Profile cover photo
Profile photo
PALLA ANNAIAH
6 followers
6 followers
About
Posts

Post has attachment
PALLA ANNAIAH commented on a post on Blogger.
మంజరీ ద్విపద :- --------------------
ముక్కోటి మహిమల మూలమీకొండ
ముక్కోటి మునులకు మూలమీ కొండ
మ్రొక్కు మ్రొక్కిన చాలు మోక్ష మీ కొండ
శేషాచల విభుఁని శేషాద్రి కొండ !
Add a comment...

యేది కులం యేది మతం !!
కులం కులం ఏది కులం ...!...?
మతం మతం ఏది మతం ...!...?
కులానికి ఏది నామం ...!...?
మతానికి ఏది మూలం ...!...?
కులం కూడునిచ్చునా ! మతం నీడనిచ్చునా !
తాతల తలిదండ్రుల పేర్లే తెలియని తరుణంలో !
కులం కులం మతం మతం !
నక్కలు పన్నిన వలలో !
కోతులు చించిన విస్తర !
వెలిగే ఒత్తినడుగు ఎవరు వెలిగించారో !
రగిలేమంటానడుగు ఎవరు రగిలిచారో !
కులమతాల కుమ్ములాటల్లో .......!
కంపు బట్టిన మానవత్వం ......!
రచ్చ చేసిన రాక్ష సత్వం.. ...!
నిప్పుకు తెలుసా స్వార్థం ..!
నీరుకు తెలుసా స్వార్థం...!
కాల్చక మానదు నిప్పు ! ఆర్ఫక తప్పదు నీరు !
అంటక వెల్లునా గాలి ! అది కొందరి స్వంతమా !
పంచభూతాలకు లేని కులం !
నరునికెందుకు కులం కులం !
// ఇంకా ఉంది //
పల్లా.అన్నయ్య
Add a comment...

పల్లవి || తొగటవీర లేవరా తొలిఅడుగు నీదిరా
మలిఅడుగుతో మనుగడ సాధించితివి || 2 ||
విశ్వమానవాళికి వస్త్రం నిర్మించితివి
సృష్టి కర్త బ్రహ్మనే తల పించితివి .......... ||తొగట||
చరణం|| ప్రేమను పోషించి పెంచి పడుగునుజేసి
కరుణామృత రసపూరిత పేకనుజేర్చి
పడుగు పేక అల్లికలను పొందిక జేసి
అచ్చమైన మగ్గంపై స్వచ్చంగా నేసితివి ...||తొగట||
చరణం || అమ్మను మరిపించి చెల్లి అన్నయ్యవుగా
ఉహకు ఊపిరి పోసిన ఉదంతమే నీవుగా
రంగుల హరివిల్లులను నేతగా జేసి
మన్నికైన బట్టను మక్కువతో నేసితివి ||తొగత||
చరణం || యుక్తికి సరిశక్తి నెరపి సరిఅంచు సీరనేసి
విశ్వమానవాలి ప్రేమ గ్రోలినావులే
మక్కువతో మన్నలను పొందినావులే
మనుగడలో నీఉనికిని చాటినావులే ||తొగట||
Add a comment...

యువతా మేలుకో మనిషివై మసలుకో ...!!!
" 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అతి పవిత్ర మైనది,శ్రేష్టమైనది". ఎందుకని ? మనిషి కనుక ! మనిషి అంటే ? అన్నింటి కంటే మిన్నకనుక ! ఎందులో మిన్న ? అవయవాలలో ! ఏ అవయవాలలో ? నడవడానికి కాళ్ళు ,చేయడానికి చేతులు,వినడానికి చెవులు,సూడడానికి కండ్లు, మాట్లాడడానికి నోరు కలవని.ఇవి మిగతా వాటికి లేవంటారా !..?
పశుపక్షాదులలో లేవంటారా !...? వున్నాయి ఎందుకులేవు ! వున్నా ఉపయోగమేమని ? ఓహో అలా అంటున్నారా సరే ఇంకా సాగదీయడమెందుకని మీతో ఏ కీభవిస్తున్నా.పశుపక్షాదులకు సైతం మానవ భాషను నెర్ఫి యెద్దును గంగిరెద్దును
చేసి ఆడించె మనిషి వాటిభాషను నేర్చుకోలేదేం .వాటి భాష రాకనా చేతకాకనా ! ...? నోరు లేని మూగ జీవులైనా తమ సంతతిని సంరక్షించుకుంటూ వాటిజీవనాన్ని సవ్యంగా సాగిస్తుంటే మనిషి అలా చేస్తున్నాడా !...? లేదు కదా ఎందు చేత ? అరిషడ్వార్గాలను అదుపులో వుంచుకోలేక నేనా ! మనిషిలో అహం వున్నంతవరకు తప్పు మీద తప్పు జరుగుతూనే ఉంటుందు .అహం వీడి చూడు అందరూ నీవాళ్ళనిపిస్తారు .మధం అన్న మత్తులో మనిషి తన
తత్వాన్నే మరచిపోతున్నారు ." ఊబిలో కూరుకున్న వ్యక్తికి మత్తులో మునిగిన మనిషికి వ్యత్యాసమేముందిలే." యువకుల్లారా మేలుకోండి మత్తును మటుమాయం చేయండి .దేశ భవితకు మీరే మీరే ప్రధానకర్తలు .మీకు సాధ్యము కానిదంటూ ఉన్నదా !...? లేదు కదా ! ఓ యువతా మేలుకో భగ్గునమండే అగ్నిగుండమై అరాచకాలను కాల్చండి .సమ సమాజశ్రేయస్సుకు మీరే ముఖ్యులు .ఆదమరచి నిదరొద్దు అన్నింటా మేలుకో. ! దశ దిశలకూ మీ కీర్తి ప్రఖ్యాతులను
ఇనుమడింప జేసుకోండి .....!!!!!
Add a comment...

ఓ మనిషి మేలుకో ......!!!

ఒంటరి చేశావునన్ను ! తుంటరి కానీకు నన్ను !
నీవు నన్ను మురిపించిన ఆక్షణం !
నేను ఎలా మరువగలను ఈక్షణం !
అమ్మలాంటి ఆప్యాయత పంచిన ఆక్షణం !
అది తల్సుకుంటూ బ్రతుకుతున్నా ఈక్షణం !
ప్రియురాలివై అల్లుకున్న ఆక్షణం !
ప్రియుడనై మరువగలనా ఈక్షణం !
నిరంతర జీవిత ప్రయణంలో అనుకున్నాం ఆక్షణం !
జోడెడ్ల బండికి సరియైన జోడి మనమేనని ఆక్షణం !
మమతను పంచిన ఆక్షణం !
మరిచావెందుకు ఈక్షణం !
మనసులు పెనవేసుకున్న ఆక్షణం !
మమతలు మరిచాయా ఈక్షణం !
వేసి చూస్తున్నా నీకోసం ఈక్షణం !
నీవు వస్తావని కలుసు కుంటావని !
నీరాకకై ఎదురు చూస్తున్నా క్షణం... క్షణం... అనుక్షణం..... !!!
తప్పని సరిగా నాయొక్క ఉద్దేశ్యం నుడువుతా....!!!
Add a comment...

Post has attachment
PALLA ANNAIAH commented on a post on Blogger.
I HAVE ALLREADY RUFF AQEEQ STONE. STONE SIZE MORE THAN 75 CERETE.HOU MUCH PRICE IN THIS SINGLE  STONE.
Add a comment...
Wait while more posts are being loaded