Profile cover photo
Profile photo
satyavati kondaveeti
1,543 followers -
I am editor and publisher of a feminist magazine BHUMIKA in Telugu. I am a writer and an Activist.I am running a Helpline for women in distress.The Tollfree no is:1800 425 2908
I am editor and publisher of a feminist magazine BHUMIKA in Telugu. I am a writer and an Activist.I am running a Helpline for women in distress.The Tollfree no is:1800 425 2908

1,543 followers
About
Posts

Post has attachment
**
రేపటి కల  -కొండవీటి సత్యవతి హాలంతా చప్పట్లతో మారుమోగుతుంటే అశ్విని నిటారుగా నడుస్తూ స్టేజిమీదకు వెళ్ళింది. ”యువనాయకురాలు” పురస్కారం స్వీకరించింది.  మరోసారి చప్పట్లు… ఆగకుండా. ముందు వరుసలో కూర్చున్న అనన్య కళ్ళల్లో నీళ్ళుబికాయి. కన్నీళ్ళ మధ్య అశ్విని ముఖం మసక...
Add a comment...

Post has attachment
‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు
మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను. ఆయన చనిపోయాడని నాకు చెప్పకుండా నన్ను ఊరికి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి మా నాన్న లేడు. మా అమ్మని మా పడిమీద వసారాలో చీకట్లో కూర్చోబెట్టారు. ఎవరెవరో రావడ...
Add a comment...

