికి అలంకరించినది అదేనని చెప్పారు.
మదురై దగ్గర ‘తిరుమాలిరుంశోలై’ అనే గ్రామంలో సుందరరాజ స్వామిగుడి విమానాన్ని ఆ స్వామి కోరికమీద నిర్మింప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తోంది.
బహుశా ఒక సంస్థానాధీశుని యావదాస్తీ చాలనంత పెద్ద మొత్తాన్ని వైష్ణవ దేవాలయాల కోసం ఖర్చుచేశాడు. వీరి శిష్యుడు అన్నలూరి నారాయణదాసు ‘రత్నఖచిత మకుటాది విభూషణ రంగనాథ కై0కర్య ధురీణ’ అని గురువుని కీర్తించాడు. ఒక అతిసామాన్యుడు తన నిజాయితీతో ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించ గలడని నిరూపించగలిగాడు వేంకటాద్రిస్వామి. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఆయన వ్యవహరించ గలగటం వలనే ఈ విజయాలు సాధ్యం అయినాయి.
ఆచార్య బిరుదురాజు వారు వేంకటాద్రిస్వామి గురించి ఒక మహిమను చెప్పారు. ఒక రోజు కేవలం 5 రూపాయలే వచ్చిందని భోజనం చెయకుండా అండిపోతే, అప్పస్వామిరాజు అనే ఆంతరంగికుడు గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి ఇంకొక ఐదు రూపాయలు సంపాదించాక స్వామిని ఇంటి దగ్గర దిగవిడిచి అప్పస్వామిరాజు వెళ్ళిపోయాడట. ఆ సాయంకాలం అప్పస్వామి రాజు గారింట్లో భజన కోసం వెంకటాద్రి స్వామి వేడితే అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు మంచాన ఉన్నాడని తెలిసింది. మరి ఆ వేంకటాద్రి స్వామికి గొడుగు పట్టిందెవరు... ?ఊరంతా చూసిన దృశ్యం కదా అది?
ఆయన సంపాదించిన ధనం అంతా ఇలా యాచనద్వారానే అయినా ‘ధనమదాంధుల ద్వారము దూరక కడు ధన్యుడనై నే నుండెదను’ అనటంలోని లోతయిన భావాన్ని అర్థం చేసుకో గలగాలి.
“జాలిజెంది జనుల-బేలనైయాచించి, చాల నలసి సొలసితి-నీవేగతి” అని చెప్పుకుంటాడు.
“కాసు చేయని ఖలులకెల్ల, దోసిలొగ్గి వేసారితి” నంటాడు.
“కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను/అచ్యుతుని దాస్యసుఖమనుభవించెదను” అని ప్రకటించుకున్నాడు.
తన జీవిత చరమాంకంలో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన తంబూర, గజ్జెలు, కరతాళాలు బహూకరించి తన కృషిని కొనసాగించవలసిందిగా కొరాడట . శ్రీ రంగనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసించి, తిరువేంగడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొందారు. కొళ్ళడం గట్టున శ్రీ ‘అళవందార్ పడుత్తురై’ అనే సన్నిథి స్థలంలో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగింది.
శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి కీర్తనలు పేరుతో ఆయన శిష్యపరంపరకు చెందిన శ్రీ పుష్పాలరామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో వావిళ్ళవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని కందపద్యాలు కూడా ఉన్నాయి. అందులో వేంకటాద్రిస్వామి రేఖా చిత్రం కూడా అంది. శ్రీమదాంధ్ర భక్త విజయము అనే గ్రంథంలో వేంకటాద్రిస్వామి జీవిత చరిత్ర కొంత ఉంది. వావిళ్ళ ప్రతికి అదనంగా ఆయన ప్రదర్శించిన కొన్ని మహిమలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఆయనే పంపించారు. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఒంగోలు దగ్గర నూనెవారి పాలెంలో గుడికి రథం చేయించటం కోసం ఇనుప ఊచలు, కర్ర దుంగలను ఖరీదు చేసి, మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషనుకు స్వయంగా ఆయనే తెచ్చారట. కానీ, సమయం లేదని దుంగలు ఎక్కించుకోకుండానే రైలు బయలు దేరితే, వేంకటాద్రిస్వామి ఎలా వెళ్ళగలవన్నట్టు చూశారని, రైలు అకారణంగా ఆగిపోయి, దుంగలన్నీ ఎక్కించుకౌన్నాకే కదిలిందనీ, కానీ, ఆలశ్యం కాకుండా, సరిగ్గా సమయానికే గమ్యస్థానానికి చేరిందని ఒక కథ ఇందులో అంది..
