Profile cover photo
Profile photo
Surya Pradeep
982 followers -
http://hindusampradayalu.blogspot.in/
http://hindusampradayalu.blogspot.in/

982 followers
About
Posts

Post has attachment
యాదాద్రి (యాదగిరి గుట్ట ) నందు జరుపుతున్న
"శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహా విష్ణు యాగం"
లో ఒకరోజు మీ గోత్ర నామాలతో సంకల్పం చెప్పించుకొని యాగములో పాల్గొనదలిచేవారు వివరములు కొరకు
మా మొబైల్ నెంబర్ లులో సంప్రదించడానికి
--- 9642072905 , 8019280530.
Online payments చెయ్యడానికి ఈ లింక్ లో పేమెంట్ చేయవచ్చును .
https://www.vedamayee.com/index.php
&
Bank Account: Details :-
VedamayeeSpiritual Pvt Limited
Account Number:-252792792799,
Bank: INDUSIND BANK LTD
IFSC Code: INDB0000226 (used for RTGS, IMPS and NEFT transactions)
MADHAPUR - 500 081,Hyderabad.
&
KHS SevaTrust, AcNumber-103111100001228,
Andhrabank,SSI Nacharam Branch,IFSC-ANDB0001031.
Photo

Post has attachment
యాదాద్రి (యాదగిరి గుట్ట ) నందు జరుపుతున్న
"శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహా విష్ణు యాగం"
లో ఒకరోజు మీ గోత్ర నామాలతో సంకల్పం చెప్పించుకొని యాగములో పాల్గొనదలిచేవారు వివరములు కొరకు
మా మొబైల్ నెంబర్ లులో సంప్రదించడానికి
--- 9642072905 , 8019280530.
Online payments చెయ్యడానికి ఈ లింక్ లో పేమెంట్ చేయవచ్చును .
https://www.vedamayee.com/index.php
&
Bank Account: Details :-
VedamayeeSpiritual Pvt Limited
Account Number:-252792792799,
Bank: INDUSIND BANK LTD
IFSC Code: INDB0000226 (used for RTGS, IMPS and NEFT transactions)
MADHAPUR - 500 081,Hyderabad.
&
KHS SevaTrust, AcNumber-103111100001228,
Andhrabank,SSI Nacharam Branch,IFSC-ANDB0001031.
Photo

Post has attachment
యాదాద్రి (యాదగిరి గుట్ట ) నందు జరుపుతున్న
"శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహా విష్ణు యాగం"
లో ఒకరోజు మీ గోత్ర నామాలతో సంకల్పం చెప్పించుకొని యాగములో పాల్గొనదలిచేవారు వివరములు కొరకు
మా మొబైల్ నెంబర్ లులో సంప్రదించడానికి
--- 9642072905 , 8019280530.
Online payments చెయ్యడానికి ఈ లింక్ లో పేమెంట్ చేయవచ్చును .
https://www.vedamayee.com/index.php
&
Bank Account: Details :-
VedamayeeSpiritual Pvt Limited
Account Number:-252792792799,
Bank: INDUSIND BANK LTD
IFSC Code: INDB0000226 (used for RTGS, IMPS and NEFT transactions)
MADHAPUR - 500 081,Hyderabad.
&
KHS SevaTrust, AcNumber-103111100001228,
Andhrabank,SSI Nacharam Branch,IFSC-ANDB0001031.
Photo

​భక్తకోటికి సమాహ్వానములు
!! యజ్ఞోవై విష్ణుః! యజ్ఞ ఏవాన్తతః ప్రతితిష్ఠతి!!

