Profile cover photo
Profile photo
Nava Telangana
51 followers -
News Paper
News Paper

51 followers
About
Posts

Post is pinned.Post has attachment
నవ తెలంగాణ దినపత్రిక ప్రజల చేతిలో ఒక ఆయుధం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. తెలంగాణా సమాజానికి ఇది ఒక కరదీపికై నిలవాలని అభిలషించారు. అనవసర సంచలనాలకు పోకుండా అవసరమైన విషయాలను విస్మరించకుండా వార్తలను విశ్లేషణాత్మకంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేలా నవతెలంగాణ అండగా నిలుస్తుందని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
#navatelangana #kcrlaunch #నవతెలంగాణ
Photo
Add a comment...

Post has attachment
పేదల బతుకుల్లో... చిచ్చురేపుతున్న 'భృతి
అందరికీ అందని రూ.వెయ్యి
- బీడీ కార్మికుల ఆగ్రహం
రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల జీవనభృతి కల్పిస్తామన్న ప్రభుత్వ కొర్రీలు కొన్ని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. జీవనభృతికి ఇతర పింఛన్లతో ముడిపెట్టడంతో ఈ పరిస్థితి దాపురించింది. బీడీల్లా కాలిపోతున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో జీవనభృతి పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వ నిబంధనలు అప్పటికే పింఛన్‌ పొందుతున్న వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్న ఓ తల్లి తన ఇద్దరు కొడుకులతో ఒక్కో నెల చొప్పున ఉంటుంది. అయితే అధికారుల సర్వేలో మాత్రం ఏ కొడుకుతో అయితే ఆ తల్లి ఉందో ఆ కుటుంబానికి జీవనభృతి నిలిపివేశారు. దీంతో ఆ తల్లి తన ఇంటికొస్తే ఎలాంటి సమస్య వస్తోందోనని రెండో కొడుకు తల్లిని దూరంగా ఉంచాడు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. ‪#‎BeediWorkers‬ ‪#‎pensions‬ ‪#‎kcr‬ ‪#‎telangana‬
Add a comment...

Post has attachment
బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు విచ్చేసినపుడు ఆయనను సైనిక మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన సైనిక దళానికి నాయకత్వం వహిస్తూ కవాతు చేసిన మొట్టమొదటి మహిళా అధికారి పూజాఠాకూర్‌. అప్పటి నుండి రక్షణదళాలలో మహిళలకున్న స్థానం గురించి, వారిపాత్ర గురించి చర్చ ప్రారంభమయింది. ఈ సంఘటన భారతీయ చరిత్రలో రక్షణ దళాలలో దాగున్న చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. #navtelangana #maanavi  
Add a comment...

Post has attachment
ప్రభుత్వానికి కరెంట్‌ షాక్‌...
9,246 వేల ఎకరాలకు రూ. 108 కోట్లు..
- ఎకరానికి రూ. లక్ష 16 వేల కరెంటు బిల్లు
- నివ్వెర పోయిన రైతులు
భూమికి సాగునీరందిస్తే భూమి కొన్నంత ఖర్చవుతుందా..? ఇది అతిశయోక్తికాదు. వివరాలు తెలుసుకోవాలంటే దేవాదుల ప్రాజెక్టు పనితీరు గురించి తెలుసుకోవలసిందే. ‪#‎navatelangana‬
Add a comment...

Post has attachment
   దేశాన్ని క మ్యూనిస్టులే కాపాడా రని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నా రు. భారత దేశానికి రక్షణ కవ చంలా నిలిచారని కొని యాడారు. 34ఏళ్ల చరి త్ర కలిగిన ప్రజాశక్తి రాష్ట్రవి భజన నేప థ్యంలో నవ తెలంగాణ రావ డాన్ని మన స్ఫూర్తిగా ఆహ్వా నిస్తున్నాని చెప్పారు. తెలం గాణ ఏర్పడక ముందు అనేక పత్రికలు అనేక విధా లుగా వార్తలు రాశా యని చెప్పారు.తెలంగాణ వారికి తెలివి లేదని, పని చేయరాదని రకరకాలుగా వార్తలు వచ్చేదన్నారు. రాస్తే వక్రీకరణలు లేకుంటే అసత్యాలేనని అన్నారు. తెలంగాణ ఏర్పడితే మిగులు బడ్జెట్‌ ఉంటుందన్న సంగతి ముందే తెలుసన్నారు. అయినా ఇప్పుడు కూడా అదే ధోరణితో కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయన్నారు. ఆధిపత్య భావజాలం తెలంగాణ సంస్కృతి మీద దెబ్బకొట్టిందన్నారు. ప్రజల మధ్య విద్వేషం లేదన్నారు. ఒక వేళ విద్వేషం ఉంటే విజయం సాధించేవారం కాదన్నారు. తెలంగాణ ఏర్పడినా నదీ జలాల పంపిణీ నేటికీ పూర్తికాలేదన్నారు. #navatelangana  
Photo
Add a comment...

