Profile

Cover photo
Phanindra KSM
663 followers|40,382 views
AboutPostsCollections

Stream

Phanindra KSM

Shared publicly  - 
 
సిరివెన్నెల రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. 2002 లో వేటూరి పుట్టినరోజు సందర్భంగా “హాసం” పత్రికలో ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరిపై వచ్చిన వ్యాసాల్లోకెల్లా గొప్పది. సిరివెన్నెలకి వేటూరిపై ఉన్న ఆదరాభిమానాలకి దర్పణం ఈ వ్యాసం. వేటూరికీ సిరివెన్నెల అంటే ఎంతో ఆప్యాయత ఉండేది. “సీతారామశాస్త్రి నా సోదరుడు, నాకు పెద్దబ్బాయిలాంటివాడు – చాలా గొప్ప జీనియస్ అతను, అతను వ్రాస్తున్న సాహిత్యం నాకు ఇష్టం” అని వేటూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఈ వ్యాసం చదవడం ఆ మహారచయితలిద్దరికీ వందనాలు అర్పించడమే. పీడీఫ్‌గా ఉన్న వ్యాసాన్ని తెలుగులో టైపు చేసి అందించిన సూర్యప్రభ, చంద్రలేఖ గార్లకు కృతజ్ఞతలు!

https://sirivennelatarangalu.wordpress.com/2016/04/08/%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/
 ·  Translate
సిరివెన్నెల రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. 2002 లో వేటూరి పుట్టినరోజు సందర్భంగా “హాసం” పత్రికలో ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరిపై వచ్చిన వ్య…
4
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
Some of my thoughts on Homeopathy!
1
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
#sirivennela #mustread

"శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా" పాట రాయడంలో తాను పడ్డ కష్టం గురించి సిరివెన్నెల స్వయంగా రాసిన ఈ వ్యాసం ఆయన స్వదస్తూరిలో పాత manasirivennela.com వెబ్సైటులో ఉండేది. ఒక కళాకారుడికి కళపట్ల ఎంత నిబద్ధత ఉండాలి, గొప్ప కళాసృష్టికి ఎంత తాపత్రయ పడాలి అన్నది తెలియాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి. వ్యాసం చదివాక సిరివెన్నెలకి మనసులో ఓ నమస్కారం పెట్టకుండా ఉండలేం. ఈ అపురూపమైన వ్యాసాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఉడతాభక్తిగా టైపు చేసి అందిస్తున్నాను.

https://sirivennelatarangalu.wordpress.com/2016/03/13/%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%85%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AE%E0%B1%88/
 ·  Translate
(“శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా” పాట రాయడంలో తాను పడ్డ కష్టం గురించి సిరివెన్నెల స్వయంగా రాసిన ఈ వ్యాసం ఆయన స్వదస్తూరిలో పాత manasirivennela.com వెబ్సైటులో ఉండేది. ఒక కళాకారుడికి క…
4
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
"Mounamelanoyi" song - the magic of Ilayaraja and Veturi
In director K.Vishwanath 's masterful creation " Sagara Sangamam ", music and lyrics play a big part. The magic of Ilayaraja 's music is amplified by the wonderful lyrics provided by Veturi . I n this article,  I take a look at the lyrics of the haunting me...
4
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
వేటూరి జయంతికి మిత్రులం ముగ్గురం మూడు పాటలపై వ్యాసాలు రాద్దాం అనుకున్నాం. నేను "వెన్నెల్లో వేసవికాలం" పై రాస్తే, సోదరుడు అవినేని +Avineni Bhaskar వేటూరి వానపాటల్లో తడిసి ముద్దై జ్వరం తెచ్చుకుని వ్యాసాన్ని పూర్తిచెయ్యలేకపోయాడు కానీ ఇంకా చలిజపం చేస్తూనే ఉన్నాడు!

సరే భావుకతా, సౌందర్యపోషణా, చిలిపితనం వేటూరిలో ఒక పార్శ్యం అయితే ఆయనలోని మహా వేదాంతి మరో పార్శ్యం. ఈ అద్వైత వేదాంతిని సంపూర్ణంగా దర్శింపజేసే పాట "మనిషిగ పుట్టెను ఒక మట్టి". ఎంతో లోతైన ఈ పాటని అద్భుతంగా విశ్లేషించి సోదరుడు సందీప్ +Sandeep P మనకి అందించాడు! ప్రస్తుతం లభ్యంకాని ఈ పాట ఆడియోని వేటూరి తనయులు వేటూరి రవిప్రకాశ్ +Veturi Ravi Prakash గారు ఆత్మీయంగా మాకందించారు, వారికి ధన్యవాదాలు!