సెప్టెంబర్ భూమిక సంపాదకీయం
-----------------------
‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు
-------కొండవీటి సత్యవతి
------------------
మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను. ఆయన చనిపోయాడని నాకు చెప్పకుండా నన్ను ఊరికి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి మా నాన్న లేడు. మా అమ్మని మా పడిమీద వసారాలో చీకట్లో కూర్చోబెట్టారు. ఎవరెవరో రావడం, మా అమ్మ, అక్కలు, వదిన గొల్లుమంటూ ఏడవడం. నాకు అలా ఏడవడం రాదు. మా వీథి అరుగుమీద కూర్చుని మా నాన్నని తల్చుకునేదాన్ని. ఆయన అదే అరుగుమీద చాపలాంటిదేదీ వేసుకోకుండానే ఆదమరిచి నిద్రపోయే దృశ్యాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండేదాన్ని. నా చిన్ననాటి నేస్తం భారతి నాతో ఉండేది. నాలుగైదు రోజులు గడిచాక నాన్న చనిపోయిన పదో రోజో, పదకొండో రోజో ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే తర్జన భర్జనలు మొదలయ్యాయి. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. బోలెడు మంది కజిన్స్‌… పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు.
మా అమ్మకి ఏదో తంతు చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారని అర్థమైంది. మా అన్న, నేను తీవ్రంగా వ్యతిరేకించాం. అమ్మ ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలి. ఏమీ మార్పులుండవ్‌. అమ్మని కాలువ దగ్గరికి చీకట్లో తీసుకెళ్ళి గాజులు పగలగొట్టడాలు లాంటివి చేస్తే మర్యాద దక్కదని గొడవ పెట్టాను. చివరిసారి అంటూ ముఖమంతా పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పూలు పెట్టి సోకాల్డ్‌ ముత్తయిదువులు వెళ్ళి చూడడం… మళ్ళీ అవన్నీ తీసేసి అమ్మ నెత్తిమీద వైధవ్యం ముద్ర వేయడం… ఇలాంటివన్నీ జరగనివ్వలేదు. దానికి చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. నాన్న పోయిన దుఃఖంలో మునిగి ఉండి కూడా ఈ పోరాటం చేయడం… నేను చాలా డిప్రస్‌ అయిపోయాను. దానినుండి బయటపడి మళ్ళీ మామూలు మనిషిని కావడానికి, హైదరాబాదు తిరిగి రావడానికి చాలాకాలమే పట్టింది. అమ్మ మామూలుగానే రంగు రంగు చీరలు కట్టుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిచ్చింది.
నా జీవితంలో నాకు ఎదురైన ఈ అనుభవం నా ఒక్కదానిదీ కాదని నాకు తెలుసు. మనసును మెలిపెట్టే ఇలాంటి అనుభవాలు ఎదురుకాని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు. భర్తల్ని కోల్పోయిన ఆడవాళ్ళ పట్ల మన సమాజం అనుసరించే దుర్నీతి, అమానవీయ పద్ధతులు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుండడం వెనుక ఉన్నది ఆధునిక తరం నిర్లిప్త వైఖరి. తమ కుటుంబాల్లో స్త్రీల పట్ల అమలౌతున్న అమానుష పద్ధతుల్ని ఆధునికులు కూడా ఆమోదించడం, వాటిని ఆచారాలుగా, కట్టుబాట్లుగా అంగీకరించి తమ తమ కుటుంబాల్లో భర్తలు చనిపోయిన స్త్రీల పట్ల అత్యంత అమానవీయ పద్ధతుల్ని ఆచరించడం సిగ్గుచేటు.
హిందూ మతావలంబికులే ఈ దారుణ ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు. భర్త చనిపోయిన స్త్రీ ముఖంమీద ‘విధవ’ ముద్రవేసి ఆమె జీవితాన్ని మోడులాగా మార్చేస్తారు. ఆమె తిరిగి చిగురించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా కుటుంబం, సమాజం ‘అరిష్టం’ ‘అనర్ధం’ పేరుతో ఆ చిగుళ్ళను చిదిమిపారేస్తారు.