‘ఇంచుకైన దయరాద-యిభరాజవరద’,
‘సజల జలదగాత్రా-సరసిజ నేత్రా-నిజమని నీపదభజన జేసెదు వరద’,
‘ఇంత పంత మేల నాతో నిందిరా రమణా’,
‘నామస్మరణ సేయుడీ జనులార-హరినామ స్మరణ’ ఇలాంటి వీరి కీర్తనలు చదువుకోవటానిక్కూడా మనోహరంగా ఉన్నాయి.
‘దుద్దుపెట్టి నీవు దూరాన యుండక –పద్దులీడేర్చు నీపాల బడితినిక’ ‘ముద్దుపదములందు మువ్వలు గదలగ’ లాంటి చరణాలు ఆయన సాహితీ వైదుష్యాన్ని తెలియచేస్తాయి.
‘ధనమదాంధుల చేరువ జేరక కడు ధన్యుడ నయ్యేదెన్నటికో....” లాంటి పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కొసం ఆయన ఎన్ని అవమానాలు భరించి ఉంటాడో ననిపిస్తుంది.
‘ఇంచుకైన యాది లేదా?’అనే ప్రయోగాన్ని 150 ఏళ్ళక్రితం తమిళ దేశంలోనే జీవితం అంతా గడిపిన వ్యక్తి చేయటం విశేషమే!
“నె0జిలిపడనేల, నిరతము శ్రీపతి మంజులమగు దివ్య మంత్రరాజముగల్గ” అనే అనుపల్లవిలో ‘నె0జిలి’ అంటే ఆందోళన. నీల జీమూతవర్ణ0 అనేది రంగుల్లొ తేడాలను గుర్తి0చటానికి ఉపయోగపడే ప్రయోగం.
‘గట్టి మనసు’ ‘మోడిచేయటం’, ‘వలరాజుకాక’ లాంటి చక్కనితెలుగు పదప్రయోగాలు ఈయన కీర్తనల్లో కనిపిస్తాయి.
“చందురుగేరుమోమందముతో నీ మందహాసము గనుగొ0దు రారా” “దండిపాతకముల నెల్ల మెండుగాను జేసినట్టి దుండగీడనైన నా నెండ యెవరు లెరు తండ్రి”
“నీకే మరులుకుంటిరా నిగమగోచరా”
“ఘోర భవాంబుధి గొబ్బున దాటెడు నెరుపు గని మనవే ఓ మనసా!” “రంగుగ దాసుల రక్షించెడు శ్రీ రంగని మఱచిన దొంగ జనములు”
“దుద్దుబెట్టి నీవు దూరాన యుండక పద్దులీడేర్చు నీ పాల బడితినిక”
“కుదురుగ గూర్చుండి-గోవింద యనగనే”
“ఒప్పులకుప్ప రారా, నే జెసిన తప్పులెన్నకు ధీరా”
“పా0చాలి పరులచే బాధల బడగానె అంచితముగ నీ వక్షయమనలెద?”
“అంతరంగ భక్తమానసంతరంగమందు నేకాంతుడై యున్నవాడు-రంతులేలపోరే మీరు” ఇలాంటి జాను తెనుగు పదాలు చదువుతుంటే మనసు పులకరిస్తుంది.
“అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న, యారగింతువు రంగ మెలుకో” అనే చరణంలో. ఆనబాలు అంటే, నీళ్ళు ఇగిరేంత చిక్కగా కాచిన పాలు అని అర్థం. అవ్వ, చద్ది, రొట్టే అనేవి మూడు వేర్వేరు వంటకాలు. అవ్వ అంటే అవ్వం అనే ప్రసాదం. చద్ది అంటే చలిది అన్నం. తాలింపు పెట్టకుండా చల్ల కలిపిన అన్నం. రొట్టె అంటే పెద్ద పరిమాణంలో వేసిన దిబ్బరొట్టే లాంటి ప్రసాదం. ఈ మూడింటినీ కలిపి అవ్వచద్దిరొట్టెగా ఆయన వ్యవహరించి ఉండవచ్చు.
భావకవులకు పదలాలిత్యం నేర్పిన కవి అల్లూరి వేంకటాద్రిస్వామి. ఆయనను కేవల మహా భక్తుడిగానే చూడటం వలన ఆయన సంగీత సాహిత్య జీవితాలు మరుగున పడిపోయాయి.
ఆయన 1877 వరకూ జీవించే ఉన్నారు. అంతకు రెండుమూడేళ్ళ వరకూ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన్ని తెలుగు సాహితీ వేత్తలు అంత త్వరగా ఎలా మరిచిపోయారో ఆశ్చర్యమే!
సంగీతవేత్తలు సరేసరి. అకాశవాణి, వావిళ్ళ వారు పూనుకొనక పోయి అంటే, అల్లూరి వారి కీర్తనలు, అన్నమయ్య కీర్తనల్లాగే అనేక శతాబ్దాలు మూలపడి ఉండేవి. అంతటి వాగ్గేయకారుని మరిచిపోగలగటం విశ్వాంతరాళంలో ఒక్క తెలుగువారికే సాధ్యమని మరోసారి ఋజువయ్యింది.

