Profile cover photo
Profile photo
Nagh Raj
371 followers -
Happy Man :-)
Happy Man :-)

371 followers
About
Nagh's posts

Post has attachment
#ఊకదంపుడు   #ChennaiRAINS  

+మీ భారతీయుడు +Andy Dufresne లకు అంకితం!! 

యాక్చువలీ..., 
నిజం చెప్పాలంటే..
అసలేం జరిగిందంటే..., 
మిస్టర్ వరుణ్ (rain god) తన అండమాన్-టు-చిరపుంజి రెగ్యులర్ బిజినెస్ ట్రిప్ కోసమని.... ఇండిగో ఫ్లయిట్ వాడైతే క్యాట్ కార్డ్ కన్సెషనూ, సీనియర్ సిటిజెన్ డిస్కౌంటూ ఇస్తాడని చెప్పి... కక్కుర్తి కొద్దీ అందులో టికెట్ బుక్ చేశాట్ట. తీరా, విమానమెక్కాగ్గానీ తెలీలేదు, వాడు పక్కూరుకెళ్లడానిక్కూడా ప్రపంచం మొత్తం తిప్పేసుకొచ్చే హైదరాబాద్ సెట్విన్ ట్రావెల్స్ లాంటి తింగరోడని. ఫ్లయిట్ టేకాఫ్ అయ్యాక... ఆ ఇండిగో పైలట్ భడవఖానాకి చిన్నప్పుడెప్పుడో తిన్న సాంబారిడ్లీ గుర్తుకురాటంతో, ఎవరికీ చెప్పాపెట్టాకుండానే, ఉన్నపళంగా ఇండికేటర్ వేసి, గేర్లు ఎడాపెడా మార్చేసి, లెఫ్ట్ టర్న్ తీసుకుని, రయ్... మని చక్కా విమానాన్ని తీసుకెళ్లి చెన్నై ఏర్ పోర్టులో ఓ మూలగా పార్కు చేసి.. మురుగన్ బడ్డీకొట్టు వెదుక్కుంటూ వెళ్లిపోయాట్ట. అప్పటికీ ప్రయాణీకుల్లో ఎవరో అడిగార్ట... ఏంటి బాసూ... అప్పుడే డెస్టినేషను చేరిపోయామా అని... అబ్బా... ఆశ, దోశ, మురుగన్ సాంబారిడ్లీయేం కాదూ... అని పళ్లికిలించేసి, ఓ అరగంట ఫ్యూయల్ ఫిల్లింగుందని ఏదో కాక్ అడ్ బుల్ స్టోరీ చెప్పేసి, చెన్నై సంద్రమా అని ఆడియో సాంగ్ పెట్టి... డ్రైవింగు టైంలో కళ్లల్లో అంతరిక్షధూళి పడకుండా పెట్టుకున్న త్రీడీ నల్ల కళ్లజోడుని సల్మాన్ ఖాన్ లాగా స్టయిలిష్ గా తీసి... షర్టు వెనక కాలరుకు తగిలించుకుని, అదేదో లుంగీ డాన్స్ లుంగీ డాన్స్ అనే అరవ పాట హమ్ చేసుకుంటూ కిందకి దిగిపోయాట్ట. పోనీ, ఆ ఇండిగో యాజమాన్యం దరిద్రులన్నా.. మన పైలట్ భడవ ఫోన్లో కనీసం ఐడియా నెట్ వర్కోడి IIN ప్యాకేజీయన్నా వేయించిన పాపాన పోయారా అంటే.... అదీ లేదు. దీంతో ఒకప్పటి ముష్టి మురుగన్ ఇప్పుడు సెభాష్ శరవణన్ గా గొలుసు బిజినెస్ టైకూన్ గా ఎదిగాడనే సిల్లీ సింపుల్ ఇన్ఫర్మేషన్ మనోడు మిస్ కొట్టాడు. ఆ పైలట్ వాడు T-నగర్ వీధుల్లో సాంబారిడ్లీ కోసం ఇప్పటికీ కాళ్లు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉన్నాట్ట. నిజానికి మన వరుణ్ బయల్దేరే ముందు, తన బెటర్ హాఫ్ (మిసెస్ కాళికా వరుణ్) బోల్డంత గారాభం ఒలకబోస్తూ, తాంబూలం నోటికందిస్తూ... ప్లీజ్ డియర్, ఈసారికి ఏదో సత్తరకాయ రీజన్ చెప్పి, సిక్ లీవ్ పెట్టేయరాదూ, ఎంచక్కా మిరపకాయ్ బజ్జీలేసుకు తింటూ, వైకుంఠపాళి ఆడేసుకుందాం అని ఆఫరిస్తే... ఆవిడ ప్యాకేజీ ఓ పక్క టెంప్టింగుగా ఉన్నా, వర్క్ ఈజ్ వర్షిప్పూ, డ్యూటీ ఈజ్ గాడిద గుడ్డూ అంటూ లెక్చరిచ్చి మరీ బయల్దేరాట్ట. తీరా.. ఇప్పుడు తిక్క బాగా కుదిరింది, ఇక్కడ అరవదేశంలో లాక్కోలేక, పీక్కోలేక ఛస్తున్నా.. అని ఫ్రస్ట్రేషన్లో ఉండగా, పక్కనే ఫ్లయిట్ విండో వద్ద ఎవడో కూలింగ్ గ్లాసెస్... కూలింగ్ గ్లాసెస్ అని వేలం పాట పాడుతుంటే, పాతిక రూపాయలెట్టి ఒకటి కొనేసుకుని, ఆ నల్ల కళ్లజోడు మాటున, ముఖాన్ని మోకాళ్ల మధ్యలో పెట్టుకుని భోరున విలపిస్తున్నాట్ట మిస్టర్ వరుణ్. అతగాడి ఏడుపు తాలూకు ఎఫెక్టే చెన్నై పాలిట శాపమైందిట. చూడు బాసూ... ఎవరన్నా ఆ రజినీకాంత్ మొబైలుకి ఫోను చేసి... విషయం చెప్పి.. ఆ పైలట్ సచ్చినోణ్ని పట్టుకురమ్మణి చెప్పండయ్యా... అసలే జనాల పరిస్థితి మునిగిపోతున్న టైటానిక్ షిప్పు ప్రయాణీకుల్లా తయారైంది! ;)

