Profile cover photo
Profile photo
Raja Gonda
346 followers -
PHP Developer http://mirrorwebs.com
PHP Developer http://mirrorwebs.com

346 followers
About
Communities and Collections
Posts

Post has attachment
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
PhotoPhotoPhotoPhotoPhoto
8/18/15
41 Photos - View album
Add a comment...

Post has attachment
Add a comment...

Post has attachment
Photo
Add a comment...

Post has attachment
Photo
Add a comment...

Post has attachment
Add a comment...

మన అతి గొప్ప ఇంజనీరింగ్ చదువులు ఇవిగోండి..

90% మంది స్టూడెంట్స్ దగ్గర పిసి గానీ, లాప్ టాప్ గానీ ఉంటోంది.

ఇంజనీరింగ్ చదువులంటే కంప్యూటర్ తప్పదన్నది కాలేజీల, విద్యార్థుల, తల్లిదండ్రుల ఏకాభిప్రాయం. దాంతో అప్పో సొప్పో చేసి.. "కాస్త మా వాడి కోసం మంచి లాప్ టాప్ చెప్పండి" అంటూ నాబోటి, మీబోటి వారిని ఆరా తీసి మరీ తల్లిదండ్రులు ఉన్న ఫళాన కొనిపించేస్తుంటారు.

అప్పటి వరకూ ఫ్రెండ్స్ రూమ్ ల్లో లాప్ టాపుల్లో అందరూ గ్రూప్ గా సినిమాలు చూసేవారు కాస్తా పెన్ డ్రైవ్ లో అవే సినిమాలు కాపీ చేసుకొచ్చి ఇళ్లల్లో చూడడం మొదలుపెడతారు.. ఇంటిల్లిపాదికీ చూపిస్తారు కూడా!

వారానికో రెండు మూడు రోజులు బయట ఇంటర్నెట్ సెంటర్లకి వెళ్లి mails ఛెక్ చేసుకునే వాళ్లు కాస్తా.. ఇంట్లో ఒప్పుకుంటే బ్రాడ్ బాండ్ కనెక్షన్ పెట్టించుకుని మరీ.. ఒకవేళ ఒప్పుకోపోతే Rs. 98 GPRS ఇంటర్నెట్ ప్యాక్ తో మొబైల్ ని పిసికి కనెక్ట్ చేసి మరీ mails మాత్రమే కాదు.. facebook, orkut, google+.. వంటి అన్ని సైట్లలోనూ ఛాటింగ్ లు మొదలుపెట్టేస్తారు.

ఇంజనీరింగ్ లో CPP ఓ సబ్జెక్ట్ గా ఉండి కూడా.. Windows 7లో C++ ఇన్ స్టాల్ చేసుకోవడం తెలియని అమాయకత్వంలో నాలుగేళ్లు వెళ్లదీసే EAMCET ర్యాంకుల హోల్డర్లు మన ఘనులైన విద్యార్థులు.

నాబోటి వారు ఎవరో ఇలా Write C, C++ Programs in Windows 7 Must Watch Full HD అనే వీడియో చేసి.. "బాబూ.. మీరు వాడే Windows 7లోనే C ప్రోగ్రాములు రాసుకోవచ్చు.. దానికోసం XPకి వెనక్కి వెళ్లాల్సిన పనిలేదు" అని చెప్పడానికి ప్రయత్నిస్తే.. ఇలాంటి చప్పటి వీడియోల కన్నా "TV9లో మహేష్ బాబు, రామ్ చరణ్ ల కెరీర్ గ్రాఫ్ గురించి డిస్కషన్" వీడియోలు shares మీద shares, కామెంట్లు, తిట్ల మీద తిట్లు పంచుకుంటూ ఆనందించే గొప్ప యువతరం మనది.

