Profile cover photo
Profile photo
బులుసు సుబ్రహ్మణ్యం
1,055 followers -
శివ శివ యనరాదా శివ నామము చేదా
శివ శివ యనరాదా శివ నామము చేదా

1,055 followers
About
బులుసు's posts

Post has attachment
మళ్ళీ ఇంకో కధ వ్రాశాను. నా బ్లాగు లో చదవండి.

http://bulususubrahmanyam.blogspot.in/2017/02/blog-post.html

మళ్ళీ సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి దేముంది, ఏడాదికోమాటు వచ్చేస్తుంది. ఇదివరకటి ఉత్సాహం సన్నగిల్లింది.

ఇదివరలో కనీసం ఒక పదిమంది మిత్రులు సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ టపాలు పెట్టేవారు ఇక్కడ +lo.

కొంతమంది సంక్రాంతి అంటే ఏమిటో చెప్పేవారు. వాళ్ళ ఊర్లో విశేషాలు, చిన్నప్పటి సంగతులు, గుళ్ళో ధనుర్మాసం చక్రపొంగలి దద్ధోజనము ప్రసాదము లను తలుచుకొని చొంగ కార్చేవారు. నేనూ తలుచుకొని, వాళ్ళకు సానుభూతిగా చొంగ కార్చేవాడిని. గంగిరెద్దుల విన్యాసాలు, హరి దాసుల (సం) గీతాలు, గొబ్బెళ్ళ కధలు చెప్పేవారు. బంతి చామంతులు ఎలా దొంగతనంగా కోసుకొచ్చేవారో చెప్పేవారు. భోగి మంటలకు కర్రలు, కట్టెలు, తలుపులు ఎలా ఎత్తుకు వచ్చేవారో కూడా చెప్పి ఆనంద భాష్పాలు కార్చేవారు.

నేను అలాంటి ఘన కార్యాలు ఎక్కువగా చేయలేదు. ఏం చేస్తాను?, బులుసు మాష్టారు గారి అబ్బాయిని కదా, రాముడు మంచి బాలుడుగా బతికేయడం అలవాటు. అయినా అప్పుడప్పుడు మాట సహాయం చేసేవాడిని. ఒకటి రెండు మాట్లు ధైర్యంగా చేత సహాయం కూడా చేసి, పట్టుబడిపోయి వీపు మీద చేతి వేళ్ళు ముద్రించుకున్నాను. మా అమ్మా నాన్నవే కాక, రెండు కాళ్ళు విరిగిన పాత కుర్చీ స్వంతదారువి కూడా.

అదేమిటో తప్పు చేస్తే అందరూ వీపు మీద చేతులు వేశేసేవారు, మళ్ళీ అవకాశం దొరకదేమో నని. పాపం స్వంతదారిణి మెచ్చుకుంది కూడా,

“పోనీరా సుబ్బయ్యా మంచి పని చేశావు. వాళ్ళ తాతయ్యదిట. చస్తున్నాను దాన్ని సంరక్షించలేక”
అని ఆనంద భాష్పాలు కార్చినా సరే నాకు వీపు మంట తగ్గలేదు.

ఏమైతేనేం, “నేనూ ఒక వీరోచిత కార్యం చేశాను” అని చెప్పుకోటానికి మిగిలింది కదా యని నానందిస్తూ ఉంటాను.

మళ్ళీ ఎప్పటిలాగానే యధావిధిగా ఠoచనుగా వచ్చేసిన మకర సంక్రాంతికి మీ అందరికీ శుభాకాంక్షలు. బంధు మిత్రుల సందడితో, పిండివంటల ఘుమ ఘుమ లతో, ఛలోక్తులతో, సరదాలతో మీ ఇల్లు కళకళ లాడాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


.........మా వైద్య శాలలో కూడా శరీరచ్చేదనమునకై కొన్ని యాయుధముల నుంచితిమి. రెండు చీపురు కట్టలు, వేప బెత్తపు కట్ట, దూలగొండి యాకు నూగుతో గలిపిన విభూతి, రెండు జతల ఇనుప గోళ్ళు, గట్టి బిరడలు గల భూతాకర్షణ కాచ పాత్రలు, నొక పట్టుకారును మా శాలలో శల్య తంత్ర సాధన సామాగ్రి యై యున్నవి. ఈ యాయుధములకు కూడా వింత వింత పేరులు మా గురువుగారు కల్పించి యుంచిరి. చీపురు కట్టకు కాంతా కరవాల మనియు, వేప బెత్తమునకు బాల బుద్ద్యుద్దీపిని యనియు, దూలగొండి బూడిద కుగ్ర నారసింహ మనియు, నినుప గోళ్ళకు కాళికా దంష్ట్ర లనియు, సీసలకు క్షోణీ కుక్షి నిక్షేపములనియు, బట్టు కారుకు వీరాంజనేయమనియూ విచిత్ర నామములను వస్త్వగౌరవ పరిహారార్ధముగను, భూతరోగులకు భయాభి వర్ధనార్ధముగను గల్పించిరి.........