పాప పరిహారం: ఫేసుబుక్కులో ఓ పోస్టులో కామెంటు రాద్దామని మొదలెడితే... అదేదో చినికీ చినికీ, చిరిగి చాంతాడై, చాటంతైంది. నేను Idea వాడి IIN వినియోగదారుణ్ని కాబట్టి... ఓ పోస్టేస్తే పోలా అనే దిక్కుమాలిన ఐడియా వచ్చింది... ప్లస్సు పునర్దర్శనమైనట్టూ ఉంటుందీ... ఓ పోస్టేసినట్టూ ఉంటుందీ అని. అద్దీ విషయం... చిత్తగించవలయును ;))) (ఉట్టినే సరదాకి) 
Photo
Photo
2015-11-23
2 Photos - View album

Post has attachment
#కామిడీపీస్  

తత్వబాదుడు!! 
ఎవరన్నా చదవకపోయుంటే... ;)

Post has attachment
#wimbldon_season

జోకర్ వర్సెస్ షరపోవా, కమర్షియల్!!

సచిన్, ద్రవిడ్ ఉన్నంతకాలం క్రికెట్ చూడాలనిపించేది. క్రికెట్ గాడ్, గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ చూట్టం పట్ల ఆసక్తి పెద్దగా లేకుండా పోయింది. ఇంకో కారణం, బెట్టింగ్స్ అండ్ ఫిక్సింగ్స్ లాంటి జాఢ్యాలు. నిజానికి ఏ గేమ్ తీసుకున్నా బీభత్సమైన కమర్షియలైజేషన్, బెట్టింగ్స్, ఫిక్సింగులకు వేదికలుగా మారిపోయాయేమో!! ఉన్నంతలో కాస్త టెన్నిస్ బెటరనిపిస్తుంది. సంప్రాస్ టైంలో డెవలప్ అయిన టెన్నిస్ ఇంట్రెస్ట్ ఫెదరర్ క్లాసిక్ గేమ్ కారణంగా పీక్స్ కెళ్లి అడిక్ట్ అయిపోయాం. నాదల్ లాంటి మొండిఘటాలు, జోకర్ అలియాస్ జకోవిచ్ లాంటి invincible fellows (for now), ముర్రే , వావ్రింకా, సోంగా (టెన్నిస్ మహమ్మద్ అలీ) లాంటి వాళ్లు ఎరీనాలో ఉండడంతో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మ్యాచులు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక వింబుల్డన్ అంటే క్వీన్ ఆఫ్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్!! అత్యద్భుతమైన పచ్చిక మైదానాలు, క్లాసికల్ వైట్ అండ్ వైట్ డ్రెస్, ఎంతో హుందాగా ఉండే బ్రిటిష్ అభిమానులు.. వాహ్, అదొక ఫీల్.! వింబుల్డన్ చూట్టం మాత్రం ఎప్పుడూ గొప్ప అనుభూతే, ఇది క్లాసికల్ స్పోర్ట్స్ అభిమానుల మాట అన్నమాట, అంటే మనం అదే కేటగిరి అన్నమాట, కికికి ;)))

Heart Breaking news: స్పెయిన్ బుల్ నాదల్ ను, వాడెవడో నెత్తిన గద్ద గూడు కట్టుకున్న జర్మన్ ఫెలో... అన్ సీడెడ్ డస్టిన్ బ్రౌన్ ఓడించడం, హ్మ్, నాదల్ శకం ముగిసిందేమో అనిపిస్తుంది. ఫెడెక్స్ ఎంతదూరం బండి లాగిస్తాడో చూడాలి!!

