Profile cover photo
Profile photo
SAI RAM
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సంబంద ఉచిత పుస్తకాలు, వీడియోలు, సమాచారం ఒకేచోట!
About
Posts

Post has attachment
Free Gurukul New Android App Released Today..
https://play.google.com/store/apps/details?id=freegurukul.org
Photo

Post has attachment
"ఉచిత గురుకుల విద్య" ప్రాజెక్ట్ నందు స్వచ్చందంగా పనిచేయుటకు ఆసక్తి ఉందా?
Photo

Post has attachment
3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాల ఆండ్రాయిడ్ ఆప్ - నూతన వెర్షన్ విడుదల చేయబడినది

పరమాత్మ స్వరూపమునకు నమస్కారం,

సాయి రామ్ సేవక బృందం సనాతన ధర్మప్రచారం లో భాగంగా ఉచితముగా గ్రంధాలను అందించే మొబైల్ ఆప్ ను
మరింత అభివృద్ధి పరచి కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందుకు ఆర్ధిక రూపంలో సహాయం చేసిన
మీ అందరికి మేము కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. ఈ ఆప్ మన అందరిది, మన ధర్మ పరిరక్షణ కోసం
తయారుచేయబడినది. కావున ప్రతి ఒక్కరు నూతన వెర్షన్ ఆప్ ను వినియోగించగలరు అని మనవి చేసుకొంటున్నాము.
అలాగే మీ మిత్రులకి ఈ మెయిల్ ని పంపించటం ద్వారా వారికి సహాయం చేయగలరు.

అలాగే నూతనంగా సేకరించిన గ్రంధాలు కూడా ఈ ఆప్ ద్వారా లబ్యం అవుతాయి.

ఆప్: https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books

ఆప్ ను ఎలా ఉపయోగించాలో పుస్తక రూపంలో వివరించటం జరిగింది(user guide):
https://archive.org/download/SaiRealAttitudeMgt/3500-FreeTeluguBhaktiBooks-AndroidApp-UserGuide.pdf


ఈ ఆప్ ముఖ్య విశేషాలు:
- పూర్తిగా తెలుగు భాషలో లబ్యమయ్యే గ్రంధాలను మాత్రమే అందించటం
- 3500 e-Books ని PDF రూపంలో అందించటం
- పూర్తిగా ఉచితం
- గ్రంధాలను సులభంగా ఎంచుకొనుటకు 33 వర్గాలుగా(రామాయాణం,మహాభారతం,భాగవతం,వ్యక్తిత్వ వికాసం,జీవిత చరిత్ర.....) విభజించటం జరిగింది(category)
- Ads గాని, వ్యాపార ప్రకటనలు కాని లేవు, అలాగే రిజిస్ట్రేషన్ గాని అవసరం లేదు.
- English లో మీకు కావలసిన పుస్తకం వెదికే ఏర్పాటు కూడా ఉంది(search)
- మీకు నచ్చిన పుస్తకం దిగుమతి(డౌన్లోడ్) చేసుకొని, తర్వాత చదువుకోవచ్చు
- నచ్చిన పుస్తకాన్ని గుర్తు పెట్టుకొని తర్వాత చదువుకోవచ్చు (favourites)
- ఇంటర్నెట్ లేకపోయినా దిగుమతి(డౌన్లోడ్) చేసుకొన్న గ్రంధం చదువుకోగలరు(offline books)
- చివర సారిగా మీరు చదివిన గ్రంధం తిరిగి సులభంగా చదువుకోగలరు(recent read)
- ఆకర్షణీయమైన 3D Sliding సౌకర్యంతో పుస్తకం లో పేజి త్రిప్పుతూ చదివే అనుభూతి పొందగలరు


నూతన సేవలు:
- 3500 గ్రంధాలలో మీరు ఎన్ని గ్రంధాలు చదివారు, ఎన్ని డౌన్లోడ్ చేసుకొన్నారో అనే రిపోర్ట్ ఒకేచోట చూడవచ్చు (My Activity)
-ఈ ఆప్ వినియోగిస్తున్న అందిరికి ఒక గ్రూప్ తయారుచేయబడినది, ఇందులో మీకు నచ్చిన గ్రంధాలు, అలాగే పుస్తకముపై అభిప్రాయాలు
ఇతరులకు తెలియచేయవచ్చు (Discuss Board)
-మన ఆప్ లో గల సమస్యలను లేక సూచనలను మీరు నేరుగా మన సేవక బృందానికి మెయిల్ చేయవచ్చు(Comment)
-మన ధర్మం గురించి మీరు ఏమైనా గ్రంధం వ్రాసి ఉంటే, లేక పాత పుస్తకాలు(pdf) మీరు సేకరించి ఉంటే వాటిని సేవక బృందానికి
పంపించటం చాలా సులువు(Submit eBook)
-సేవక బృంద ధర్మ ప్రచార కార్యక్రమాలు, నూతన విషయాలు అందరికి తెలియచేసేలా కల్పించాము(Notification)
-మీరు ఏదైనా పూర్తిగా చదివితే ఇతరులకి share చేసే నోటిఫికేషన్ కన్పించును, దానిని వినియోగించుకొని ఇతరులకి whatsapp,మెయిల్ ద్వారా తెలియచేయగలరు
Photo

Post has attachment
Photo

Post has attachment
నిన్నటి ఈనాడు పేపర్ లో మన ఆప్ గురించి.......
Photo

Post has attachment

Post has attachment
ఒక పోస్ట్, ఒక మెయిల్ మరొకరి జీవితాన్ని మార్చవచ్చు!
------------------------------------------------------------------------
"ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం" ధర్మ ప్రచారం లో బాగంగా మన సనాతన గ్రంధాలను అందరికి ఉచితంగా చదివే అవకాశం
కల్పించే కార్యక్రమంలో భాగంగా మీ సహాయం కోరడమైనది. అనగా మన ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ గురించి మరింతమందికి
తెలియచేసే కర్తవ్యం అందరిపై ఉన్నది.