ఏది అరిష్టం? ఏది అనర్ధం? ఏది అశుభం? భార్య చనిపోతే నెల తిరక్కుండా పెళ్ళి చేసుకునే మగవాడు వైధవ్యపు ముద్రలేమీ మొయ్యకుండానే కాలరెత్తుకుని తిరగడం ‘అరిష్టం’ ఎందుకు కాకుండా పోయింది. ఉదయాన్నే అతని ముఖం చూడడం ‘అశుభం’ ఎలా కాకుండా పోయింది. భార్య చనిపోయిన దుఃఖపు ఛాయలు కనబడకుండా మామూలుగానే ఎలా మసలగలుగుతాడు. భర్త చనిపోయిన స్త్రీ మాత్రం ఆ దుఃఖాన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు వ్యక్తం చెయ్యాల్సిన దుస్థితి ఎందుకు? ఒక్కోసారి ఆమెకు దుఃఖం కలగకపోయినా ‘రుడాలి’లా గుండెలు బాదుకుంటూ ఎందుకేడవాలి? భార్య చనిపోయిన మగాడు మహా అయితే పది రోజులు గడ్డం పెంచుకుని దుఃఖ వ్యక్తీకరణ చేస్తాడేమో! అంతకు మించి ఏడుపులు, పెడబొబ్బలు చెయ్యడు కదా!
ఒకసారి నాకెదురైన ఓ అనుభవం ఇప్పటికీ నా రక్తాన్ని మరిగిస్తుంది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు. ఎవరో పేరంటం పిలుపులంటూ మా ఇంటికొచ్చారు. నేను, మా అమ్మ ఇంట్లో ఉన్నాం. వచ్చినవాళ్ళు నాకు బొట్టు పెట్టడానికి వస్తే నేను పెట్టించుకోను అన్నాను. అలా అనకూడదు.’అరిష్టం’ అంది ఒకామె. అరిష్టమంటే ఏంటి? చెబుతావా? అని అడిగాను. మా అమ్మ అక్కడే ఉంది. ఆమె వైపు కూడా చూడకుండా ”సర్లే అమ్మాజి! (నన్ను ఇంట్లో అమ్మాజి అని పిలుస్తారు) నీతో వాదించలేను. ఏం చేయను మరి నువ్వు పెట్టించుకోనంటున్నావ్‌’ అంటూ మా వీథి గడపకి బొట్టు పెట్ట్టింది. మా అమ్మకి పెట్టలేదు. ఆమె చేతిలో ఉన్న పసుపు, కుంకుమ పెట్టిన పళ్ళాన్ని ఎగిరి తన్నాలన్నంత కోపమొచ్చింది నాకు. కానీ వాళ్ళంతా మా చుట్టాలు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆవరించి అమ్మవైపు చూడలేకపోయాను. అమ్మకన్నా గడప విలువైందన్నమాట. చెక్కముక్కకి బొట్టు పెట్టొచ్చు కానీ నాన్న లేని అమ్మ ముఖాన పెట్టకూడదన్నమాట.
ఈ చెత్త ఆచారాలను భోగి మంటలో వేసి తగలెయ్యాలి. స్త్రీలు తమకు తెలియకుండానే ఎలా పితృస్వామ్య భావాల ప్రభావంలో ఉంటారో, తోటి స్త్రీని అవమానిస్తున్నామనే స్పృహ లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో అర్థమయ్యాక వాళ్ళ పట్ల జాలి కలిగింది. చూడడానికి ఇవన్నీ స్త్రీల పట్ల స్త్రీలే దారుణంగా వ్యవహరిస్తున్నట్లు కనబడినా అంతర్లీనంగా ప్రహించేది పితృస్వామ్య భావజాలమే. స్త్రీలందరూ మేము ఈ దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం, సాటి స్త్రీలను అవమానించం అని తీర్మానించమనండి… పురుషస్వామ్య, పితృస్వామ్యం బ్రాహ్మణీయ భావజాలం పడగ విప్పుతుంది. విషం కక్కుతుంది. ముత్తైదువులనీ, పునిస్త్రీలనీ, విధవలనీ విడగొట్టి వికటాట్టహాసం చేస్తుంది. మీరు వీటిని వ్యతిరేకిస్తే మీ భర్తలకి అరిష్టం, ప్రాణ నష్టం అంటూ ఊదరగొట్టి, స్త్రీలందరూ అనివార్యంగా సోకాల్డ్‌ ”మంగళసూత్రాల”ను కళ్ళకద్దుకుని తమ క్రూర పద్ధతులను కొనసాగించేలా భయభ్రాంతులను చేస్తారు. భర్తకంటే ముందు చనిపోయిన స్త్రీల కర్మకాండలను పండగలా చేసి కేవలం భర్తలున్న ”సోకాల్డ్‌ సుమంగళు”లనే పిలిచి వారికి పసుపు, కుంకాలు, కానుకలు ఇచ్చి సత్కరించి, భర్తలు లేని స్త్రీలను అత్యంత హీనంగా అవమానించే పరమ నికృష్ట ఆచారమిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. భర్త లేని స్త్రీని అవమానించే ”సుమంగళి” మొగుడు శాశ్వతంగా బతికి ఉంటాడా? తనకు ఈ దుస్థితి ఎదురుకాక తప్పదని తెలిసీ పురుషస్వామ్యం చేతిలో పాచికలా పనిచేస్తుంది కదా! అదే అత్యంత విషాదం.