Post has attachment
#wimbledon_season

Perfect FedEx...!

Post has attachment
Lovely Tribute to Leo Tolstoy !!

Post has attachment
Interesting!!

Post has attachment
Well done, Mr Fedex !
You are the phoenix !!

Post has attachment
బుల్లెట్ దిగింది!!

నిన్న రాత్రి...
ఈటీవీ ఆఫీసులో...
ముందర LED Screen పై  ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఉమెన్ క్వార్టర్స్ మ్యాచ్ జరుగుతుంటే కళ్లల్లో రెండు టెన్నిస్ బంతులేసుకుని గుడ్లగూబలా కళ్లప్పగించి చూస్తా కూకున్నా. మా ఊరి పొలాల్లో ఉండే ఎర్రమట్టి, ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కోర్టులో ఉండే ఎర్రమట్టీ ఒకటేనా? ఒకేళ సచిన్ క్రికెట్టులో కాకుండా టెన్నిసులో సెటిలయ్యుంటే, బాగా పొట్టిగుంటాడు కదా, అతగాడు ఇందులో ఎక్సెల్ అయ్యుండేవాడా?? దేవుడా, ఈ లేడీ ప్లేయర్లంతా కాస్త పొడుగైన, ఒద్దికైన డ్రెస్సులేసుకుని ఆడితే వాళ్ల సొమ్మేం పోతుందీ???? ఇలాంటి సవాలక్ష తింగరి థాట్స్ మైండులో మెదలుతుండగా... మొబైల్ రింగైంది. ఏదో 9 సిరీస్ నెంబర్. మొన్నామధ్య బుల్లెట్ బాబా ఇచ్చిన డోసుకి, అన్ నోన్ నెంబర్లంటేనే గుండెల్లో గూడ్స్ రైళ్లు పరిగెడుతున్నాయ్, ఎవ్వరు ఏ ఝళఖ్ ఇస్తారోనని! ఐనా, జుట్టంటూ ఉన్నాక రాలకా, ఫోనంటూ ఉన్నాక లిఫ్ట్ చేయకా తప్పదు కదా. కంపారిజన్ లో క్లారిటీ లేదా? కొన్నిసార్లు ఉండదు. సర్దుకుపోవాలి. కర్సర్ స్వైప్ చేసి...
‘‘హలో, ఎవరు?’’
‘‘కికికి, కుకుకు, హహహ, హుహుహు. ఒకటే నవ్వులు’’
‘‘(మళ్లీ బుక్కయిపోయాన్రా బాబోయ్), ఎవరండీ బాబూ’’
‘‘రకరకాల టైపుల్లో విరగబడి నవ్వులు, కిందపడి నవ్వులు, బోర్లాపడి నవ్వులు’’
‘‘(ఛస్, ఎధవ జీవితం, గ్రహాలు పగపట్టి మరీ సాధిస్తున్నట్టున్నాయ్), ఎవరదీ’’
‘‘అదేదో సిన్మాలో వీరోయిన్ గుక్కపట్టి నవ్వినట్టు ఓ.. ఒకటే నవ్వులు’’
‘‘(ఓంకారన్యాలాగా, నేనేమన్నా ఇకఇకలు-పకపకలు పోటీకి జడ్జీనా సామీ) ఎవరబ్బా?’’

ఫోన్ కట్....
వామ్మో... ఏందిది, హరాస్ మెంటుకు ఇంటర్వెల్ బ్యాంగా? చచ్చాంపో, ఇన్ స్టాల్మెంట్సులో వేధింపు యాత్ర మొదలెడతారేమో... బిక్కు బిక్కు... మళ్లీ కాల్.