శ్రీ మహావిష్ణువు యజ్ఞ స్వరూపుడు. వేష్టి వ్యాప్నోతీతి విష్ణుః!
విశ్వమంతా వ్యాపించి జీవరాశులన్నిటినీ పరిపాలించువాడు.
84 లక్షల జీవులలోనూ జన్మించి చివరకు మానవజన్మ (మా-వద్దు, నవజన్మ- కొత్త జన్మ) పొందిన మనందరికీ సంసార బాధలుతొలగి, జన్మచక్రం నుండి విముక్తులగుటకు శ్రీమహావిష్ణువే శరణ్యము. శ్రీమహావిష్ణు ఆరాధనవలన నిత్యజీవన సమస్యలు తొలగి, కుటుంబ వ్యవస్థలో శాన్తి- సౌభాగ్య- ఆనన్ద- ఐశ్వర్వ- విజ్ఞాన- ఆయుష్యమయ సుఖజీవనములు కలిగి మానవజన్మ సార్ధకతకై మరియు సకల విశ్వశాంతినీ, సకలప్రాణికోటి పరిరక్షణనూకోరి జగద్రక్షకుడు, సకల కల్యాణకారకుడు, ఆద్యంత రహితుడై "పరిత్రాణాయ సాధూనాం- వినాశాయచ దుష్కృతాం ! ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "!! అని స్వయంగా వచించి లోకాలను పరిపాలిస్తూ అనేక రూపాలతో అవతరించి మనలచే కొలువబడుతూ, మనలను పరిరక్షిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ విశ్వశాన్తి మహాక్రతువులు. నవనారసింహ మహా క్షేత్రములలో ఒకటై, ప్రహ్లాద వరదుడై శాంతించి, శాంతా-ఋష్యశృంగ మహర్షి దంపతుల పుత్రుడు యాదమహర్షి తపస్సుకు మెచ్చి, పంచ నారసింహ (శ్రీ ఉగ్రనారసింహ- శ్రీ జ్వాలానారసింహ- శ్రీ గండభేరుండనారసింహ- శ్రీ యోగనారసింహ- శ్రీ లక్ష్మీనారసింహ) రూపములతో ఆవిర్భవించిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యచరణ సన్నిధిలో, అత్యంత అరుదుగా, భారతదేశ చరిత్రలో గత సహస్రాబ్దిలో మొదటిసారిగా, తెలుగునాట అపూర్వరీతిలో, అష్టోత్తర శతకుండాత్మక శ్రీసుదర్శన మహాయన్త్ర ప్రస్తార మహాయాగశాలలో చాతుర్మాస్య దీక్షతో, 126 రోజులలో, 12లక్షల మందికి అన్నసమారాధనతో, సహస్రాధిక ఆచార్య బ్రహ్మాది ఋత్విజులచే ఈ మహాక్రతువులు నిర్వహించబడనున్నవి.వదాన్యులు, వితరణశీలురు, ఆర్జితసేవాపేక్ష గల్గిన భక్తులు తమ-తమ పరిధిని-స్థాయిని అనుసరించి మున్నెన్నడూ నిర్వహింపబడని ఈ లోకకల్యాణ మహాక్రతువును జయప్రదం గావించుటకు వెంటనే తమ తక్షణ ఆర్ధికసహాయ-సహకారములను అందించవలసినదిగా సవినయ విన్నపములు. ఏర్పాట్లు ఎప్పటినుంచో ఆరంభిస్తేకాని ఇట్టి అపూర్వ దృశ్య - శ్రవణ కావ్య సందర్శనకు అవకాశం లభింపదు. విజ్ఞులూ, చదువరులూ, పురాణ ప్రవచణాది శ్రవణములకు వెళ్లేభక్తులు,భాగవతోత్తములు ఈ విషయం సమగ్రంగా గ్రహించి మావిన్నపమును సహృదయంతో స్వీకరించి యధాశక్తి తక్షణ ఆర్ధిక సహాయ-సహకారములను సమకూర్చవలసినదిగా మరొక్కసారి సవినయంగా కోరుతున్నాము.

“శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీమహావిష్ణు మహాయాగం" అత్యంత శాస్త్రోక్త విధి-విధానముగా, కఠోర నియమ-నిబద్ధతలతో, వివిధ విశేష కామ్య హోమములు, అభిషేకములు, చతురావృత తర్పణములు, కుంకుమార్చనలు మేళవించి (అనుసంధానము చేసి) కారీక శుక్ల ఏకాదశీ (ఉత్థాన ఏకాదశీ) భౌమవారం వరకు నిర్వహింపబడి, మహాపర్వదినమైన కార్తీక శుక్లా ద్వాదశీ (క్షీరాబ్ది ద్వాదశీ) సౌమ్యవారం (ది.01.11.2017 బుధవారం) మహాశాంతి హోమం- పూర్ణాహుతి- అన్నప్రసాద వితరణలతో సమస్త జగత్ కల్యాణమును అపేక్షించి బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధ శర్మ గారి నేతృత్వమున 126 రోజులు నిర్వహింపబడనున్న21వ (ఏకవింశతి సంఖ్యాక ) మహాక్రతువులివి.