మనిషిగ పుట్టెను ఒక మట్టి
తన మనసును పెంచినదే మట్టి
మానై పుట్టెను ఒక మట్టి
తన పూవై పూసినదే మట్టి

అటనట నిలిచెను ఒక గగనం
తన ఘటమున నిండినదేగగనం
ఘటనాఘటనల నడుమ నటనలో
మెరుపులు మెరిసినదే గగనం

http://veturi.in/957

 ·  Translate
కథానాయకదర్శకనిర్మాతాదుల ఒత్తిడి లేకుండా వ్రాయడం ఏ చలన చిత్ర కవికైనా వరమే. బహుశా అందుకేనేమో, వేటూరి private albums కొన్నిటికి ఆణిముత్యాల వంటి పాటలు వ్రాసారు. “శ్రీ వేంకటేశ్వర పదములు” అనే…
6
Phanindra KSM's profile photopappu sreenivasa rao's profile photo
2 comments
 
చక్కగా ప్రెజంట్ చేసారండీ పాటని. +Phanindra KSM 

అద్భుతంగా విశ్లేషించారు సందీప్ గారూ  +Sandeep P 
 ·  Translate
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
వేటూరి క్రీస్తుపై రాసిన వినూత్న ప్రయోగాల గీతం "అపరంజి మదనుడే" పాట గురించి నేను రాసిన వ్యాసం "సారంగ" పత్రికలో

http://magazine.saarangabooks.com/2015/12/23/%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%86-%E0%B0%B5%E0%B0%B2/
 ·  Translate
4
Srinivas Blogworld's profile photoSuresh Peddaraju's profile photoPhanindra KSM's profile photo
4 comments
 
+Suresh Peddaraju Thank you!
Add a comment...
Have him in circles
663 people
Narasimha Rao Maddigunta (Manavu)'s profile photo
Rathi Pawan's profile photo
Ramani Rao's profile photo
Ballepalli SRINIVASA RAO's profile photo
Rani Mahalakshmi's profile photo
హరి కృష్ణ's profile photo
ప్రదీప్ రేగూరి's profile photo
బొల్లోజు బాబా's profile photo
Josyabhatla Rajasekharasarma's profile photo

Phanindra KSM

Shared publicly  - 
 
ఉగాది శుభాకాంక్షలతో...
"ఉగాది కొత్త ఆశలకీ, శుభకామనలకీ ప్రతీక. మనని మనం సంస్కరించుకోవడం కంటే శుభకరమైనది ఏముంటుంది? అందుకే మనలోని జడత్వాన్ని పారద్రోలి కార్యోన్ముఖుల్ని చేసే “మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు” అన్న అన్నమయ్య గీతంతో ఉగాదికి స్వాగతం పలుకుదాం."

http://magazine.saarangabooks.com/2016/04/07/%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AE%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF/
 ·  Translate
4
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
‪#‎Apple‬ ‪#‎Sleep‬ ‪#‎Recommendation‬

With the new "Night shift" mode on IOS 9.3, Apple made a significant contribution to enable a good-night's sleep. There is good amount of research that indicates "white light" disturbs sleep patterns (see: http://psychcentral.com/…/17/better-sleep-for-a-better-life/). Experts recommend people to not watch TV or phone or computer or any other white-light emitting device for at least 2 hours before sleep. For those who can't do this (which is most of us!), Apple's "night shift" mode comes as a savior.

This feature is not an innovation by Apple. Flux app (https://justgetflux.com/) possibly pioneered this idea and I am pretty sure there are many Android apps (See Twilight app: https://play.google.com/store/apps/details…) already doing the same thing. But Apple has a way of making things seem "cool" and this "cool factor" will surely give a boost to this concept. A proof of this is that I started using Flux again on my computer after uninstalling it an year back!

