Profile cover photo
Profile photo
రహ్మానుద్దీన్ షేక్
2,654 followers -
వర్తంత ఇతి ధారయన్
వర్తంత ఇతి ధారయన్

2,654 followers
About
Posts

Post has shared content

Post has shared content
మొన్న అర్ధరాత్రి ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరాను. 2కిమీ కలిసొస్తుందని, Traffic ఉండదనీ రూట్ అంత గొప్పగా ఉండకపోయినా HAL క్వార్టర్స్ మీదగా వస్తున్నాను. చలికాలం మొదలైపోవడం తో రోడ్లమీద మనుషులు లేరు. ఆ ఏరియా‌ మొత్తం కరెంట్ లేదు. ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెలగట్లేదు. ప్రతి వీధి లోనూ కుక్కల ఆధిపత్య పోరాటం న్యూస్ చానల్స్ లో లైవ్ డిబేట్స్ కన్నా గోలగా జరుగుతుంది. పగలంతా పీకలదాకా మెక్కిన వీధి కుక్కలన్నీ అర్నబ్ గోస్వామి లాగా అరుస్తున్నాయ్. ఎదురుగా ఒక పావు కిలోమీటర్ దూరం లొ రోడ్డుకిరువైపులా అశోకుడు నాటించిన చెట్లలాగా ఒక తెల్ల,నల్ల కుక్కలు కాపుకాసి నన్ను చూసి మొరగడం మొదలెట్టాయి. నాకు బైక్ యూ టర్న్ తీస్కొనే టైమ్ లేకపోవడం తో తెగించి, గేర్ తగ్గించి బండి రేజ్ చేశాను. స్పీడ్ అందుకోడానికి ఇంకొన్ని సెకన్లు పడుతుందని అర్ధమయ్యింది. బాహుబలి బిగినింగ్ లో శివుడు- కట్టప్ప లు చెరోవైపూ పరిగేత్తుకొస్తుంటే మధ్య లో పరిగెత్తిన గుర్రం లాగా ఉంది నా బైక్. దాని మీద కత్తి లాంటి నేను. రెండు కుక్కలూ చెరోకాలూ పంచుకుంటే..బండి స్పీడ్ కి అవి పెద్ద కష్టపడకుండానే 2 లెగ్ పీస్ లు దొరకడం ఖాయం. వణుకుతున్న చేతులతో హ్యాండిల్ గట్టిగా పట్టుకున్నా. చల్లబడిపోయిన 2 కాళ్ళూ పై కెత్తి హ్యాండిల్ మీద పెట్టాను. ఊపిరి బిగబట్టాను. ఆక్సిలరేటర్ ఫుల్ గా పట్టుకున్నా. ఎవడో కడ్డీ కాల్చి వీపు మీద వాత పెట్టినట్టూ గీ పెట్టింది నా బైక్. జస్ట్ మిస్... ఒక్క రన్ తేడా తో వరల్డ్ కప్ మిస్ అయినట్టూ ఫీలయ్యాయి అనుకుంటా పిచ్చిగా అరుస్తూ కసిగా వెంటాడటం మొదలెట్టాయి. అలా ఆ స్ట్రైట్ రోడ్ లో అర కిలోమీటర్ వెళ్ళి ఉంటాను. అరుపులు తగ్గాయి. హమ్మయ్యా అనుకొని రేర్ మిర్రర్ లో చూశా. ఎడమవైపు తెల్లకుక్క ఇంకా తరుముతుంది. ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసింది. ఉస్సెయిన్ బోల్ట్ పెంపుడు కుక్కని బెంగుళూర్ లో వదిలేసి పోయాడో ఏమో. దీని ఫిట్నెస్ లెవెల్స్ తగలెయ్యో... అనుకొని ఆక్సిలరేటర్ ఇంకా రేజ్ చెయ్యబోయా... ఆల్రెడీ ఫుల్ గా పట్టుకున్నామని చేతులు మెదడు ని విసుక్కున్నాయ్. లెఫ్ట్ ఇండికేటర్ వేసి చటుక్కున రైట్ టర్న్ తీసుకొని దాన్ని ఫూల్ చెయ్యొచ్చని సిక్స్త్ సెన్స్ సెలవిచ్చింది. ఆ స్పీడ్ లో ఆ రోడ్ మీద టర్న్ తీస్కుంటే కుక్కల విందు కి ఊళ్ళోవాళ్ళు హడావిడి చేస్తారని 7th సెన్స్ చెవిలో ఊదింది. ఇంతలో బైక్ ఫుల్ స్పీడ్ అందుకుంది. గోడ కట్టబోయి సిమెంట్ లేక సగం లో ఆపేసారా అన్నట్టున్న స్పీడ్ బ్రేకర్ మీద నుండి దూకింది. కుక్క ఆయాసం తో ఆగిపోయింది.(ధూమ్ 4 లో హీరోకి స్లో‌మోషన్ లో ఈ సీన్ పెట్టమని యాష్ చోప్రా కి ట్విట్టర్ లో మెసేజ్ పెడితే ఎలా ఉంటుందా? అనిపించింది.) నా గుండె ఓల్టేజ్ డ్రాపయిన మోటార్ లాగా స్పీడ్ తగ్గించింది. బీపీ నార్మల్ కి వచ్చింది. అడ్డాల నాటి నుండీ గెడ్డం నెరిసే ఏజ్ మొదలయినా కుక్కలకీ నాకూ ఈ వైరం ఏమిటో ఈ పగలేమిటో అర్ధం కాలేదు. అర్ధరాత్రుళ్ళు అందరూ నిద్దరోయాక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హారర్ సినిమాలు చూసే నాకే అంత చలిలో చమట్లు పట్టించాయి. అప్రయత్నం గా పళ్ళు బిగుసుకున్నాయి. ఈ మాయదారి కుక్కల్ని రోడ్ రోలర్ తో తొక్కించెయ్యాలన్నంత కోపం వచ్చింది. అప్పుడే ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది.