Post has attachment
5-10-16 బుధవారం ఆంధ్రభూమి దినపత్రిక సంజీవని పేజీలో నా శీర్షిక: "మీకు మీరే డాక్టర్"లో ఈ వారం:
Photo

Post has shared content
పరిశోధనల్లో అగస్త్యుడి తమ్ముళ్ళు: డా. జి వి పూర్ణచందు
పరిశోధనల్లో అగస్త్యుడి తమ్ముళ్ళు
డా. జి వి పూర్ణచందు
కంటికి నిద్ర వచ్చునె? సుఖం బగునె రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
గంటకుఁ డైనశాత్రవుఁ డొకండు దనంతటి వాడు గల్గినన్
వింధ్యపర్వతానికి తనకన్నా ఎత్తైన వాడు ఎవడూ లేడని గర్వం. నారదు డొచ్చి, “హిమాలయాలు నీకన్నా ఎత్తైనవి” అన్నాడు. తనకన్నా ఎత్తైన వాడు ఒకడున్నాడనేసరికి వింధ్యుడికి హిమవంతుడంటే విపరీతమైన ద్వేషం కలిగింది. మద మాత్సర్యాలకు లోనయ్యాడు. ఆ సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన పద్యం ఇది. కాశీఖండం కావ్యంలోది ఈ సన్నివేశం.
“కంటకంలాంటి శత్రువు ఒకడున్నాడని తెలిశాక ఎవరికైనా కంటికి నిద్ర వస్తుందా? రతికేళి సుఖంగా అనిపిస్తుందా? తిండి సహిస్తుందా? వైభవాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయా?” అంటాడు వింధ్యుడు. కోపంతో విపరీతంగా పెరగటం మొదలు పెట్టాడు. ఎవరెష్టుని మించి ఆకాశం హద్దులు దాటి సూర్యగమనానికి అడ్డుగా పెరిగాడు. దాంతో జనం అగస్త్యుడితో మొరపెట్టు కున్నారు. అగస్త్యుడు వింధ్య దగ్గరకు వచ్చాడు. వింధ్యుడు వంగి తన శిరసు వంచి అగస్త్యుడి కాళ్లకు మొక్కాడు. “నేను దక్షిణాపథానికి వెడ్తున్నాను, తిరిగి వచ్చేవరకూ ఇలాగే వంగి ఉండు” అని ఆదేశించి వెళ్ళి పోయాడు అగస్త్యుడు.అలా వెళ్ళిన వాడు దక్షిణాదిలోనే స్థిరపడిపోయాడు. వింధ్యుడు అలాగే వంగి ఉండిపోయాడు. ఇదీ వింధ్యను వంచిన అగస్త్యుడి కథ.
దక్షిణాపథాన వింధ్య దాటగానే ఆంధ్ర నగరాలు వస్తాయి. ఆంధ్రలో అగస్త్యుడు వైదికధర్మాలు ఎక్కువగా ప్రచారం చేశాడు. తెలుగు వారితో అగస్త్యుడి అనుబంధానికి చాలా సాక్ష్యాలున్నాయి. అగస్త్యుడి పేరుతోనే తెలుగు తల్లులు బిడ్డలకు పాలిచ్చి, కాళ్ళూ చేతులూ తారంగం ఆడించి, పొట్టమీద రాస్తూ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అంటారు.
వాతాపిని మేకలా మార్చి అగస్త్యుడికి వండి పెట్టాడు ఇల్వలుడు. సంజీవని మంత్రంతో ఆవాతాపిని బతికించటానికి ముందే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేస్తాడు. వాతాపి జీర్ణం అయిపోయాడు. అందుకే తెలుగుతల్లులు “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం/గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై/ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై/భీముడు తిన్న పిండివంటలు జీర్ణమై/ అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై/అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై/కుంది లాగా కూర్చొని/నంది లాగా లేచి/తాంబేలు లాగా తాళి/ చల్లగా ఉండాలి/శ్రీరామ రక్ష/నూరేళ్ళాయుస్సు” అని పాడుతుంది తెలుగుతల్లి.
వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని సందర్శించారు. “ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడేగోదావరి ప్రవహిస్తూంది. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకో” అని రాముడికి సూచించింది అగస్త్యుడే! “సీతను భద్రంగా కాపాడుకో”, అని ముందస్తు హెచ్చరిక చేసిందీ ఆయనే! అగస్త్యుడు సప్త మహర్షుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు. సముద్రాన్ని అపోశనం పట్టాడని ఆయన గురించి చెప్తారు. అగ(నగ) అంటే పర్వతం, అస్తి అంటే తోసేయటం, పర్వతాల్ని తోసేయ గలవాడని అర్ధం. మొత్తంమీద మహాశక్తిమంతుడు అగస్త్యుడు. వేదాలలో కొన్ని ఋక్కులు కూడా వ్రాశాడు.
అగస్త్యుడు తిరుపతి దగ్గర కళ్యాణి, భీమ, సువర్ణముఖి నదులు కలిసే చోట నిత్య పూజలకు శివలింగాన్ని ప్రతిష్ఠించి నివాసం ఉండేవాడనీ, ఆకాశరాజ పుత్రిక పద్మావతిని పెళ్ళాడిన శ్రీనివాసుడు వచ్చి ఆయన ఆశ్రమంలోకొన్నాళ్ళు న్నారనీ ఐతిహ్యం. అగస్తీశ్వర క్షేత్రంగా ఇది ప్రసిద్ధి.
తెలుగు నేలమీద అగస్త్యుడి కార్యక్రమాలు వైదిక సంస్కృతిని పరిచయం చేయటానికి ఉద్ధేశించినవిగా కనిపిస్తాయి. ఇక్కడి నుండి తమిళనాడుకు చేరిన అగస్త్యుడు తన వైదిక ప్రచారానికి స్థానిక భాషను కూడా ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. తమ భాషకు వ్యాకరణ కర్తగా తమిళులు అగస్త్యుణ్ణి గౌరవిస్తారు. సిద్ధ వైద్య సాంప్రదాయంలో అగస్త్యుణ్ణి సాంప్రదాయ ప్రవర్తకుడిగా చెప్పుకుంటారు. మొత్తం మీద అగస్త్యుడి కార్యక్రమాలు తెలుగు, తమిళ, మళయాళ ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకరించి జరిగాయి.
అగస్త్యుణ్ణి తమిళులు స్వంతం చేసుకున్నారు. స్వంతం చేసుకోగలగటం గొప్ప. కానీ, అది అతిశయోక్తులకు, అభుత కల్పనలకు దారి తీయకూడదు. తమిళ ప్రాచీన భాషాకేంద్రంలో కేవలం సంగమ సాహిత్యం మీద అనేక పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. ఒక ప్రియుడు తన ప్రియురాలికి కట్టుకునేందుకు ఆకులు ఇచ్చిన కథను బట్టి, సంగమ సాహిత్యం ఆకులు కట్టుకుని తిరిగే ఆదిమ కాలం నుండీ ఉన్నదని ఆయన చెప్తుంటే ఆశ్చర్యం వేసింది.
జైన బౌద్ధ సాహిత్యాలలో ఆంధ్రుల గురించి ఉన్న ఆధారాలను కూడా మనం పట్టించుకోవట్లేదు. లేని ఆధారాల మీద అక్కడ కోట్ల రూపాయల పరిశోధనలు సాగుతున్నాయి.