మీరు చేయవలసిన చిన్న సహాయం ఏమనగా మెయిల్ లో ఇచ్చిన ఫోటో ని మీ Facebook, Whatsapp, Group, Blog ద్వారా గాని ఇతరులకి
తెలియచేయుట లేక ఈ మెయిల్ ని మీలాంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారికి పంపించుట.

మీరు చేసే ఈ చిన్ని సహాయం మీలాగా ఆర్తితో మన సనాతన ధర్మ గ్రంధాలను చదవాలనే కోరిక ఉన్న వారికి, ఆ గ్రంధాలు ఎక్కడ
ఉచితంగా అందిస్తారో తెలియక నిరీక్షించే వారికి మీరు దారి చూపినవారు అవుతారు.

ఏమో మీరు చేసే ఈ చిన్ని సహాయం మరొకరి జీవితాన్ని మార్చవచ్చు!!

ఆప్ పేరు: 3500 Free Telugu Bhakti Books లేక 3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు

google play store link: https://play.google.com/store/apps/details?id=free.telugu.bhakti.books
Photo

Post has attachment
Photo

ధర్మ ప్రచారంలో మీ వంతు ఉడతాభక్తి సహాయం కోరడమైనది
-------------------------------------------------------------------------------------
"ఇంటింటా ఆధ్యాత్మిక గ్రంధాలయం" ధర్మ ప్రచారం లో బాగంగా మన సనాతన గ్రంధాలను అందరికి ఉచితంగా చదివే అవకాశం
కల్పించే కార్యక్రమంలో భాగంగా మీ సహాయం కోరడమైనది. అనగా మన ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ గురించి మరింతమందికి
తెలియచేసే కర్తవ్యం అందరిపై ఉన్నది. మీరు ఇప్పటికే ఆప్ ఉపయోగించుతూ ఉండి ఉంటారు. ఈ ఆప్ వలన ఎంతో సౌలబ్యం,
ఎక్కడికి వెళ్ళినా మనతో మన సనాతన గ్రంధాలయం వెంట తీసుకువెళ్ళే సదుపాయం గలదు. అటువంటి ఈ గ్రంధాలయం,జ్ఞాన నిధి గురించి మీలాంటి సాధకులకు, జిజ్ఞాసువులకు తెలియచేయడంవలన వారి జీవితంలో మార్పు వస్తే మీ జన్మ తరించును. మీకు తెలిసేవుంటది విద్యాదానం శ్రేష్ఠ మైనది.


మీరు చేయవలసిన చిన్న సహాయం ఏమనగా ఒక ప్లెక్షి/Flex ని ప్రింట్ తయారుచేసి, మీ ఊరు,
పట్టణం,నగరం,గ్రామం లో గల ఏదైనా ఒక దేవాలయం,లైబ్రరీ లోపల లేక బయట గాని కట్టించగలరు. ఇందుకు ఆ దేవాలయ, లైబ్రరీ
కార్యనిర్వాహక అధికారికి ఈ సేవ, ఆప్ గురించి తెలియచేసి, అనుమతి పొంది, అందరికి కనపడేలా కట్టించగలరు. తద్వారా మీలాంటి
జిజ్ఞాసువులు దేవాలయానికి,లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఈ ప్లెక్షి చూసి ఆప్ వినియోగించుకోగలరు. ఈ సేవ ద్వారా మరికొందరికి మన సనాతన
ధర్మం గురించి తెలుసుకొనే గ్రంధాలను అందించినవారు అవుతారు. ఇక్కడ మీరు చేసేది ఉడతా భక్తి కావచ్చు, కాని మీరు చేసిన సేవ
వలన కట్టబడిన ప్లెక్షి వలన కనీసం ఓ పది మంది ఆప్ ఉపయోగించటం వలన కలిగే పుణ్యఫలం, జ్ఞానదానం వలన మీ జన్మ, మీ తరం తరించును. మేము ఇప్పటివరకు కొన్ని చోట్ల మా సామర్ధ్యమేరకు కట్టించాము, ఇంకా జరుగుతుంది. కాని అన్ని ఊర్లలో ఈ కార్యక్రమం చేయటం మా శక్తికి మించిన పని. కావున మీరందరూ సాయి రామ్ సేవక బృంద సబ్యులుగా మన కార్య నిమిత్తం సహాయం కోరడమైనది.

ప్లెక్షి ప్రింట్ సైజు వివరాలు: 8 అడుగులు వెడల్పు, 3 అడుగులు ఎత్తు
ఖర్చు: 200 నుంచి 250/- అవుతుంది.

ఉడతాభక్తిగా సేవ చేయాలనుకొనేవారు సంప్రదించగలరు:
sairealattitudemgt@gmail.com

Post has attachment
Wait while more posts are being loaded