మహా యాగకర్తలు: బ్రహ్మశ్రీ కేసాప్రగడ హరిహరనాధశర్మ, శ్రీమతి రాధాకృష్ణ కుమారి
మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత శ్రీశ్రీశ్రీ కల్యాణ వీరేశ్వరస్వామివారి దివ్యానుగ్రహంతో విశ్వ సుందర భాగ్య నగరం (హైదరాబాద్)లో 16 కార్తీకమాసాలలో 16 శ్రీ పంచాయతన సహిత మహారుద్ర యాగములు, త్రిలింగ దేశమైన తెలుగునాట 2012లో భద్రాచలంలో కేరళ నంబూద్రి బ్రాహ్మణోత్తములచే మహోత్కృష్ట మహాసోమయాగం అతిరాత్రం, 2013లో మురమళ్లలో శ్రీశతచండీ సహిత అతిరుద్రం, 2015లో కర్నూలు, గార్గేయపురంలో మహా సోమయాగం అప్తోర్యామం మరియు మహాసౌరం ఇత్యాది 20 మహాయాగములను భగవత్ ప్రీతికరంగా, జనరంజకంగా నిర్వహించి, శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో (2017లో) యాదాద్రి మహాక్షేత్రంలో 126రోజులు ఈ మహోత్కృష్ట 21వ మహాయాగములు నిర్వహింప భగవత్ ప్రేరణతో సత్సంకల్పం కలిగినది. ఈ మహాక్రతువులకు భక్తకోటి యావన్మంది తను మన-ధన సేవా రూపేణ సహకరించి తరించగలరు. స్వస్తి !!
యాగస్థలం: Z.P. హైస్కూల్ ప్రాంగణం, బస్టాండ్ ఎదురుగా, (యాదగిరిగుట్ట), యాదాద్రి - 508115 , యాదాద్రి జిల్లా, తెలంగాణ, భారత్

ఈమహాక్రతువులకు ఉదాత్తంగా సహకరించగోరుతూ సవినయంగా విన్నపములు:

మంగళమ్ మహత్! శ్రీశ్రీశ్రీ !! ఓం నమో నారాయణాయ !!

***************************************************************************
Online payments చెయ్యడానికి ఈ లింక్ లో పేమెంట్ చేయవచ్చును .
https://www.vedamayee.com/index.php

&
Bank Account: Details :-
VedamayeeSpiritual Pvt Limited
Account Number:-252792792799,
Bank: INDUSIND BANK LTD
IFSC Code: INDB0000226 (used for RTGS, IMPS and NEFT transactions)
MADHAPUR - 500 081,Hyderabad

.
&
KHS SevaTrust, AcNumber-103111100001228,
Andhrabank,SSI Nacharam Branch,IFSC-ANDB0001031.

Post has attachment
Surya Pradeep commented on a post on Blogger.

Post has attachment
మీ "వేదమయీ " "Whats App"నెంబర్ "8019280530"
"Whats App"లో "Personalised " Message గా భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు కు సంబందించిన అంశాలు "Text" రూపం లో లేదా mp3 రూపం లో చాగంటి , గరికపాటి వంటి వారి ప్రవచనాలు లో ముఖ్య అంశాలు లేదా భక్తి వీడియోస్ ,చిన్న పిల్లలకు నీతి కథలు వంటి అంశాలు పొందాలి అని అనుకొంటున్నారా ?
ఐతే తప్పఁకుండా మీరు మా నెంబర్ "8019280530" సేవ్ చేసుకొని "ఓం " అని మెసేజ్ చెయ్యండి చాలు .
Photo

మీ "వేదమయీ " "Whats App"నెంబర్ "8019280530"
"Whats App"లో "Personalised " Message గా భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు కు సంబందించిన అంశాలు "Text" రూపం లో లేదా mp3 రూపం లో చాగంటి , గరికపాటి వంటి వారి ప్రవచనాలు లో ముఖ్య అంశాలు లేదా భక్తి వీడియోస్ ,చిన్న పిల్లలకు నీతి కథలు వంటి అంశాలు పొందాలి అని అనుకొంటున్నారా ?
ఐతే తప్పఁకుండా మీరు మా నెంబర్ "8019280530" సేవ్ చేసుకొని "ఓం " అని మెసేజ్ చెయ్యండి చాలు .

Post has attachment
కార్తీక పురాణం - 30
30వ అధ్యాయము - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, "ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.

అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.

కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.

కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నె,అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.
Photo

Post has attachment
కార్తీక పురాణం - 29
29వ అధ్యాయము
అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము

అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.

ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్ని౦పుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.

మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాప౦క్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.

ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.

నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్యపరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.

ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీదినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రతప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసము౦డి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీకొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశిఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.

ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింపకూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసానకాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.

ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము
Photo

Post has attachment
కార్తీక పురాణం - 28
28వ అధ్యాయము - విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైల్ పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష. కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము
Photo
Wait while more posts are being loaded