‘అగస్త్యభ్రాత’ అంటే అగస్త్యుడి తమ్ముడు అని ఒక జాతీయం ఉంది. అగస్త్యుడు కలశం లోంచి పుట్టాడు. ఆయనకు అన్నదమ్ములెవ్వరూ లేరు. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పటాన్ని ‘అగస్త్యభ్రాత’ అంటారు. అగస్త్యుడి తమ్ముళ్లపైన పరిశోధనలు సాగితే వింధ్య పర్వతం తిరిగి లేచి నిల్చునే ప్రమాదం ఉంది.

ఆపరేషన్ రావణ:
డా. జి వి పూర్ణచందు

అలసట డస్సి నా కడకు నావహనమాడగ రాకు మెప్డు, మి
క్కుటముగ నింతవాడ ననుకొంచును యుద్ధము చేయబోకు,దో
పటుతరశక్తి యస్త్రముల పట్టును ధారణచేసి రమ్ము, నెం
తటి రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్
రామరావణ యుద్ధం ముగింపు దశకు వస్తోంది. రోజుకో టెర్రరిష్టు బృందాన్ని రాముడి మీదకు పంపి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న రావణుడు యుద్ధరంగంలో అలిసిపోయాడు. రావణుడి దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. అవి రామదండులో కొంతభాగం సేనను నాశనం చేయగల శక్తిమంతమైనవి. కానీ, రాముడి దగ్గరున్న దివ్యాస్త్రాలు రావణుడితో సహా మొత్తం లంకా రాజ్యాన్నే నాశనం చేయగలవని విభీషణాదులు హితబోధ చేశారు. అయినా రావణుడు టెర్రరిజాన్ని పోషించే విధానాన్ని వదల్లేదు.

ఇప్పుడు పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. యుద్ధం నిరాఘాటంగా సాగుతోంది. అక్కడ రావణుడి తలుతెగి పడ్తుంటే తిరిగి కొత్త తలలు పుట్టుకొస్తు న్నాయి. ఇక్కడ రాముడి దగ్గర సంజీవని ఉంది. చచ్చిన వానర సైన్యం తిరిగి బతికొస్తున్నారు. ఎవరికీ గాయాల బాధ లేదు. గాయం తగలగానే మాయమైపోతోంది. రావణుడిది వంటరి పోరాటం. శుద్ధ భారతీయ వ్యతిరేకత అతని విధానాలకు మూలం. రాముడిది సమూహ శక్తి. తీవ్రవాద వ్యతిరేకత అతని విధానం.

విభీషణుడు ఐక్యరాజ్య సమితి లాగా టెర్రరిజం మంచిది కాదని, అది లంకకే చివరికి చేటు తెస్తుందని చెవినిల్లు కట్టుకు పోరాడు. టెర్రరిజాన్ని ఆరంభించనే కూడదు. ఒకసారి అందులోకి దిగితే బయటకు రాలేరు, ‘ఈత నేర్చినవాడు ఏటిలోనే పోతా’ డనే సామెత మాఫియాలకు, డాన్లకు, టెర్రరిష్టు మూకను ప్రేరేపించే దేశాధి నేతలకు బాగా వర్తిస్తుంది. పాకిస్తాన్ పాలకులెవరికీ సహజ మరణం లేదందుకే! రావణుడి తత్త్వానికి వీళ్ళు ప్రతీకలు కాబట్టే!