నాకు ఎదురైన మరో భయానక అనుభవం. నేనూ, మా పెద్దక్క ఏదో పెళ్ళికి వెళ్ళాం. మా బావ చనిపోయాడు. ఆయన చనిపోకముందు మా అక్క ”పెద్ద ముత్తైదువ” హోదాలో చాలా యాక్టివ్‌గా అన్నింట్లో పాల్గొనేది. అదరూ తనను అన్ని ”శుభ” కార్యాలలో ముందుంచేవారు. మా బావ చనిపోగానే ఆమె దేనికీ పనికిరాకుండా పోవడమే కాక అనేక అవమానాలను ఎదుర్కొంటోంది. నేను పైన రాసిన పెళ్ళిలో పురోహితుడు సోకాల్డ్‌ మంగళసూత్రాలు పట్టుకుని జనంలోకి వచ్చి ”ముత్తైదువుల” మెడలకు తాకిస్తూ మా దగ్గరకొచ్చాడు. నేను నాకు తాకించొద్దని తల అడ్డంగా ఊపాను. నా పక్కనే ఉన్న అక్కకు ఎక్కడ తాకించేస్తాడో అని అక్క పక్క కూర్చున్న ఆమె ”పంతులుగారూ! ఆవిడకి వద్దులెండి” అంటూ కంగారుపడిపోయి తన మెడకి ఆనించుకుంది. నిజం చెప్పొద్దూ… మా అక్కని అవమానించిన ఆ సూత్రాన్ని లాక్కుని నేలకేసి కొట్టాలన్నంత ఆవేశాన్ని ఆపుకుంటూ ఆ పెళ్ళిలోంచి లేచి వెళ్ళిపోయాను. ఇలాంటి పెళ్ళిళ్ళకు వెళ్ళడం మానేసి చాలాకాలమైంది. నేను వెళ్ళడం మానేసినంత మాత్రాన అవమానాలు ఆగిపోతాయని కాదు కానీ ఆ బీభత్సాలను, ఆ అమానవీయ దృశ్యాలను చూసి తట్టుకోలేక గొడవ పడతానేమో అనే భయంతోనే మానేసాను.
నాకు చాలా దగ్గరి స్నేహితుడు ఒకరి తల్లికి జరిగిన అవమానం అతనిని కూల్‌గానే ఉంచింది కానీ నా రక్తాన్ని మరిగించింది. ఆవిడకు నలుగురు కొడుకులు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆవిడ భర్త హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు. చాలా కష్టపడి పిల్లల్ని పెంచి, చదువు చెప్పించింది. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే కొడుకుల పెళ్ళిళ్ళ సమయంలో ఆవిడ పట్ల ప్రవర్తించిన తీరు ఘోరం. ఆవిడ పెళ్ళి మండపంలోకి రాకూడదట. అక్షింతలు వెయ్యకూడదట. ఆవిడ ఆహుతుల్లో ఒకరిగా కూర్చోడానికి కూడా అర్హురాలు కాదట. పెళ్ళిపందిట్లో ఆర్భాటంగా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉండిపోయింది. నా ఫ్రెండ్‌ పెళ్ళిలో నేను అతనిని ”మీ అమ్మేది” అని అడిగినపుడు ”అమ్మెలా వస్తుంది. నాన్న లేడుగా” అన్నాడు. ”ఓరి మూర్ఖుడా! నాన్న ఎలాగూ లేడు. అమ్మరావాలి కదా!” అంటే ”భలేదానివే! అలా వస్తే కోడలికి అరిష్టమట. పిన్ని చెప్పింది.” నా కోపం నషాళానికి అంటింది. ”కోడలికి అరిష్టమంటే ఏంటి? నువ్వు చస్తావా?” అందామనుకుని తమాయించుకున్నాను. ఆ తల్లి పడే మానసిక వేదన, అవమానం, దుఃఖం చదువుకున్న మూఢులకు కూడా అర్థం కాకపోవడమే అసలు విషాదం. రాసుకుంటూపోతే ఎన్నో అనుభవాలు ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉంటాయి.
వైధవ్యం పేరుతో తరాల తర్వాత తరాలు ఎలాంటి మార్పు లేకుండా భర్తల్ని కోల్పోయిన మహిళల పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఆచారాలు, అరిష్టాలు, అశుభాలు, కట్టుబాట్లు లాంటి పడికట్టు పదాలు ఈ స్త్రీల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. మతం, సమాజం, కుటుంబం ఎన్నో అంశాలలో మారుతున్నా, మార్పును ఆహ్వానిస్తున్నా ”వైధవ్యం” అనే పదం పట్ల శిలాజరూపంలోనే ఉండిపోయింది. దీనిని బద్దలు కొట్టాల్సిన అవసరముంది. పితృస్వామ్య భావజాల మత్తులో మహిళలు తోటి మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆచరిస్తున్న ఘోరకృత్యాల అసలు రూపాన్ని అర్థం చేసుకోవాలి.
స్రీలను ముత్తయిదువులు, విధవలు అంటూ విభజించే క్రూర సంస్కృతికి సమాధి కడదాం… రండి… ఆలోచించండి… వ్యతిరేకించండి…
Add a comment...