‘‘ఎవరండీ’’
‘‘నెల్లూరు పెద్దారెడ్డి ఉన్నారా?’’
‘‘(నెల్లూరు సెటిలర్లని ఆ ఫాంహౌజ్ విస్కీఆర్ తాగి తరిమేశాడుగా) ఊ, ఉన్నాడు’’
‘‘ఐ వాన్నా టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ.... కికికికికి ’’
‘‘(హు, నిండా మునిగినోడికి కోల్డేంటి?) నేనూ... నవ్వులే నవ్వులు’’
‘‘అటేపూ...  నవ్వులే నవ్వులు’’
‘‘ఇటేపు నుండి... కాలర్ ఎవరో తెలిసిపోయిందనే టైపు తింగరి నవ్వులు’’
‘‘అవతల నుండి... కామరాజును మాటాడుతున్నా’’
‘‘నేనేమో... ఎగబడి ఎగబడి నవ్వులు(నువ్వు కామరాజువైతే నేను నాగరాజును)’’
‘‘ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు?’’
‘‘చంపేశారుగా, నేను డ్యూటీలో; మీరు ఇక్కడేనా ఉండేది హైద్రాబాదులో’’
‘‘ఊహూ, పెద్దారెడ్డి నెల్లూరులో ఉంటాడు’’
‘‘అహ్హా... ఐతే, ఆ షార్ట్ (కట్) ఫిల్ములన్నీ నెల్లూరునుండే దిగుమతి చేస్తుర్రా బాబయ్యా?’’
‘‘మళ్లీ నవ్వులు... ఈసారి పల్టీలు కొట్టి మరీ... నవ్వులు’’
‘‘మళ్లీ ఏమైంది సామీ.... నవ్వడం నీ మేనరిజమా? సంపేత్తున్నావుగా, నవ్వుల్తో’’
‘‘నేను యాండీని. యాండీ డూఫ్రెన్ +Andy Dufresne!!’’

ఓర్నాయనో... ఏందీ అరాచకం? ఈ లెవెల్లో మాస్టర్ ప్లానా??
షాక్ టు ది పవర్ ఆఫ్ షాక్!! బుల్లెట్ దిగింది. రంగు పడింది.

ప్లస్సు మిత్రుల పాలిట బర్త్ డే గ్రీటింగ్స్ స్పెషలిస్టు, రెబెలిస్ట్, మంబయ్ మినీ మాఫియా డాన్... ఇహ మొదలెట్టాడబ్బా ఫోన్లో గానా బజానా. ఓ పది నిమిషాలు... ప్లస్సు ఫ్రెండ్సందరిపై ఒహటే కామెంట్లు, సెటైర్సు, పై న్నుండి దొర్లి దొర్లి నవ్వులు. నేనేమో నవ్వలేక చచ్చిపొయ్యాననుకోండి. అద్దీ సంగతి. చిత్తగించవలెను!!

ఆ... ఏవన్నారు... ఏంటా కామెంట్లూ, సెటైర్సూ అనడుగుతున్నారా???
భలేవోరే.. అయ్యన్నీ చెబితే ఇక ప్లస్సులో మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోదూఊఊఊ.. సత్యం సత్యేణ సీక్రెట్టు... అని ఓ ముతక సామెత. (సరదాకి)
+Andy Dufresne, +Sreenivasa Rao Kamaraju & +ఫోటాన్ బాబా :-)))

Post has attachment
మొన్న జూన్ 1... క్యాన్సర్ సర్వైవర్స్ డే!!
ఈటీవీ2 సుఖీభవలో ఈ పదేళ్లలో ప్రతీసారీ ఒక స్ఫూర్తివంతమైన కథనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఫస్ట్ టైమ్... క్యాన్సర్ విజేత, విశ్వవిఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ తో మొదలుపెట్టిన ఈ సీరిస్ ప్రతీ యేడూ భిన్నమైన ఎపిసోడ్స్ ఇస్తూ వస్తున్నాం. ఈసారి ప్రముఖ నటి, బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ గౌతమితో ప్రోగ్రాం చేశాం. డాక్టర్ రఘురాం సాయంతో, మా చెన్నై రిపోర్టర్ ద్వారా మద్రాసులోనే గౌతమితో వాళ్లింట్లో షూటింగ్ చేశాం. దీన్నంతా మా కొలీగ్ కోఆర్డినేట్ చేయగా, నేను స్క్రిప్ట్ రాశా. RCM Raju Voice Over చెప్పారు. మొత్తంగా... ప్రోగ్రాం బాగొచ్చింది. చెప్పుకోవాల్సింది ఏమంటే... గౌతమి- క్యాన్సర్ గురించి, కీమో గురించి, బంధుమిత్రుల సపోర్టు గురించి, క్యాన్సర్ స్టిగ్మాస్ గురించి మాట్లాడిన విధానం సింప్లీ సూపర్బ్. చక్కని తెలుగులో, చాలా ప్రశాంతంగా మాట్లాడారామే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు, టైమ్ కుదిరినప్పుడు వీక్షించవచ్చు అని ఇక్కడ లింక్ ఇస్తున్నాను. థాంక్యూ! :-))

Post has attachment
నా బ్లాగులో కూడా పెఠేశా :-)
Wait while more posts are being loaded