యుద్ధం సాగుతున్న దశలో ఆ సాయంత్రం ఘడియల్లో రావణుడి చేతిలో ఆయుధాలన్నీ అయిపోయాయి. తెగిన అవయవాలను అతికించుకునే పనిలో పడ్డాడు. రాముడి బాణాలను తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయింది. తన సైన్యాన్ని, రాజ్యాన్ని కాకుండా తనను రక్షించుకునే పనిలో పడటం ఏ దేశాధినేతకైనా ఇబ్బందే! యుద్ధంలో ఎల్లకాలం గెలుపు మన వైపే ఉంటుందని హుంకరిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.

రావణుడు నిస్సహాయంగా నిలబడి పోయాడు. అలసట అతని ముఖంలో కొట్టొస్తోంది. ఆ సమయంలో రావణాసురుణ్ణి అంతం చేయటం రాముడికి చాలా తేలిక. కానీ, ఆయన అలా చేయలేదు. “తెచ్చుకున్న ఆయుధాలన్నీ అయిపోయాయా...? బాగా అలిసి పోయినట్టున్నావు...నేడు పోయి రేపు రా” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన పద్యం ఇది.

“రావణా! అలిసి పోయాక కూడా నా ముందు నిలబడే సాహసం ఇంకెప్పుడూ చెయ్యకు. ఆయుధాలన్ని అయిపోయి దిక్కు తోచకపోయినా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని అహంకరించా లనుకోకు. ఇంటికి పోయి కాసేపు పడుకో...నీ చేతులకు కాస్త శక్తి వస్తుంది. అప్పుడు మళ్ళీ రా! వచ్చేప్పుడు నీ దివ్యాస్త్రాల మంత్రాలన్నీ ఒకసారి చదువుకురా! ఒక్క దెబ్బకు దిమ్మతిరిగి మంత్రం మర్చిపోతావు. అవతలి వాడి శక్తిని అంచనా వేయటం చేతకాని వాడివి...నువ్వేం వీరుడివి...? ఇవ్వాళ్టికి పోయి రేపు రా!” అన్నాడు.

ఇది యుద్ధ నీతి. రాముడు దాన్ని పాటించాడు. భారతదేశంతో నాలుగుసార్లు యుద్ధంచేసిన పాకిస్తాన్ ప్రతి యుద్ధం లోనూ ఓడిపోయింది. అయినా, దానికి దివ్యాస్త్రాలతో పాటు జవసత్వాలను సమకూరుస్తున్న దేశాలు దాన్ని టెర్రరిజ స్థావరంగా మార్చేశాయి. టెర్రరిజం తాకిడికి గాయపడిన దేశాలు కూడా తమ రాజకీయ ప్రయోజనం కోసం పాకిస్థాన్‘కి సాయపడ్తున్నాయి. తమ మీద కాకుండా తమ శత్రువు మీద ప్రయోగిస్తే టెర్రరిజం మంచిదేననే భావన ప్రపంచ దేశాధినేతల్లో బలంగా ఉంది. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే అంశం.

“రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్” అనే పాఠాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ నేర్చుకోదని అనేక సార్లు ఋజువయ్యింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నిన్న జరిగిన భారత ప్రతీకార దాడి- చూసి రమ్మంటే హనుమంతుడు కాల్చి రావటం లాంటిది. మచ్చుకి ఒకటిగా జరిగిన సంఘటన మాత్రమే! అసలు యుద్ధం ముందుముందుంది. పాకిస్తాన్ అలిసిపోయి నిస్సహాయంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ‘ఆపరేషన్ రావణ’ ఆఖరి టెర్రరిష్టు అంతమయ్యే దాకా ఆగకూడదు.
Wait while more posts are being loaded