ఈ బెంగుళూరు వీధి కుక్కల వల్ల బైక్ కన్నా కార్ బెటరనీ_
బెంగుళూర్ ట్రాఫిక్ కీ కార్ కన్నా బైక్ బెటర్ అనుకునే వాణ్ణి. కానీ ఆ రెండూ కాదు రోడ్ రోలర్ కరెక్ట్ అనిపించింది.

ఎందుకంటే

1.ఇలా కుక్కలు తరిమినప్పుడు ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ కీ కట్ చేస్తే చాలు.. కుక్కల కసి కేకలు ఆర్తనాదాలు గా మారే లోపు మా ఆఫీస్ లో‌ మేనేజర్లు గా పుట్టడానికి గ్రౌండ్ వర్క్ జరిగిపోద్ది. తార్ రోడ్ మీద టెంపరరీ టాటూ పడిపోద్ది.

2.ఇక్కడ ఏవరేజ్ స్పీడ్ 5కి.మీ కాబట్టీ స్లో అన్న సమస్యే లేదు.

3. వెనకాల నుండి రై రై మని వచ్చేసి స్పీడ్ కంట్రోల్ కాక గుద్దేసే స్కూటీల వాళ్ళూ, abs ఉంది కదా అని మన బండి ముందు షడన్ బ్రేకులేసే కాస్ట్లీ కారోళ్ళూ మనకి దూరం గా ఉంటారు.భయపడతారు. మనం వాళ్ళని గుద్దినా వాళ్ళకే రిస్కూ..వాళ్ళు మనల్ని గుద్దినా వాళ్ళకే రిస్కు.

4. హెల్మెట్ పెట్టుకోలేదనీ, సీట్ బెల్ట్ కట్టుకోలేదనీ అడ్డమైన నీతి పలుకులూ పలికి 200 లాక్కొని పోయేవాళ్ళ గొడవ ఉండదు.

5. రాంగ్ పార్కింగ్ అని పోలీసోళ్ళు బండి పట్టుకుపోయే చాన్సే లేదు. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసుకోవచ్చు.

6. ఎంత వర్షం పడినా రోడ్ల పై ఏర్లు పారినా సైలెన్సర్ లోకి నీళ్ళు పోతాయని భయం లేదు.

7. వీకెండ్స్ పార్ట్ టైం జాబ్ గా రోడ్లు వేసే పనికి పోవచ్చు. అందుకే
పర్సనల్ లోన్ , పీ.ఎఫ్ లోన్ పెట్టి అవసరం అయితే చీటీ పాట పాడి ఒక రోలర్ కొనేద్దాం అనుకుంటున్నా. ఎటొచ్చీ అవి పచ్చి తాగుబోతులని విన్నాను. ముందున లాగడానికి ఒక నలుగురు, వెనకనుండి తొయ్యడానికి నలుగురినీ పెట్టుకుంటే సరి.
అవసరం ఆయితే...

"రోడ్ రోలర్ తో ఈ ఇంజినీర్ ఏమ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు"

"ఇలా చేస్తే మీకు వీధి కుక్కల బెడద ఉండదు"

"ఆఫీస్ కి రోడ్ రోలర్ మీద వెళ్ళడం చూస్తే పొట్ట చెక్కలే" లాంటి టైటిల్స్ తో యూట్యూబ్ లో వీడియోలు పెడతాను.

ఈ పోస్ట్ ని లైక్ చేస్తే రూపాయ్, కమెంట్ చేస్తే 2 రూపాయలూ, షేర్ చేస్తే 5 రూపాయలూ జూకర్ మామ నా sbi account కి వేస్తానని నిన్న మా ఆఫీస్ లో క్లైంట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కల్లోకొచ్చి చెప్పాడు. మీరా పని‌మీదుంటే మెయింటెనన్స్ కి ఏదో పెగ్గు లోకి పొటాటో చిప్స్ లాగా, బిసిబేళాబాత్ లోకి బూంధీ లాగా సమ్మ గా ఉంటుంది నాకు.

Post has attachment

Post has shared content

Post has attachment

Post has attachment
నేనో, మీరో, మరెవరో సాధారణ పౌరుడు బ్యాంకులో వంద రూపాయలు జమ చేస్తాడు. బ్యాంకు ఆ వంద రూపాయలతో ప్రభుత్వ బాండ్లు కొంటుంది. ఇప్పుడు ప్రభుత్వం సదరు బ్యాంకులో వంద రూపాయలను పెట్టుబడిగా పెడుతుంది. ఆర్‌బిఐ ప్రభుత్వం బ్యాంకుకిచ్చిన ఋణపు వంద రూపాయలను కొత్త వంద రూపాయల నోటుగా ముద్రిస్తుంది.

Post has attachment

Post has attachment

Post has attachment

Post has attachment
ఇకపై చావుకీ రాయాలొక వీలునామా!
Wait while more posts are being loaded