Post has attachment
**
చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న. ......... ఈ రోజు తండ్రుల దినమట. మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది. ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది. పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి. మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు ...
మా గోదావరి
మా గోదావరి
maagodavari.blogspot.com
Add a comment...

Post has attachment
**
చట్టాలూ – సహాయ సంస్థలూ… మనం – కె. సత్యవతి, పి. ప్రశాంతి ... మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినం అభినందనలు. ‘హేపీ న్యూఇయర్‌’ లాగా ‘హేపీ ఉమన్స్‌ డే’ ఒక గ్రీటింగ్‌లాగా పడికట్టు పదంగా మారిపోయింది. ఎన్నో సవాళ్ళ మధ్య, హింసాయుత పరిస్థితుల్లో, మతమౌఢ్యపు అంధకారంలో నిత...
మా గోదావరి
మా గోదావరి
maagodavari.blogspot.com
Add a comment...

Post has attachment
అశోకం
 కొండవీటి సత్యవతి . నిర్మల మొబైల్ ఫోన్లోంచి ఖయ్‌మంటూ విజిల్ శబ్దం. ‘‘నన్నిక పనిచేసుకోనివ్వదా’’ అనుకుంటూ ఫోన్ లేసి చూసింది. అనల అమెరికా నుంచి... వాట్సప్‌లో మెసేజ్. ‘‘అమ్మా! నేనొస్తున్నాను. టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు కూడా శెలవు పెట్టేయ్’’ ‘‘క్రిస్మస్ శె...
Add a comment...

Post has attachment
జీవన'చాయ్'
https://www.facebook.com/satyavati.kondaveeti Chai-enge 16 th Story ~ కొండవీటి సత్యవతి గారితో జీవన'చాయ్' 11. 26. ఈ రాత్రి ఒక స్నేహశీలి గిరించి రాయాలని, రేపటి స్నేహితుల రోజుకి ఒక కానుకలా ఇవ్వాలని ఇప్పటికే రా సిన దానికి ఇంట్రడక్షన్ జత చేస్తున్నాను. తను సత్యవత...
Add a comment...

Post has attachment
చెట్టు మీద పిట్టల్లే నన్ను స్వేచ్చగా పెంచిన నాన్న.
ఈ రోజు తండ్రుల దినమట. మా నాన్నని తలుచుకుంటుంటే ఏమి గుర్తొస్తుంది. ఆయన రోజంతా చేసిన కష్టం గుర్తొస్తుంది. పొలంలో ఆరుగాలం పనిచేసిన రోజులు గుర్తొస్తాయి. మా ఆవు కోసం పచ్చగడ్డి కోసుకొచ్చి మా వీధి అరుగు మీద అలా వొరిగి నిద్రపోయే నా నాన్న గుర్తొస్తాడు. మా ఆవు కోసం చ...
Add a comment...

Post has attachment
వితంతువుల దినోత్సవమట
మనకి అన్నీ ఉత్సవాలే ఏముంది సెలబ్రేట్ చేసుకోవడానికి?? ఏమి సాధించామట??? భళ్ళున గాజులు పగలకొట్టడం మానేసారా??? కృరంగా బొట్టు చెరిపేయడం మానేసాసా?? తెల్ల చీరలు కట్టించడం మానేసారా?? సొంత బిడ్డల పెళ్ళి మంటపంలోకి గౌరవంగా పిలవడం నేర్చేసుకున్నారా?? "పరమ పవిత్రత" ఆపాది...
Add a comment...

Post has attachment
**
విశ్వప్రేమ   ని   నేర్పే   విపాశన                                                            కొండవీటి సత్యవతి నాగార్జున   సాగర్ ‌  వెళ్ళే   దారిలో ,  గుర్రంగూడ   గ్రామంలో   ఈ   విపాశన   సెంటర్ ‌  వుంది . జూలై  19  వ   తేదీన  1.30 కి   విపాసన   సెంటర్ ‌  చేర...
Add a comment...
Wait while more posts are being loaded