Profile

Cover photo
Phanindra KSM
622 followers|9,640 views
AboutPosts
People
Have him in circles
622 people
Surjeeth Kumar's profile photo
Patel Mahesh's profile photo
JASWANTH peravalli siva's profile photo
Bendalam krishna Rao's profile photo
Lawyer Asad's profile photo
Mayanti s's profile photo
Arunkumar mandhapalli's profile photo
Tejo Karthik Dama's profile photo
nprashanth saii's profile photo
Links
Basic Information
Gender
Male

Stream

Phanindra KSM

Shared publicly  - 
 
వేటూరి వర్ధంతి

ఈ రోజు (మే 22) వేటూరి వర్ధంతి. ఈ మధ్యే ఎప్పుడూ వినని వేటూరి పాత పాట ఒకటి విన్నాను. "అరణ్యకాండ" అనే అనామక చిత్రంలోని "జాబిల్లిగా మది చల్లగా" అనే పాట. అడివిలో తప్పిపోయిన తన బాబు కోసం ఓ తల్లి పాడే శోక గీతం. అందులోని రెండు లైన్లు -
కడలి పొంగింది నా కన్నుల
అడవి కాచింది నీ వెన్నెల

అడివిలో తిరుగుతున్న ఆ చిన్నారి అడివికే శోభనిచ్చాడు అనే అర్థంలో ఆ బాబుని "అడవిన కాచిన వెన్నెలగా" వేటూరి వర్ణించడం అద్భుతమనిపించింది. "అడవిగాచిన వెన్నెల" అన్న వాడుకని నిరర్థమైనది/నిష్ప్రయోజనమైనది అన్న అర్థంలో వాడతారు. దానికి కొత్త అర్థాన్ని ఇచ్చాడు వేటూరి ఇక్కడ. దటీజ్ వేటూరి!

తెలుగుని అమితంగా ప్రేమించి, తెలుగు పాటల్లో చక్కని భాషని, చిక్కని కవిత్వాన్ని పొంగించిన మహాకవి వేటూరికి నా నివాళి!
 ·  Translate
1
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
Sadhguru and Rishi Prabhakar: a curious connection!
When we have a Guru who strikes a chord with people, there will be always be Guru-haters too who keep spreading lies to damage and discredit the Guru. So it is not surprising that Sadhguru (of Isha Foundation) has his fair share of critics who call him a fr...
1
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
The man whom no one understood!

1
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
ఒక తల్లి తన అల్లరి కొడుకుతో - "చూడు కన్నా! నువ్వంటే నాకిష్టం. నాకు ఒళ్ళుమండే ఆ పక్కింటి ఆంటీ వాళ్ళింటి అద్దం మొన్న నువ్వు బద్దలుకొట్టినప్పుడు మురిసిపోయాను. కానీ ఆ ఎదురింటి బాబుని కొట్టడం తప్పు కదా నాన్నా! వాడు నిన్ను గేలి చెయ్యడం తప్పే అనుకో, కానీ కొట్టకూడదు కన్నా! నువ్విలాంటి పనులు ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు. అందరూ అంటున్నట్టు నువ్వు నిజంగా చెడ్డవాడివే అనీ, నేను కూడా మున్ముందు నిన్ను సమర్థించలేనేమోనని భయంగా ఉంది! నీ పద్ధతి మార్చుకో, ప్లీజ్! మన టార్గెట్ పక్కింటి ఆంటీ అని గుర్తుంచుకో!"

ఎదురింటి బాబు = ప్యారిస్ పత్రిక
అల్లరి కొడుకు = ఇస్లామిక్ తీవ్రవాదులు
పక్కింటి ఆంటీ = అమెరికా
తల్లి = ఈ వ్యాస రచయిత

ప్యారిస్ షూటింగులపై చాలా వ్యాసాలూ, విశ్లేషణలూ చదివాను. కొన్నిటితో ఏకీభవించకపోయినా రాసిన విధానాన్ని మెచ్చుకున్నాను. కానీ ఈ వ్యాసం చదివి మాత్రం నివ్వెరబోయాను!

