Profile cover photo
Profile photo
TRS Party
524 followers -
Telangana Rashtra Samithi Party - TRS Party
Telangana Rashtra Samithi Party - TRS Party

524 followers
About
TRS Party's posts

Post has attachment
కార్యాచరణ సిద్ధం..

-కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రణాళిక
-ప్రజాభిప్రాయానికి పెద్దపీట
-రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఏర్పాటు
-బలవంతంగా కలిపారన్న భావన రాకూడదు
-జిల్లాలు, మండలాల పునర్విభజనపై సీఎం కేసీఆర్
-పది జిల్లాల కలెక్టర్లు,అధికారులతో సమీక్ష
-తెలంగాణలో అభివృద్ధి సూచి ఎక్కువ
-2024 నాటికి 5 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్
-ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల్లో పేదలను అభివృద్ధి చేయాలి

Post has attachment
ప్రతి పల్లెలో సమగ్ర సేవా కేంద్రాలు..

-బాధలు, కన్నీళ్లు లేని రాష్ట్రంగా తెలంగాణ
-గ్రామీణ ప్రజల జీవితాల్లో మార్పు తెస్తాం
-కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి జూపల్లి కృష్ణారావు

Post has attachment
దసరాకు కొత్త జిల్లాలు

-60 కి.మీ వ్యాసార్థంతో 24 జిల్లాలు
-జూన్ 2 తర్వాత వర్క్‌షాప్‌లో తుది నిర్ణయం
-డిమాండ్లతో జిల్లాల ఏర్పాటు సాధ్యపడదు.. కార్యాలయాల నిర్మాణానికి జిల్లాకు వంద కోట్లు
-కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు
-అమరుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు
-భారీగా భూ రికార్డుల సంస్కరణ
-సాదా బైనామాలన్నీ రిజిస్ట్రేషన్
-అన్యాక్రాంత అసైన్డ్ భూములు వెనక్కి
-ఆడపిల్ల తల్లికి కల్యాణలక్ష్మి చెక్కులు
-స్థానికులకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పనులు
-కృష్ణా పుష్కరాల్లో మౌలిక వసతులపై దృష్టి
-పత్తికి ప్రత్యామ్నాయాలపై రైతుల్లో చైతన్యం
-ఖరీఫ్ లోపలే భగీరథ పైపుల పనులు పూర్తి
-వివిధ అంశాలపై జిల్లాధికారులకు సీఎం దిశానిర్దేశం

Post has attachment
పాలేరు విజయం చరిత్రలో రికార్డు

పాలేరు ఫలితాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం పాలేరు ఉపఎన్నిక ఫలితం వెలువడిన తరువాత ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పాలేరు విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు.

Post has attachment
ఢిల్లీలో మిషన్ కేసీఆర్

-మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, భూసార పథకాలను కొనియాడిన ప్రధాని మోదీ
-మీ దూరదృష్టి ఆదర్శనీయమని వ్యాఖ్య
-ఇవి శాశ్వత పరిష్కారాలంటూ కేంద్ర మంత్రులకు సూచనలు
-వెంటనే అధ్యయనం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం
-కొత్త జాతీయ పథకాల్లో ఈ అంశాలను చేర్చాలని సూచన
-కరువు నివారణ చర్యలను వివరించిన సీఎం కేసీఆర్
-తాగునీరు, సాగునీరు సమస్యలకు తక్షణ, దీర్ఘకాల చర్యలు
-పర్యావరణ సమతుల్యత కోసం హరితహారం చేపట్టినం
-రాష్ట్ర భారీ ప్రణాళికలకు కేంద్రం నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి
-ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి

Post has attachment
ఎవరడ్దోచ్చిన ప్రాజెక్టులు ఆపలేరు

-చంద్రబాబు, జగన్‌పై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు
-నిబంధనలకు లోబడే నీటివాటా వాడుకుంటామని వెల్లడి

Post has attachment
పార్టీ.. ప్రభుత్వం పరుగుతీయాలి
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘను లు, బాధ్యులు టీఆర్‌ఎస్ కార్యకర్తలే. 14-15 ఏండ్లు నిరంతరంగా సాగిన ఉద్యమంలో ఆకలితో పని చేసినమో.. అటుకులు తిని పనిచేసినమో! అన్నింటిని తట్టుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినరు. కాబట్టే ఈ రోజు ఖమ్మం గడ్డ మీద స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఆత్మగౌరవంతో సంభ్రమంగా ప్లీనరీ నిర్వహించుకోగలుగుతున్నం. టీఆర్‌ఎస్ కార్యకర్తల చరిత్ర.. తెలంగాణ ఉద్యమ సాధనలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో సువర్ణాక్షరాలతో శాశ్వతంగా లిఖించి ఉంటది.
- కేసీఆర్

Post has attachment
ప్రజలే మన బాస్‌లు
-త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆగం కావద్దు: కేసీఆర్
- ప్రజల ఎజెండానే మా ఎజెండా
-ఆకుపచ్చ తెలంగాణ చూడాలన్నదే కోరిక
-తుమ్మల నా కుడి భుజం.. ఆత్మీయుడు
-పాలేరునుంచి పోటీచేయాలని నేనే కోరిన
- బ్రహ్మాండమైన మెజారిటీతో తుమ్మలను గెలిపించాలి
-ఖమ్మం బహిరంగ సభలో సీఎం కే చంద్రశేఖర్‌రావు

Post has attachment
గులాబీ గుమ్మం..ఖమ్మం!
టీఆర్‌ఎస్ 15వ జన్మదిన వేడుకను ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం ఖమ్మం నగర సమీపంలో చెరుకూరి గార్డెన్స్‌లో ప్లీనరీని, నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మూడు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు సభకు వస్తారని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నారు. ప్లీనరీ ఏర్పాట్లలో పార్టీ యంత్రాంగం నిమగ్నమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ప్లీనరీ బాధ్యతలను అప్పగించారు.

Post has attachment
ఖమ్మం ప్లీనరీతో కొత్త ఒరవడికి శ్రీకారం
-ఎండ తీవ్రత, ఎన్నికల కోడ్ దృష్ట్యా నాలుగు వేల మంది ప్రతినిధులకే అవకాశం
-పార్టీ శ్రేణులు సహృదయంతో సహకరించాలి
-రెండేళ్ల అభివృద్ధి-సంక్షేమంపై ప్లీనరీలో లోతైన చర్చ
-ప్రతినిధులు 26 సాయంత్రమే ఖమ్మం చేరుకోవాలి
-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌
Wait while more posts are being loaded