Post has attachment
- ముఖ్యమంత్రి కెసిఆర్‌
- రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు
 - విద్యుత్తు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ
- పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతలకు త్వరలో శంఖుస్థాపన #ugadi #kcr #navatelangana  
Add a comment...

Post has attachment
నయా ట్రెండ్‌లో తొలిసారి మాళయాళ నాట ఓ సంచలన విజయం నమోదు చేసుకుంది.'దృశ్యం'...లోబడ్జెట్‌ మూవీగా 175 రోజులు ప్రదర్శితమై 50 కోట్లు కలెక్ట్‌ చేసి మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసి ఆశ్చర్యపర్చింది.. ఆలోచింపజేసింది. ఎందుకీ చిత్రం అంత ఘనవిజయాన్ని సాధించింది?, ప్రేక్షకులెందుకు బ్రహ్మరథం పట్టారు.. ఇంతకీ ఆ చిత్రంలో ఏముంది?.. పూర్తి వ్యాసం కొరకు http://www.navatelangana.com/article/nava-chitram/1647 ను చుడండి
. ‪ #navatelangana #navachitram #drushyam  
Add a comment...

Post has attachment
అనుకోని అద్భుతం - ప్రపంచ కప్‌లో భారత బౌలర్ల హవా
పసలేని బౌలర్లతో టీమ్‌ ఇండియా వరల్డ్‌కప్‌ను నిలుపుకోవాలనుకోవటం జోక్‌. ఇది ప్రపంచ కప్‌ ఆరంభానికి ముందు తలపండిన విశ్లేషకుల మాట. భారత్‌ ముచ్చటగా మూడో టైటిల్‌ అందుకోవాలంటే అది బౌలర్లతోనే సాధ్యం ఇది ఇప్పటి మాట. నెల రోజుల్లో ఎంత మార్పు. భారత్‌కు బలహీనత అనుకున్న బౌలర్లే బలంగా మారారు. టోర్నీలో ఇప్పటి వరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థిని కుప్పకూల్చిన బౌలర్లు..వరల్డ్‌ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నారు. మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో 70 వికెట్లు నేలకూల్చిన షమి, ఉమేశ్‌, అశ్విన్‌ త్రయాన్ని చూస్తే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతోంది!. ‪#‎india‬ ‪#‎worldcup2015‬ ‪#‎bowling‬ ‪#‎ntsports‬
http://www.navatelangana.com/article/sports/1669
Add a comment...

Post has attachment
మన ఉగాది రోజు మార్టిన్‌ గుప్తిల్‌ పరుగుల పండగ చేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన ఆఖరి క్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డ గుప్తిల్‌(237;163 బంతులు; 24 ఫోర్లు, 11 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీ సాధించి ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో డబుల్‌ సెంచరీ నమోదు చేసిన ఏకైక కివీస్‌ ఆటగాడిగా గుప్తిల్‌ చరిత్రకెక్కాడు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ ఎలా ఆడుతున్నదానిపై సెమీస్‌లో దక్షిణాఫ్రికా ప్రత్యర్థి ఎవరో తేలనుంది  #guptill #doublecentury #worldcup2015 #ntsports  
Add a comment...

Post has attachment
పొరోషెంకో విధానాలపై ఉక్రేనియన్ల అసంతృప్తి
- తాజా అధ్యయనంలో వెల్లడి
ఉక్రేనియాలో ప్రజలు తమ రాజకీయ నేతల విధానాలపై తీవ్ర అసంతృప్తితో వున్నారని ఆ దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది.
అధ్యక్షుడు పొరొషెంకో నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు, చర్యలపై మూడింట రెండొంతుల మంది అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం 8 శాతం మంది మాత్రం ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరొషెంకో సర్కారును ఈ అధ్యయన ఫలితాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కీవ్‌కు చెందిన రిసెర్చ్‌ అండ్‌ బ్రాండింగ్‌ గ్రూపు ఒకటి ఈ నెల 6నుండి 16 వరకూ నిర్వహించిన ఈ అధ్యయనంలో పొరొషెంకో ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయిన వైనం కళ్లకు కడుతోంది.......‪ #Ukraine #Parashenko #navatelangana  
Add a comment...
Wait while more posts are being loaded