Profile cover photo
Profile photo
TeachersBadi.In Website
1,038 followers
1,038 followers
About
Communities and Collections
View all
Posts

Post has attachment
ఇన్‌స్పైర్‌ పురస్కారాల దరఖాస్తుల‌కు 31 గ‌డువు .....
MANAK INSPIRE Awards Scheme Online nominations, One time registrations 2018
2018 - 19 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్‌ పురస్కారాలకు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు జులై 31లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
https://www.teachersbadi.in/2016/12/manak-inspire-awards-scheme-online-nominations-submissions-one-time-registrations.html

ఉన్నత పాఠశాలల్లోని, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు దరఖాస్తులకు అర్హులని తెలిపారు.

ఉన్నత పాఠశాలల్లో ఐదుగురిని, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వారు ఎంపికైన వారికి రూ.10 వేలు అందిస్తారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్‌కేంద్రం అధికారిని సంప్రదించాలని సూచించారు.
Add a comment...

Post has attachment
INSPIRE Awards- Manak Online nominations, Registrations
విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్‌స్పైర్‌ మానక్‌ 2018 -19 అవార్డుల దరఖాస్తుల గ‌డువును జులై 31 వరకు పొడిగించినట్లు తెలిపారు.
https://www.teachersbadi.in/2016/12/inspire-awards-manak-online-nominations-registrations-guidelines-action-plan.html
ఇన్‌స్పైర్‌ వేడుకలలో ప్రదర్శించే నమూనాల తయారీ, విద్యార్థుల ఎంపిక తదితర అంశాలలో ఉపాధ్యాయులు ఇబ్బంది పడొద్దని పేర్కొన్నారు.

పాఠశాలలో తయారుచేసిన నమూనాలు, విద్యార్థులతో ఇన్‌స్పైర్‌ మానక్‌లో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి ని సంప్రదించాలి
Add a comment...

Post has attachment
సార్వత్రిక డిగ్రీ అర్హత పరీక్ష 27న:.....
BRAOU UG Eligibility Test 2018 Second Time Entrance Exam Date
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ) ప్రవేశాలకు జులై 27న రెండో సారి అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
https://www.teachersbadi.in/2015/07/braou-ug-degree-eligibility-test-2015-second-time-notification-rleased.html
Add a comment...

Post has attachment
సార్వత్రిక డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ఆగస్టు 9 తుది గడువు....
BRAOU Degree/UG Admissions 2018 /BA/BCom/BSc Admissions 2018 (Ambedkar Open University)
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2018 - 19 విద్యాసంవత్సరం డిగ్రీ, పీజీ(ఎంఏ/ఎంకాం/ఎంఎస్సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 9 తుదిగడువుగా నిర్ణయించినట్లు ప్రాంతీయ అధ్యయన కేంద్రం సహాయసంచాలకులు డాక్టర్‌.ఏ.రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
https://www.teachersbadi.in/2015/06/braou-degree-ug-admissions2015-braouonline-ba-bcom-bsc-admission2015-notification.html

ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులు(10+2) లేదా అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రవేశం పొందగోరే అభ్యర్థులు తమకు సమీపంలోని ఆన్‌లైన్‌ సెంటర్‌లో దరఖాస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించి, దరఖాస్తుకు సర్టిఫికెట్‌ జిరాక్స్‌ కాపీలు జతపరిచి స్టడీ సెంటర్‌లో ఆగస్టు 9 లోపు అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు ఖమ్మంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
Add a comment...

Post has attachment
డీసెట్‌ కౌన్సెలింగ్‌.....(AP DEECET)
AP DEECET 2018 1st / 2nd Phase Web Counselling Dates /Schedule
* జులై 25 నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు.

************************
AP DEECET Web Options
************************

https://www.teachersbadi.in/2015/08/ap-deecet-web-counselling-certificate-verification-dates-schedule-admissions-I-II-phase.html
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ శిక్షణ (డీఎల్‌ఈడీ - డీఎడ్‌) కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన డీసెట్‌-2018 ప్రవేశాల ప్రక్రియ జులై 25 నుంచి ప్రారంభం కానుంది.

కౌన్సెలింగ్‌ షెడ్యూలు ప్రకారం జులై 25 నుంచి అభ్యర్థులు కళాశాలల ఎంపిక కోసం వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.

