Profile

Cover photo
Nava Telangana
36 followers|41,374 views
AboutPostsPhotosVideos

Stream

Pinned

Nava Telangana

Shared publicly  - 
 
నవ తెలంగాణ దినపత్రిక ప్రజల చేతిలో ఒక ఆయుధం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. తెలంగాణా సమాజానికి ఇది ఒక కరదీపికై నిలవాలని అభిలషించారు. అనవసర సంచలనాలకు పోకుండా అవసరమైన విషయాలను విస్మరించకుండా వార్తలను విశ్లేషణాత్మకంగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేలా నవతెలంగాణ అండగా నిలుస్తుందని సిఎం విశ్వాసం వ్యక్తం చేశారు.
#navatelangana #kcrlaunch #నవతెలంగాణ
 ·  Translate
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
   దేశాన్ని క మ్యూనిస్టులే కాపాడా రని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నా రు. భారత దేశానికి రక్షణ కవ చంలా నిలిచారని కొని యాడారు. 34ఏళ్ల చరి త్ర కలిగిన ప్రజాశక్తి రాష్ట్రవి భజన నేప థ్యంలో నవ తెలంగాణ రావ డాన్ని మన స్ఫూర్తిగా ఆహ్వా నిస్తున్నాని చెప్పారు. తెలం గాణ ఏర్పడక ముందు అనేక పత్రికలు అనేక విధా లుగా వార్తలు రాశా యని చెప్పారు.తెలంగాణ వారికి తెలివి లేదని, పని చేయరాదని రకరకాలుగా వార్తలు వచ్చేదన్నారు. రాస్తే వక్రీకరణలు లేకుంటే అసత్యాలేనని అన్నారు. తెలంగాణ ఏర్పడితే మిగులు బడ్జెట్‌ ఉంటుందన్న సంగతి ముందే తెలుసన్నారు. అయినా ఇప్పుడు కూడా అదే ధోరణితో కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయన్నారు. ఆధిపత్య భావజాలం తెలంగాణ సంస్కృతి మీద దెబ్బకొట్టిందన్నారు. ప్రజల మధ్య విద్వేషం లేదన్నారు. ఒక వేళ విద్వేషం ఉంటే విజయం సాధించేవారం కాదన్నారు. తెలంగాణ ఏర్పడినా నదీ జలాల పంపిణీ నేటికీ పూర్తికాలేదన్నారు. #navatelangana  
 ·  Translate
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
అనుకోని అద్భుతం - ప్రపంచ కప్‌లో భారత బౌలర్ల హవా
పసలేని బౌలర్లతో టీమ్‌ ఇండియా వరల్డ్‌కప్‌ను నిలుపుకోవాలనుకోవటం జోక్‌. ఇది ప్రపంచ కప్‌ ఆరంభానికి ముందు తలపండిన విశ్లేషకుల మాట. భారత్‌ ముచ్చటగా మూడో టైటిల్‌ అందుకోవాలంటే అది బౌలర్లతోనే సాధ్యం ఇది ఇప్పటి మాట. నెల రోజుల్లో ఎంత మార్పు. భారత్‌కు బలహీనత అనుకున్న బౌలర్లే బలంగా మారారు. టోర్నీలో ఇప్పటి వరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థిని కుప్పకూల్చిన బౌలర్లు..వరల్డ్‌ రికార్డును సైతం ఖాతాలో వేసుకున్నారు. మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో 70 వికెట్లు నేలకూల్చిన షమి, ఉమేశ్‌, అశ్విన్‌ త్రయాన్ని చూస్తే ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుడుతోంది!. ‪#‎india‬ ‪#‎worldcup2015‬ ‪#‎bowling‬ ‪#‎ntsports‬
http://www.navatelangana.com/article/sports/1669
 ·  Translate
ప్రపంచ కప్‌లో భారత బౌలర్ల హవా పసలేని బౌలర్లతో టీమ్‌ ఇండియా వరల్డ్‌కప్‌ను నిలుపుకోవాలనుకోవటం జోక్‌. ఇది ప్రపంచ కప్‌ ఆరంభానికి ముందు తలపండిన విశ్లేషకుల మాట.
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
పొరోషెంకో విధానాలపై ఉక్రేనియన్ల అసంతృప్తి
- తాజా అధ్యయనంలో వెల్లడి
ఉక్రేనియాలో ప్రజలు తమ రాజకీయ నేతల విధానాలపై తీవ్ర అసంతృప్తితో వున్నారని ఆ దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది.
అధ్యక్షుడు పొరొషెంకో నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు, చర్యలపై మూడింట రెండొంతుల మంది అసంతృప్తి వ్యక్తం చేయగా కేవలం 8 శాతం మంది మాత్రం ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరొషెంకో సర్కారును ఈ అధ్యయన ఫలితాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కీవ్‌కు చెందిన రిసెర్చ్‌ అండ్‌ బ్రాండింగ్‌ గ్రూపు ఒకటి ఈ నెల 6నుండి 16 వరకూ నిర్వహించిన ఈ అధ్యయనంలో పొరొషెంకో ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయిన వైనం కళ్లకు కడుతోంది.......‪ #Ukraine #Parashenko #navatelangana  