పానుగంటి లక్షీనరసింహము గారి సాక్షి మొదటి సంపుటము, జంఘాల శాస్త్రి యుపన్యాసం నుంచి తస్కరించి నది.

ఈ యుపన్యాసములో అప్పడాల కర్ర గురించి చెప్పలేదు. దానికే నామధేయము ఒప్పునో మీరు చెప్పండి అని నా వినతి.


నవ్వు

జీవం, మార్పు, బుద్ధి అనే లక్షణాలు అన్నీ కలిసి ఉన్నవాళ్ళు మానవులే కనుక, ఏ మానవుల్లో వాటికి కొరతగాని, లోటు గాని, అభావం గాని, వైరుద్ధ్యం గాని కనిపిస్తుందో వాళ్ళని గురించి ఇతరులు నవ్వుతారు. ఈ సంగతి హాస్య తత్వవేత్త అని లోక ప్రసిద్ధి గాంచిన బెర్గ్సన్ స్పష్టంగా సూత్రించాడు. సజీవులై ఉండవల్సిన మానవులు జడత్వ ప్రకటన చేసినప్పుడు, బుద్ధి ప్రయోగించగోవలిసిన మానవులు సంప్రదాయ సాంకర్యంలో పడిపోయినప్పుడు తప్పకుండా హాస్యాస్పదు లవుతారు. ఎక్కువ హాని లేనప్పుడు ఆకస్మిక సంభవాలకి, కల్పిత సంభవాలకి, అన్య పరంగా ఉండే తిట్లకి, ఇతరుల పిరికితనం, భయం చూసి నవ్వు వస్తుంది. పై లక్షణాలు చట్టాలలో ఉండని నేరాలు. అల్లాంటి నేరాల్ని లోకం భరించలేక శిక్షిస్తుంది. ఆ శిక్షే నవ్వు.

నింద, పరిహాసం, ఎగతాళి, ఎత్తిపొడుపు, ఈసడింపు, హేళన, వెటకారం మొదలైన సాధనాలు ఉద్దేశప్రకారం ఫలించినప్పుడు నవ్వొస్తుంది. వీటితో తక్షణ ఫలితం (నవ్వు) రానప్పుడు సాధనాల్ని మెచ్చరు. భాషతోను, స్వరంతోను హాస్యం పుట్టించ వచ్చు. రేఖా రచనల్లో హాస్యం ఉంటుంది. హాస్యం పట్టివ్వకపోతే (పేలకపోతే) లోటు ఎవరిదైనా అపజయం మాత్రం హాస్య కారకుడిదే. అందుకనే తెలుగులో “సగం చచ్చి సంగీతం అంతా చచ్చి హాస్యం” అనేది వాడుకలో ఉంది.

అసలు నవ్వనేది బలవంతపెట్టి, మొహమాటపెట్టి, చావగొట్టినా రాదు, బయల్దేరిం తరువాత ఆగమన్నా ఆగదు. నవ్వును నిర్వచించడం నవ్వులాట కాదు. “ఎదట ఉన్న వస్తువులోగాని, గోచరించే భావంలో గాని, జరిగే విషయంలోగాని ఉండే విపరీత వైషమ్యం వల్ల మనసుకి కలిగే ఆశ్చర్యాన్ని మానవుడు సమన్వయం చేసుకొని జీర్ణించుకొనే లోపల కండరాల బిగింపు విలంబనలతో కూడా అప్రయత్నంగా నిర్బంధకంగా బయల్దేరే ఉచ్చ్వాసమే నవ్వు” అని ఒక మహామహుడు అన్నాడు.

చదువు రాని వాళ్ళు, చిరు నవ్వు, సకిలింపు,ఇకలింపు,ముసిముసి నవ్వు, స్ స్ నవ్వు, గుడ్డి నవ్వు, పకపక, వెకవెక లాంటి పేర్లు పెట్టుకుంటే, శాస్త్రజ్ఞులు, స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహాసితం, అతిహాసితం లాంటి పేర్లు అనేకం పెట్టుకున్నారు. ఇవి కాక తుపాకీనవ్వు (పెదిమలు బద్దలు చేసుకొని ఠప్పున బయల్దేరేది) కొనఊపిరి నవ్వు (మాటా రాకుండా నవ్వూ తెమలకుండా నవ్వే నవ్వు) లాంటివి కూడా ఉన్నాయి.

ఇతరులని చూచి నవ్వడంలో అహంకార మమకారాల వల్ల పెట్టే ఈర్ష్యా కుత్సితాలు ఎంతో కొంత ఉంటాయి. శృతి తప్పక, మర్యాద మరవక, స్థాయి చెడక ఆహ్లాదం కలిగించేదే సవ్యమైన నవ్వు.