పెరిగిన ఉత్తీర్ణత శాతం: డీసెట్‌-2018 ప్రవేశాల కోసం చేపట్టిన ప్రక్రియలో తొలి నిబంధనల ప్రకారం ఫలితాల్లో కేవలం 20శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. దీంతో కళాశాలల్లో సీట్లన్నీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. అర్హత మార్కులను సడలించాలంటూ అభ్యర్థులు, ప్రైవేటు కళాశాలల ఒత్తిడి నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు 25శాతం, బీసీలకు 35 శాతానికి తగ్గిస్తూ ఫలితాలను వెల్లడించారు. దీంతో 90శాతం మంది అభ్యర్థులు డీఎడ్‌కోర్సులో ప్రవేశాలకు అర్హత సాధించడం గమనార్హం.

వాయిదా పడదు ............................................
డీఎడ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు జులై 25 నుంచి వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. ఎస్‌సీఈఆర్టీ అధికారులు మాకు పంపిన జాబితాల మేరకే కళాశాలల్లో సీట్ల భర్తీ చేపడుతున్నాం. కౌన్సెలింగ్‌ ప్రక్రియ వాయిదా ప్రసక్తే లేదు.
Add a comment...

ట్రిపుల్‌ఐటీకి ఎంపికైన విద్యార్థులు 23న హాజరు కావాలి.....
: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్‌ఐటీలకు ఇటీవల ప్రవేశాలు పొందిన విద్యార్థులు జులై 23న హాజరు కావాలని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టరు డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ జులై 20న తెలిపారు.

జులై 4, 5, 6, 7 తేదీలలో ఆయా ప్రాంగణాల్లో నిర్వహించిన ప్రవేశాలకు సంబంధించి ఇడుపులపాయకు 815 మంది, ఒంగోలుకు సంబంధించి 806 మంది విద్యార్థిని, విద్యార్థులు ప్రవేశాలు పొందారని చెప్పారు.

వారికి ఆయా క్యాంపస్‌లలో తరగతి గదులు, వసతి గదులు కేటాయించామన్నారు.

వీరి రాక కోసం అదే రోజు తమ ట్రిపుల్‌ఐటీకి చెందిన బస్సును వేంపల్లె నుంచి ఏర్పాటు చేశామని, దీన్ని విద్యార్థులు గుర్తించి 23వ తేదీ సాయంత్రంలోగా ట్రిపుల్‌ఐటీలకు చేరుకోవాలని ఆయన కోరారు
Add a comment...

Post has attachment
నవోదయ 9వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల:
Navodaya 9th class entrance exam results 2018
జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2018 - 19 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను జులై 20న సాయంత్రం విడుదల చేశారు.

మే నెల 19న అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఎంపికైన 13 మంది విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ల వివరాలను ప్రకటించారు.

ఎంపికైన అభ్యర్థులు జులై 21 నుంచి జవహర్‌ నవోదయ విద్యాలయ కార్యాలయంలో ప్రవేశ దరఖాస్తు పొంది 25 లోపు అందజేయాలన్నారు.

ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ప్రవేశం నిర్ధారిస్తామని చెప్పారు.

అప్పటివరకు అభ్యర్థులు తమ పాఠశాల నుంచి టీసీ తీసుకోరాదన్నారు.

ఎంపికైన విద్యార్థుల వివరాలు, హాల్‌టికెట్‌ నెంబర్లు ......
https://www.teachersbadi.in/2015/06/jnvs-navodaya-9th-ix-class-entrance-exam-2015-results-nvs-entrancetest-results2015.html
Add a comment...

Post has attachment
21 నుంచి గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు...
https://www.teachersbadi.in/2014/06/aprs-vi-and-vii-class-admission-test.html
గురుకుల విద్యాలయాల్లో 6, 7 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి జులై 21 నుంచి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్‌ తెలిపారు. https://aprjdc apcfss in/ వెబ్‌సైట్‌లో రూ.50 రుసుం చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

బీసీ, ఓసీ విద్యార్థులు జిల్లాలోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదువుతూ ఉండాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీలకు ఈ నిబంధన వర్తించదని తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకూడదన్నారు. రెండేళ్లు నిరాటకంగా ప్రభుత్వ, ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదవి ఉండాలని సూచించారు.
5, 6 చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులన్నారు.

ప్రవేశ పరీక్ష ఆగస్టు 10న తుని, జగన్నాథగిరిలోని బాలికల గురకుల విద్యాలయంలో నిర్వహిస్తారని తెలిపారు.
Add a comment...

Post has attachment

Post has attachment
Class VI (6th Class) Selection List For Admission During 2018-19 ( Chandigarh Region And MP State )
Selection List Of Class VI (6th Class) Jnvst-2018-19-Pune Region
https://www.teachersbadi.in/2013/06/navodaya-entrance-exam-2013-results-jnv.html
Add a comment...
Wait while more posts are being loaded