 ·  Translate
తాజా అధ్యయనంలో వెల్లడి ఉకీవ్‌:ఉక్రేనియాలో ప్రజలు తమ రాజకీయ నేతల విధానాలపై తీవ్ర అసంతృప్తితో వున్నారని ఆ దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల నిర్వహించిన ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
సమకాలీనం - ఎస్ . వీరయ్య
వర్తమాన రాజకీయాల తీరు తెన్నుల పై సాదికారికమైన విశ్లేషణల సమాహారం . పాటకుల అవగాహనకు ఉపయుక్తం
---------------------------------------------------------------
కేంద్రం పాపాలకు రాష్ట్రం మూల్యం
కేంద్రంతో సానుకూల సంబంధాలు నెరపటం ద్వారానే రాష్ట్రానికి నిధులు వస్తాయని ఎదురు చూసిన ప్రభుత్వానికి కేంద్రం మొండి చేయి చూపింది. కేంద్రానికి అఖిలపక్షం వెళ్ళక తప్పని స్థితి కేంద్రమే సృష్టించింది. ఎపి పునర్వ్య వస్థీకరణ చట్టానికి సమగ్రమైన సవరణలు చేయటంలో కేంద్రం విఫలమైంది. గత పది మాసాలుగా రగులుతున్న నీటి వివాదం, కరెంటు సమస్య, హైకోర్టు విభజన ఆందోళనలు కూడా పరిష్కరించటంలో వైఫల్యమే ప్రదర్శించింది. కేంద్రం నిర్లక్ష్యం దుష్ఫలితాలకు రాష్ట్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. కేంద్రం సృష్టించిన ఈ మంటల్లో గిరిజనుల జీవితాలు మాడుతున్నాయి. మరోవైపు దళితులు, గిరిజనులకు వాగ్దానం చేసిన భూపంపకం, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఎప్పుడవుతాయో తెలియదు. ప్రభుత్వం మాత్రం వనరుల సేకరణకు ప్రజల మీద భారాలు మోపడమే మార్గంగా భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.
పూర్తి వ్యాసం కొరకు http://www.navatelangana.com/article/net-vyaasam/1652 ను చుడండి ‪#‎samakaaleenam‬ ‪#‎veeraiah‬ ‪#‎navatelangana‬
 ·  Translate
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
పేదల బతుకుల్లో... చిచ్చురేపుతున్న 'భృతి
అందరికీ అందని రూ.వెయ్యి
- బీడీ కార్మికుల ఆగ్రహం
రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల జీవనభృతి కల్పిస్తామన్న ప్రభుత్వ కొర్రీలు కొన్ని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. జీవనభృతికి ఇతర పింఛన్లతో ముడిపెట్టడంతో ఈ పరిస్థితి దాపురించింది. బీడీల్లా కాలిపోతున్న కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో జీవనభృతి పథకాన్ని ప్రారంభించింది. అయితే ప్రభుత్వ నిబంధనలు అప్పటికే పింఛన్‌ పొందుతున్న వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వృద్ధాప్య పింఛన్‌ పొందుతున్న ఓ తల్లి తన ఇద్దరు కొడుకులతో ఒక్కో నెల చొప్పున ఉంటుంది. అయితే అధికారుల సర్వేలో మాత్రం ఏ కొడుకుతో అయితే ఆ తల్లి ఉందో ఆ కుటుంబానికి జీవనభృతి నిలిపివేశారు. దీంతో ఆ తల్లి తన ఇంటికొస్తే ఎలాంటి సమస్య వస్తోందోనని రెండో కొడుకు తల్లిని దూరంగా ఉంచాడు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. ‪#‎BeediWorkers‬ ‪#‎pensions‬ ‪#‎kcr‬ ‪#‎telangana‬
 ·  Translate
అందరికీ అందని రూ.వెయ్యి - బీడీ కార్మికుల ఆగ్రహం రాష్ట్రంలో బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల జీవనభృతి కల్పిస్తామన్న ప్రభుత్వ కొర్రీలు కొన్ని కుటుంబాల్లో ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు విచ్చేసినపుడు ఆయనను సైనిక మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన సైనిక దళానికి నాయకత్వం వహిస్తూ కవాతు చేసిన మొట్టమొదటి మహిళా అధికారి పూజాఠాకూర్‌. అప్పటి నుండి రక్షణదళాలలో మహిళలకున్న స్థానం గురించి, వారిపాత్ర గురించి చర్చ ప్రారంభమయింది. ఈ సంఘటన భారతీయ చరిత్రలో రక్షణ దళాలలో దాగున్న చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. #navtelangana #maanavi  
 ·  Translate