I highly recommend people to start using these apps during night time!

https://justgetflux.com/
Software to warm up your computer display at night, to match your indoor lighting.
1
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
#BookReview

చాలానాళ్ళ తర్వాత చదివిన అతి చక్కని తెలుగు నవల "ఆనందో బ్రహ్మ". రచయిత యండమూరి నాకు ఇష్టమే అయినా, ఈ నవలలో ఉన్న భావుకత నేను ఊహించనిది. మనసు ఆర్ద్రమవ్వడం, కంట నీరు తిరగడం అన్నవి ఈ నవల చదవడంలో జరుగుతాయని అనుకోలేదు. ఓ అందమైన అనుభూతి (అది ఆనందమో ఉద్వేగమో కాదు, ఒక రకమైన ప్రశాంతత), గొప్ప పుస్తకాలు చదివినప్పుడల్లా కలిగే ఆ అనుభూతి, ఈ పుస్తకమూ ఇచ్చింది. రచయిత యండమూరికి అభివందనాలు.

"ఒళ్ళో కూర్చోబెట్టుని మంత్ర పుష్పం చదివించి స్వారోచిష మనుసంభవం చదువుతూ ఉండగా వెళ్ళిపోయిన తాతయ్యకి" అంకితం ఇచ్చారు రచయిత ఈ పుస్తకం. ఈ పుస్తకంలో నిజానికి హీరో అలాటి తాతయ్యే. సాంప్రదాయం గల వేదాంతి అయినా అభ్యుదయ భావాలతో నిండిన మానవతావాదిగా ఆ పాత్రని రచయిత తీర్చిదిద్దారు. తాతయ్య సహచర్యంతో, ఆయన వ్యక్తిత్వంతో ప్రేరణ పొందిన మనవడు సోమయాజి, ఆ తర్వాత జీవితంలోని పరిస్థితులకి దాసోహుడై తప్పుదారి పడుతూ ఉంటే వెలుగు రేఖలా వస్తుంది "మందాకిని". ఆమె పరిచయంలో అతను తనని తాను పునస్థాపించుకుని, జీవితాన్ని పునర్నిర్మించుకుని, జీవితాన్ని ఎలా గెలిచాడు అన్నది కథాంశం. ఈ కథ చెప్పే క్రమంలో కొన్ని భావకవితా చిత్రాలూ, కొన్ని ప్రబంధ ఉటంకాలూ, కొన్ని జీవన విశ్లేషణలూ, కొన్ని మానవ సంబంధాల పరిశీలనలూ, ఓ అందమైన ప్రేమ కథా ఇలా ఎన్నింటినో రచయిత ప్రతిభావంతంగా చొప్పించారు.

"ఎందుకు నీ మీద నీకింత జాలి? నీ చేతగానితనానికి ఎప్పుడైతే అవతలి వాళ్ళేదో చేస్తున్నారని, అందుకే నువ్విలా అయిపోయావని సమర్థించుకోవడం మొదలెడతావో, అప్పట్నుంచే నువ్వు జడుడివి అవటం ప్రారంభిస్తావు. ఇంకేమీ చెయ్యలేవు. ఇది నీ ఒక్క విషయంలోనే కాదు, ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. నీ ఉనికికి అనుగుణంగా నీ సిద్ధాంతాన్ని నిర్మించుకుని, అదే గొప్పదన్న భ్రమలో మునిగిపోకు! యుద్ధం చెయ్యి సోమయాజీ, యుద్ధం చెయ్యి. అప్పుడే నీ మీద జాలి పోతుంది. అదీ వేదాంతం అంటే. ఆశావాదం లోంచి వచ్చేది వేదాంతం, నిరాశావాదంలోంచి వచ్చేది శ్మశాన వైరాగ్యం!"

ఇలాంటి మణిపూసల్లాంటి వాక్యాలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.

ఈ పుస్తకం 1989 లో ప్రచురించబడింది. పుస్తకంలో రచయిత 2054 సంవత్సరంలో మొదలెట్టి, అసలు కథని ప్లాష్ బ్యాకులో చెబుతారు. 2054 లో ఉండబోయే సాంకేతిక అభివృద్ధినీ, మనుషుల్లోని యాంత్రికతనీ రచయిత చక్కగానే ఊహించారు. ఆయన జోస్యాలు కొన్ని నిజమే అయ్యాయి అనాలి, ఇప్పటి పరిస్థితి చూస్తే. అయితే "స్మార్ట్ ఫోన్" అనే పరికరం ఒకటి వస్తుంది అనీ అదొక్కటే ఈ పుస్తకంలో రచయిత చెప్పిన చాలా పనులు (అలారం వంటివి) చేస్తుందనీ రచయిత ఊహించలేకపోయారు. ఏదేమైనా ఇలా వినూత్నంగా కథని మొదలుపెట్టి పాఠకునికి ఆసక్తి కలగచెయ్యడమే కాక, అసలు కథకి చక్కని భూమిక ఏర్పరచడంలో కూడా రచయిత సఫలీకృతులయ్యారు.