http://magazine.saarangabooks.com/2015/01/09/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%82%E0%B0%B7%E0%B0%95-%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF/
 ·  Translate
  కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం తమ వెక్కిరింతలకు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారు ! వాళ్లేం చేశారు? ‘నా మతాన్ని, నా ప్రవక్తను కించపరిచారు’ అంటావు, అంతేకదా. కానీ వాళ్లు నువ్వు నరనరానా ద్వేషించే అమెరికా వాడిని, వాడి యూరప్ తొత్తులనూ పరమ అసహ్యంగా గేలి చేశారు…
2
leo L's profile photoPhanindra KSM's profile photo
2 comments
 
+leo L I don't think it is Saranga's opinion. Even it is so, I feel you should not stop reading it.
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
మంచు మిఠాయి = ice-cream

బంగాళదుంప శకలములు = potato chips!

తీపి బిళ్ళ = chocolate

చలి పానకం = cold drink

జిగురు బుడగ = chewing gum

చతుర్ చక్ర శకటం = car

శీతల పవనం = air conditioner

గంధపు చూర్ణం = talcum powder

మంటలేని పొయ్యి = microwave oven

I చిత్రంలోని “లేడియో” పాటలో తమిళ రచయిత “మదన్ కార్కి” కొన్ని కామన్ ఇంగ్లీష్ పదాలకి తమిళ పదాలు వాడి ప్రయోగం చేశానని చెప్పుకున్నాడు. తమిళ భాషా అభిమానులు మెచ్చుకున్నారు కూడా. తెలుగు అనువాదంలో చంద్రబోస్ సృష్టించిన పదాలే ఇవి! ice-cream ని మంచుమిఠాయి అనడం బాగున్నా, chips ని “శకలాలు” అనడం ఎబ్బెట్టుగా ఉంది. పైగా అందమైన అమ్మాయి పెదవులని “మంచు మిఠాయి” తో పోలిస్తే (పెదవో అది మంచుమిఠాయో!) ఎంత మంది ఈ ప్రయోగాన్ని రొమాంటిక్‌గా ఫీల్ అవుతారో తెలీదు :)
 ·  Translate
4
Bhãskar Rãmarãju's profile photopappu sreenivasa rao's profile photoPhanindra KSM's profile photo
4 comments
 
+pappu sreenivasa rao : :) అంతే లెండి. పెదాలని దొండపండుతో పోల్చడం మరీ పాత పోలిక. అయినా అప్పట్లో ఇన్ని రకాల ముద్దులు ఉన్నట్టు లేవు :P
 ·  Translate
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
Starting my writing in the new year with this post! Hope you will find it useful.

http://ksmphanindra.blogspot.com/2015/01/three-inspirations-for-new-year.html
4
Add a comment...
Have him in circles
622 people
Surjeeth Kumar's profile photo
Patel Mahesh's profile photo
JASWANTH peravalli siva's profile photo
Bendalam krishna Rao's profile photo
Lawyer Asad's profile photo
Mayanti s's profile photo
Arunkumar mandhapalli's profile photo
Tejo Karthik Dama's profile photo
nprashanth saii's profile photo

Phanindra KSM

Shared publicly  - 
 
Rahman's "Ok Bangaram"
Some of my thoughts and feelings after listening to Rahman's latest offering "OK Bangaram" The most touching song in "OK bangaram" for me is " maula wa sallim " which apparently is a traditional Sufi song and so not a Rahman's tune. Rahman's young boy AR A...
1
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
ఈ రోజు (జనవరి 29) వేటూరి జయంతి సందర్భంగా పైడిపాల గారు వేటూరి డబ్బింగ్ సాంగ్స్ పైన రాసిన వ్యాసం. క్లుప్తంగా రాసినా చక్కని విషయాలు ప్రస్తావించి వేటూరిని గౌరవించారు.

"ఉరికే చిలకా" (బొంబాయి చిత్రం) పాటకి "చిలక ఉరకడమేమిటి, ఎగరాలి గానీ!" అని వేటూరిని తప్పుపట్టారు (ఇంకెవరూ విమర్శకులే!) అన్నారు. దీనికి సమాధానం చెప్పొచ్చు అన్నారు కానీ, వ్యాసంలో చెప్పలేదు. వేటూరి జయంతి సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను! ఇక్కడ చిలక అంటే పంజరంలో చిలకో, కొమ్మ మీద చిలకో కాదు, "వలపు చిలక" (అంటే సినిమాలో మనీషా కోయిరాల). ఈ పాటకి మణిరత్నం పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంటుంది. ఓ పక్క వెల్లువై అలలెత్తిన సముద్రం, చిరు చినుకులేస్తున్న ఆకాశం, మరో పక్కన ఉరకలపరుగులై హీరోని కలవాలనే తాపత్రయంలో హీరోయిన్ -

ఉరికే చిలకా, వేచి ఉంటాను కడ వరకూ
కురిసే చినుకా, వెల్లువైనావే ఎద వరకూ!