భమిడిపాటి కామేశ్వర రావు గారు.
(తనలో అనే పుస్తకం లో నవ్వు అనే వ్యాసంలోంచి అక్కడక్కడ తస్కరించి కూర్చినది)


Post has attachment
హాస్య రస ప్రధానమైన కావ్యాన్ని ఉత్తమ కావ్యంగా పరిగణించే ఆచారం మనకు లేదు. కరుణకూ శృంగారానికీ ఇచ్చిన గౌరవం దీనికి ఎప్పుడూ లేదు. కాని హాస్యరసం కూడా రమణీయమైనదే. దీనికీ గౌరవమూ, ఆదరణా ఇయ్యవలసి ఉంది.
హాస్యం తేలిక అయినదనీ బరువు లేనిదనీ అంటారు. బరువు లేకపోతే నేమి? బంగారంలాంటి సరుకు ఇది. జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. అంతకంటే ఏం కావాలి? హాస్య సృష్టికి కూడా ఒక విశిష్టమైన దృష్టి, ఒక రకమైన ప్రతిభ కావాలె. దీనికి తేలికదనం ఎందుకు వచ్చిందీ అంటే ఇది అందరికీ అర్ధము అవుతుంది కాబట్టే. పద్యాలు అర్ధము కాకపోయినా బాగానే ఉంటవి. పద్యం అర్ధం కాకపోయిన కొద్దీ దానికి గౌరవం ఎక్కువ అవుతుంది. దాని కావ్య గుణం కూడా పెరుగుతుంది. దాని సంగతి అల్లా ఉంచండి. అర్ధం అయినంత మాత్రాన హాస్యం ఏమీ తక్కువది కాదు.
హాస్యం అర్ధమైనట్లు ఉంటుంది. కాని నిజానికి బాగా అర్ధము కాదు. దాని లోతులు తెలియడమూ కొంచెం కష్టమే! కవిత్వం ఎట్లా అర్ధం చేసుకుంటారో హాస్యాన్నీ అట్లాగే అర్ధం చేసుకోవాలె. లోతుపాతులు వెదికి కనుక్కోవాలె. మెరుగుల లోపల ఉన్న చమత్కారపు లోతు తెలిసికొని ఆనందిస్తే ఇంక కావలసింది ఏమున్నది?

మునిమాణిక్యం నరసింహారావు గారు.

ఇల్లు ఇల్లాలు అనే పుస్తకంలో. పుస్తకం చిన్నదే. హాస్య ప్రియులు చదువుకో దగ్గ పుస్తకం. ఈ కింద లింక్ లో చదువుకోవచ్చు. నిన్న సాయంకాలం మళ్ళీ చదివాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్లి చేసుకోబోయే వారు చదివి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి......... దహా

https://archive.org/stream/MunimanikyamNarasimharao/illu_illalu%2C%20munimanikyamu_narasimahrao#page/n27/mode/2up


తిని కూర్చోకుండా ఆ మధ్యన ఒక కధ వ్రాశాను. వ్రాశాను కదా అని 'ఈ మాట' జాల పత్రిక వారికి పంపాను. వారు జాలితో వారి పత్రికలో వేసుకున్నారు. అదన్నమాట సంగతి.

http://bulususubrahmanyam.blogspot.in/2017/01/blog-post.html

చదివి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తెలియ చేసి నన్ను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి చేయండి........ దహా 

Post has attachment
చాలా కాలం తరువాత ఒక కధ. ATA రజతోత్సవ సంచిక 2016 కి వ్రాసిన కధ.

http://bulususubrahmanyam.blogspot.in/2016/12/blog-post.html

చదివి చెప్పండి. ఇంకా నేను వ్రాయవచ్చా లేక మానేయ్యాలా........ దహా 

"అర్ధం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాని జీవితమైనా  హాయిగా ఉంటుంది."

ఒక మిత్రుని  + గోడపై కొటేషన్.

అవును . అడుక్కోవడం మొదలుపెట్టినప్పుడే అర్ధం చేసుకుంటుంది.....దహా. 

Post has attachment
భలే మంచి చౌక బేరము
తరుణము మించిన దొరకదు
సుజనులారా త్వరం  గొనుడు
భలే  మంచి చౌక బేరము
Photo

గత ఐదారు రోజుల్లో మదుపర్ల సొమ్ము సుమారు 3.6 లక్షల కోట్లు ఆవిరి అయిపోయిందట. విచారించాను. దుఃఖించాను. బోర్ భోర్ బోభోర్ మన్నాను.
అందులో ఓ రెండు వేల రూపాయలు నాది కూడా ఉందని అశ్రుపూరిత  నయనాలతోనూ, గద్గతిక గొంతుతోను మనవి చేసుకుంటున్నాను.
RIP నా రెండు వేల రూపాయిలు.
మీరు కూడా దయచేసి రిప్పాలని కోరుకుంటున్నాను.  
Wait while more posts are being loaded