నేను చదివిన యండమూరి నవలల్లో నాకు బాగా నచ్చిన నవల "ప్రేమ". "ఆనందో బ్రహ్మ" కూడ అంతే బాగా నచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువై హ్యూమన్ కనక్షెన్లు తక్కువౌతున్న ఈ రోజుల్లో అందరూ చదవదగ్గ, చదవాల్సిన నవల ఆనందోబ్రహ్మ.

https://www.goodreads.com/review/show/1584798489?book_show_action=false
 ·  Translate
4
pappu sreenivasa rao's profile photoPhanindra KSM's profile photo
4 comments
 
తెలుగు పుస్తకాల కలెక్షను ఉండడం అదో ఆనందం. మీ దగ్గర చక్కని పుస్తకాలు ఉన్నాయి.
 ·  Translate
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
బాగా నచ్చిన పాటలపై వ్యాఖ్యలు రాయడమే తప్పించి "ఆడియో వ్యూ" లను (నేను రాసేవి రెవ్యూలనను నేను!) రాయడం నాకు అంత ఇష్టం ఉండదు. అయినా ఎందుకో "ఊపిరి" చిత్రగీతాలను విన్నాక మొత్తం పాటలపై నా స్పందనని తెలపాలన్న బుద్ధిపుట్టింది. సిరివెన్నెల 5 పాటలని, రామజోగయ్య శాస్త్రి 2 పాటలని రాసిన ఈ ఆల్బం పైన నా అభిప్రాయం ఇదిగో!

https://manikya.wordpress.com/2016/03/06/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%95%E0%B1%87-%E0%B0%8A%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/
 ·  Translate
“ఊపిరి” చిత్రానికి ఊపిరి సిరివెన్నెల రాసిన పాటలని చెప్పక తప్పదు. నిజానికి ఈ చిత్రానికి సిరివెన్నెల రాసిన పాటల్లో మరీ కొత్త భావాలు కానీ, వినూత్న ప్రయోగాలు కానీ పెద్దగా లేవు. ఆయన తన పాటల్…
3
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...

ప్రేమలో పడడానికి ఎవరూ లేని వారు ఈ పాటతో ప్రేమలో పడండి!
ప్రేమలో పడడానికి ఎవరైనా ఉన్న వారు ఈ పాటతో ఇంప్రస్ చెయ్యండి!
ఆల్రెడీ ప్రేమలో ఉన్నవాళ్ళు ఈ పాటలోని మాధుర్యాన్ని పంచుకోండి!
"ఈ ప్రేమా గీమా పరమ బోరు" అనేవాళ్ళు, ఈ పాటను విని మనసును పెంచుకోండి!

"బాజీరావ్ మస్తానీ" చిత్రానికి రామజోగయ్య శాస్త్రి గారి అద్భుత సాహిత్యానికి నా వ్యాఖ్య!

http://magazine.saarangabooks.com/2016/02/10/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D-%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80-%E0%B0%97%E0%B1%80%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B1%81/
 ·  Translate
2
Add a comment...

Phanindra KSM

Shared publicly  - 
 
ఈ రోజు (జనవరి 29) వేటూరి జన్మదినం సందర్భంగా ఆ మహాకవికి నివాళులర్పిస్తూ ఆయన రాసిన ఓ రసరమ్య గీతంపై నా స్పందనని నేను కొత్తగా మొదలుపెట్టిన "వేటూరి వైభవం" బ్లాగులో ప్రచురించాను! "ఒట్టేసి చెబుతున్నా" చిత్రానికి వేటూరి రాసిన ఈ పాట కంటే గొప్ప పాటలు చాలానే ఉన్నాయి కానీ, ఇది నాకెంతో ఇష్టమైన పాట, నేను తరచూ పాడుకునే పాట. విద్యాసాగర్ స్వరకల్పన చాలా చక్కగా ఉంటుంది. ఈ పాట ప్రేమలో పడ్డ పెళ్ళికాని యువతీయువకులకూ, ఇంకా ప్రేమలోనే ఉన్న పెళ్ళైన యువతీయువకులకూ ప్రత్యేకం :)

http://wp.me/p74RB9-8z
 ·  Translate
2
Add a comment...
Phanindra's Collections