"ఉరికే చిలకా", "కురిసే చినుకూ" రెండూ ఆ అమ్మాయే! ఉరుకూ, చినుకూ, కడలి, వెల్లువ అన్నీ దృశ్యంలో ఉన్నవే, శబ్దంలో కూడా వేటూరి పలికిస్తున్నాడు. గుండెని తట్టే చక్కని భావమూ ఉంది.

ఈ జయంతి రోజున వేటూరిని స్మరించుకుంటూ - "ఉరికే (వేటూరి) కవితా, వెల్లువైనావే ఎద వరకూ!" అనుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలం!

http://www.sakshi.com/news/movies/lyrics-written-veturi-sundararama-murthy-jayanthi-207367
 ·  Translate
8
pappu sreenivasa rao's profile photo
 
fill in the blanks with suitable words......ని చాలా బాగా పూరించారండీ 
 ·  Translate
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! తొలిసారి ఓ web magazine (సారంగ) లో నా కథ ప్రచురించే సాహసం చేశాను! ఇదీ సరదా కథే కానీ కొంత వ్యంగ్యం, ఓ మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాను. చదివి మీకు నచ్చిన/నచ్చని అంశాలు తెలపగలరు!

నన్ను ప్రోత్సహించి, ఓపిగ్గా follow-up చేసి ఈ కథ రాయించుకున్న +Afsar Mohammad  గారికి ప్రత్యేక కృతజ్ఞతలు!

http://magazine.saarangabooks.com/2015/01/14/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF/
 ·  Translate
4
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
‪#‎Telugu‬ ‪#‎I‬ ‪#‎Rahman‬

అతడు:
సూదీదారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా!
నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా!!

ఆమె:
అగ్గిపుల్ల అంచున రోజా పూయునా?
పువ్వులోని తేనె పురుగులకందునా?
మొసలే తగిలి మొగ్గనై మొలిచా!
బూచినే చూసిన పాపనై బెదిరా!

తమిళ గీతాల్లో భావాలు కొన్ని తెలుగులో చూస్తే విచిత్రంగా అనిపిస్తాయి! “నువ్వుంటే నా జతగా, నేనుంటా ఊపిరిగా” అంటూ కరుణరసాత్మకంగా సాగే పాటలో ఇలాంటి భావాలు “రసభంగం” అవుతాయి తెలుగులో! “ఐ” సినిమాలో హీరో మృగంగా మారతాడో ఏదో కాబోలు, దానిని సూచిస్తున్నట్టు ఉన్న ఈ భావాలు బహుశా సినిమాలో చూస్తే పర్వాలేదనిపిస్తాయి ఏమో! వినేటప్పుడు కష్టమే. “శంకర్ తమిళ భావాలే ఉంచమని ఫోర్స్ చెయ్యడు” అని ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పిన “రామ జోగయ్య శాస్త్రి” మరి తమిళ భావాలనే యథాతథంగా ఎందుకు తెలుగు చేశాడో తెలియదు. హిందీ రచయిత ఈ తమిళ భావాలని గాలికొదిలేసి సందర్భానికి అనుగుణమైన భావాలే రాయగలిగినప్పుడు తెలుగు రచయితలు ఎందుకు చెయ్యలేకపోతున్నారు?
 ·  Translate
4
pappu sreenivasa rao's profile photoPhanindra KSM's profile photo
2 comments
 
+pappu sreenivasa rao ఇప్పుడున్న వాళ్ళ స్థాయికి ఇంతకన్నా ఖచ్చితంగా బాగా రాయగలరు. సో ఇది రాయలేక కాదు, రాయాలనుకోలేదో మరి రాసే వీలుబాటు లేదో మరి. 
 ·  Translate
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
క చ ట త ప ల
న్య మ న గ మ న
ర ప ట త ప చ
32 22 32
Ladio, beautiful ladio
Sexy Ladio, likes కోడియో!

