Profile cover photo
Profile photo
రాజ్ కుమార్.
1,091 followers
1,091 followers
About
రాజ్'s posts

Post has attachment
Dedicated to +Sravya V
చాలా లేట్ గా చూసాను.
చాలా చాలా కాలం తర్వాత కన్నీళ్ళొచ్చేలా నవ్వాను. దేవుడా...!!

నాలాంటి మ్యాక్ బుక్ ప్రో బాధితులు బాగా కనెక్ట్ అవుతారు

Post has attachment

Post has attachment
ఈళ్ళ క్రియేటీవిటీ కి అంతు లేదా? సూపర్

https://m.youtube.com/watch?feature=share&v=MW4JWCmryoY

రోజూ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు టీవీ పెడితే వచ్చే ప్రోగ్రాంస్... రచ్చబండ, సంసారం చదరంగం, బతుకు జట్కాబండి... ఛీ నా జీవితం అనుకొని తినేసి ఆఫీస్కి పోతా...

రాత్రి పదిన్నర కి వచ్చి డిన్నర్ చేస్తూ టీవీ ఆన్ చేస్తా... వచ్చే ప్రోగ్రాంస్... రచ్చబండ, సంసారం చదరంగం.

బొత్తిగా మనశ్శాంతి లేకుండాపోయింది. ఈళ్ళ జీవితాలు చెడ.

నా కూతురు నేర్చిన కొత్త ఆటలు.

కిచెన్ లోకి పాక్కుంటా పోయి, స్టూల్ కాలు పట్టుకొని నించొనీ,మీద నున్న వాటర్ ప్యూరిఫైయర్ టాప్ ఇప్పి నీళ్ళన్నీ
వదిలేసి వంటగదంతా వరద చేసెయ్యడం.

ఫ్రిజ్ డోర్ తీసి వేసే లోగా, లోపలకి దూరిపోడానికి దూసుకొచ్చెయ్యడం.

డబ్బాలో వేసిన బట్టల క్లిప్పులన్నీ తీసి నేల మీద పరిచెయ్యడం.

నూనె డబ్బాల మూత తీసి తలకిందులు చెయ్యడం.

డస్ట్ బిన్ ల మూత తీసి పురావస్తు తవ్వకాలు చెయ్యడం.

బాత్రూం కి పోతుంటే నేనూ వస్తా అని వెంటపడటం. వదిలేసి వెళితే తిరిగొచ్చేదాక తలుపు మీద కొడుతూ అక్కడే వేచి చూడ్డం.

మెయిన్ డోర్ వైపు చూపించి, ఆచ్చి తీస్కెళ్ళమని హింట్లివ్వడం. లేదంటే మమ్మల్ని ఆడుకోడం.

#పిల్లతండ్రిపైత్యం

పుత్రికోత్సాహం తో పూరీ లా పొంగిన నేను.
మా పిల్లకి కూడా నాలాగే అట్లంటే ఇష్టం. ఆకలి లేకపోయినా అట్టు తుంచి నొట్లో పెడితే ఆం..ఆం.
మా తల్లే... మా బంగారమే...అన్నీ నాన్న పోలికలే.

#పిల్లతండ్రిపైత్యం

నాలుగేళ్ళ వయస్సు గల నా లాఫ్టాప్ అంతం, నా కూతురు చేతిలోనే అని ఈ మధ్య బలం గా అనిపిస్తుంది. నిటారుగా ఉన్న డిస్ప్లే ని వెనక్కి వంచి నేలమట్టం చెయ్యడానికి ట్రై చేస్తున్నప్పుడల్లా భీముడు బకాసురుడిని, కీచకుణ్ణీ ఇలాగే విరిచేసి ఉంటాడనిపిస్తుంది. కీప్యాడ్ మీద కాలేసి పదే పదే తన్నీ, keys పీకెయ్యడానికి ట్రై చేస్తుంటే జరాసంధుని వధ గుర్తొస్తుంది.

#పిల్లతండ్రిపైత్యం

పెళ్ళాం అరిచినప్పుడు అశాంతి
అలిగినప్పుడు మనశ్శాంతి
ఆ అలక తీర్చనప్పుడు విజయశాంతి
జీవితమయ్యింది డిస్కో శాంతి.

ఓం శాంతి శాంతి శాంతి:

ఏమయినా అనండి +మీ భారతీయుడు గారు

ప్రతిరోజూ రాత్రి ఆఫీస్ నుండి ఇంటికొచ్చి మెట్లెక్కేటప్పుడు ఆలోచించేది ఏంటయ్యా..అంటే.....

"చంటిది నన్ను చూడగానే నవ్వుతా నా దగ్గరకి పాక్కుంటూ వచ్చేస్తాది... చేతులు పైకెత్తి ఎత్తుకోమంటుంది రోజూ లాగానే...!
తెలిగేసి ఉందో నిద్రపోయిందో..???"

#పిల్లతండ్రిపైత్యం

మా పిల్లతల్లి పాడే జోలపాటలు ఏందయ్యా అంటే..?

1.మోగించాలి గానా... మోగించాలి గానా..గానా గానా గానా...ఆఆఆఆఆఆ

2. తడిని చక్కగా పీలుస్తుందీ.....చక్కని నిద్రను ఇస్తుందీ మామీ పోకో ప్యాంట్స్...!!! (అదే గొంతులో)

ఇది హైలైట్ సాంగ్..! చంటిదానిక్కూడా ఇష్టమైన పాట.

3.డెట్టాలు...డెట్టాలు డెట్టాలు డెట్టాలు డెట్టాలు డెట్టాలు హో...
డెట్టాలు...డెట్టాలు డెట్టాలు డెట్టాలు డెట్టాలు డెట్టాలు హో....
తినడానికీ ముందు చేతులూ కడగండి..అది మరువనే కూడదూ...!
సబ్బుకన్నా మేలూ సబ్బు కన్న మెరుగూ డెట్టాలు డెట్టాలు హో...
మా అమ్మ నేర్పింది.. నేర్పుదాము అందరికీ అందరూ చేతులు కడగండీ..!
డెట్టాలు...డెట్టాలు డెట్టాలు డెట్టాలు డెట్టాలు డెట్టాలు హో....

కచేరీ సమాప్తం.

#పిల్లతండ్రిపైత్యం
Wait while more posts are being loaded