టెక్నాలజీ రంగంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో తెలీదు.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లు, gadgets ఏం వస్తున్నాయో, వాటి వెనుక దాగున్న టెక్నికల్ సీక్రెట్స్ ఏమిటో తెలుసుకునే ఆసక్తి కూడా ఉండదు.. ఏ బ్యాంక్ కెళితేనో క్యూలో నిలబడి బోర్ గా ఫీలయ్యే బదులు.. మనం డిపాజిట్ చేసే డబ్బులు అప్పటికప్పుడు core banking వంటి కాన్సెప్టుల ద్వారా ఎలా update అవుతున్నాయో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా పనిచేస్తుందో.. కనీసం ఆలోచించడానికి కూడా మనసొప్పదు.

ఐ.టి. ఇండస్ట్రీ అంటే.. ఏ ఇంజనీరింగో ముక్కీ మూలిగీ పూర్తి చేసేసి.. ఓ ఆర్నెల్లు అమీర్ పేటలో ఏదో కోర్స్ నేర్చేసుకుని.. కంప్యూటర్ల గురించి సమస్తం వచ్చేసినంత భారీగా రెజ్యూమ్ లలో బిల్డప్ లు ఇచ్చేసి.. లక్షల రూపాయల ప్యాకేజీలతో కూడిన ఉద్యోగాలు సంపాదించేయడం!

ఓ మనిషి జీవితకాలంలో ఇంజనీరింగ్ చదివే 4 ఏళ్లు అతి కీలకమైనవి. ఎంత పదునుపెడితే అంత నాలెడ్జ్ సంపాదించవచ్చు.

కానీ మన యూనివర్శిటీలు ఇంజనీరింగ్ నీ.. అందులోని సబ్జెక్టులనూ అతి సాధారణ అకడమిక్స్ గా మార్చి పారేసి ఎందుకూ పనికిరాని యువతని ఐ.టి. ఇండస్ట్రీలోకి వదులుతున్నా పట్టించుకునే నాధుడు లేడు.

4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన ఏ స్టూడెంట్ నైనా.. నా ముందుకు వచ్చి నిలబడమనండి.. ఐ.టి, కంప్యూటర్స్ గురించి రకరకాల సెగ్మెంట్స్ పై ఓ పదే 10 ప్రశ్నలు వేస్తాను... కనీసం 3 ప్రశ్నలకైనా ఆన్సర్ చెప్పమనండి. ఇది విద్యార్థుల పట్ల చిన్నచూపుతో మాట్లాడుతున్న మాటలు కావు. అసలు ఇంజనీరింగ్ విద్య పేరిట అటు పేరెంట్స్, ఇటు విద్యార్థులూ, అటు డొనేషన్ల మీద డొనేషన్లు వసూలు చేసే కాలేజీలూ 4 అతి విలువైన సంవత్సరాల్ని వృధా చేస్తుంటే చూస్తుండలేక వెళ్లగక్కుతున్న ఆవేదన!

తమ సబ్జెక్ట్ గురించి కొద్దిగా కూడా నాలెడ్జ్ పెంచుకోవాలన్న తపన లేని స్టూడెంట్స్ కీ, గంటల తరబడి ఫేస్ బుక్కుల్లో హీరోహీరోయిన్లు, క్రికెటర్ల కబుర్లు చెప్పుకునే వారికీ ఎందుకు వేలాది రూపాయలు పెట్టి కంప్యూటర్లు కొనిపెట్టడం?

జీవితంలో అతి ముఖ్యమైన దశలో ఇలా కాలక్షేపం చేయడం తప్పని ఎవరు చెప్తారు? అసలు ఎవరైనా చెప్తే వినే దశలో ఉన్నారా? బాధ్యత కలిగిన విద్యావ్యవస్థ, తల్లిదండ్రులు కూడా ఈ రొటీన్ చదువుల గురించి పట్టించుకోపోతే ఈ అతి గొప్ప ఇంజనీరింగ్ విద్యార్థుల భవితవ్యం ఏమవ్వాలి?

కొందరైనా ఆలోచిస్తారని భావిస్తూ..

ఇట్లు
---------------
రాజగోండ
Add a comment...

Post has attachment
Add a comment...
Wait while more posts are being loaded