ఇది శంకర్ "ఐ" సినిమాలో "లేడియో" పాట తమిళ సాహిత్యం పల్లవి. మొదటి మూడు లైన్లకి అర్థం ఏమీ లేదు. కేవలం సరదాని స్ఫురింపజేసేందుకు రాసినట్టు తోస్తోంది. "అర్థం పర్థం లేని ఈ చెత్త రాతలు ఏమిటి?" అని వాపోయే వాళ్ళకి వచ్చే సమాధానం - "కష్టం అండీ! రెహ్మాన్ ట్యూన్లకి మాటలు పొదగడం ఈజీ కాదు. ఇలా రాయడం వెరైటీ, ఆ feel చూడండి ఎలా వచ్చిందో! అర్థవంతమైన మాటలతో వస్తుందీ? ప్రయోగాలని హర్షించలేని మీలాంటి ఛాందసులు ఉన్నారు చూశారూ.."

దీనికి తెలుగు అనువాదంలో గీతరచయిత చంద్రబోస్, కేవలం రెండో లైనుని "గ జ డ ద బ ల" అని మార్చి మిగతా పల్లవిని అలాగే ఉంచాడు ("కోడియో" అన్న పదానికి తమిళంలో ఏదైనా అర్థం ఉందేమో తెలీదు, బట్ who cares? వెరైటీగా ఉంది వాడేద్దాం!). దీనికీ మెచ్చుకోలుగా - "అబ్బబ్బా! అదుర్స్. కచటతప ద్వారా పరుషాలని, గజడదబ ద్వారా సరళాలని గుర్తు చేశాడు. జీనియస్!" అనేస్తాం. "తమిళ సాహిత్యానికి ఏ మార్పులూ చెయ్యకూడదు, తెలుగులో కూడా అలాగే ఉండాలి, అని శంకర్ కండిషన్ పెట్టాడుట తెలుసా!" అనే సమర్థన కూడా చేసేస్తాం!

కాంచివరంసి
గోరి గరంసి
నారి నరంసి
ఆయిరె ఆయిరె ఛాయిరె
Ladio, beautiful ladio
Sexy Ladio, దేఖో హైరానియో!

ఇది పాట హిందీ అనువాదం. ట్యూన్లో వింటే చాలా చక్కగా ఉంది, ట్రెండీగానే ఉంది బట్ అర్థవంతంగా ఉంది. ఇప్పుడేం అంటాం? నాకైతే హిందీ గీతరచయిత Irshad Kamil పైన చాలా గౌరవం కలిగింది. ఇక్కడ చంద్రబోస్‌ని తప్పుపట్టడం నా ఉద్దేశ్యం కాదు, ఆయనకున్న పరిమితులు ఏమిటో మనకి తెలీదు. కానీ మన తెలుగుపాటల స్థాయి ఎంత దిగజారింది అంటే వెరైటీ కోసం ఏదైనా రాసెయ్యడం, అదే చాలా గొప్ప అని సంబరపడిపోవడం రివాజైపోయింది.
 ·  Translate
4
కొత్తావకాయ ఘాటుగా..'s profile photoPhanindra KSM's profile photo
4 comments
 
:) నేను మాడెస్ట్ అనుకోను! చంద్రబోస్ గురించి నాకూ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నిజానికి చంద్రబోస్ పాటలు నాకు నచ్చినవి చాలా తక్కువ. ఈ సినిమాలో అతను రాసినవీ నచ్చలేదు. కానీ డిస్కషన్ చంద్రబోస్ వైపు మళ్ళిపోతే అసలు పాయంటు మిస్సవుతాం అన్నదే నా ఉద్దేశ్యం.
 ·  Translate
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
Three inspirations for the new year
“Three” is a magic number because our brain seems to have some natural affinity to this number. It is easier to remember three things than five or six things. So why not start the new year with “three inspirations”? Here I pick three tools & concepts tha...
“Three” is a magic number because our brain seems to have some natural affinity to this number. It is easier to remember three things than five or six things. So why not start the new year with “three inspirations”? Here I pi...
6
Add a comment...