బరాక్‌ ఒబామా మన దేశ పర్యటనకు విచ్చేసినపుడు ఆయనను సైనిక మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన సైనిక దళానికి నాయకత్వం వహిస్తూ కవాతు చేసిన ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
ప్రభుత్వానికి కరెంట్‌ షాక్‌...
9,246 వేల ఎకరాలకు రూ. 108 కోట్లు..
- ఎకరానికి రూ. లక్ష 16 వేల కరెంటు బిల్లు
- నివ్వెర పోయిన రైతులు
భూమికి సాగునీరందిస్తే భూమి కొన్నంత ఖర్చవుతుందా..? ఇది అతిశయోక్తికాదు. వివరాలు తెలుసుకోవాలంటే దేవాదుల ప్రాజెక్టు పనితీరు గురించి తెలుసుకోవలసిందే. ‪#‎navatelangana‬
 ·  Translate
9246 వేల ఎకరాలకు రూ. 108 కోట్లు.. - ఎకరానికి రూ. లక్ష 16 వేల కరెంటు బిల్లు - నివ్వెర పోయిన రైతులు - దేవాదుల కథ...1 కొండూరి రమేష్‌బాబు భూమికి సాగునీరందిస్తే భూమి కొన్నంత ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
- ముఖ్యమంత్రి కెసిఆర్‌
- రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు
 - విద్యుత్తు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ
- పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతలకు త్వరలో శంఖుస్థాపన #ugadi #kcr #navatelangana  
 ·  Translate
ముఖ్యమంత్రి కెసిఆర్‌ - రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు - విద్యుత్తు కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ - పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతలకు త్వరలో శంఖుస్థాపన ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
నయా ట్రెండ్‌లో తొలిసారి మాళయాళ నాట ఓ సంచలన విజయం నమోదు చేసుకుంది.'దృశ్యం'...లోబడ్జెట్‌ మూవీగా 175 రోజులు ప్రదర్శితమై 50 కోట్లు కలెక్ట్‌ చేసి మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసి ఆశ్చర్యపర్చింది.. ఆలోచింపజేసింది. ఎందుకీ చిత్రం అంత ఘనవిజయాన్ని సాధించింది?, ప్రేక్షకులెందుకు బ్రహ్మరథం పట్టారు.. ఇంతకీ ఆ చిత్రంలో ఏముంది?.. పూర్తి వ్యాసం కొరకు http://www.navatelangana.com/article/nava-chitram/1647 ను చుడండి
. ‪ #navatelangana #navachitram #drushyam  
 ·  Translate
నయా ట్రెండ్‌లో తొలిసారి మాళయాళ నాట ఓ సంచలన విజయం నమోదు చేసుకుంది.'దృశ్యం'...లోబడ్జెట్‌ మూవీగా 175 రోజులు ప్రదర్శితమై 50 కోట్లు కలెక్ట్‌ చేసి మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
మన ఉగాది రోజు మార్టిన్‌ గుప్తిల్‌ పరుగుల పండగ చేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన ఆఖరి క్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డ గుప్తిల్‌(237;163 బంతులు; 24 ఫోర్లు, 11 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీ సాధించి ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో డబుల్‌ సెంచరీ నమోదు చేసిన ఏకైక కివీస్‌ ఆటగాడిగా గుప్తిల్‌ చరిత్రకెక్కాడు. ఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్‌ ఎలా ఆడుతున్నదానిపై సెమీస్‌లో దక్షిణాఫ్రికా ప్రత్యర్థి ఎవరో తేలనుంది  #guptill #doublecentury #worldcup2015 #ntsports  
 ·  Translate
మన ఉగాది రోజు మార్టిన్‌ గుప్తిల్‌ పరుగుల పండగ చేసుకున్నాడు. విండీస్‌తో జరిగిన ఆఖరి క్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్స్‌లతో ...
1
Add a comment...

Nava Telangana

Shared publicly  - 
 
చిత్తాబొత్తా - తెలి దేవర భానుమూర్తి
తెలంగాణ మాండలికంలో రాజకీయాల అప్రజాస్వామిక పోకడల పై సందించిన వ్యంగాస్త్రం
---------------------------------------------------------------------------
గీ యాడాదిల :
గా దినం ఉగాది. ఇండ్లకు మామిడాకులు తోర్నాలు గట్టిండ్రు. బెల్లం; మామిడికాయ పచ్చలు; యాప్పువ్వుతోని ఉగాది పచ్చడి జేసిండ్రు. బచ్చాలు దిన్నరు. పొద్దు మీకినంక అయ్యగార్లు గాచారం జెప్పిండ్రు. లీడర్లు గూడ గాచారం జెప్పిచ్చుకున్నరు. గీయాడాదిల ఎండకాలం ఎండలెక్వ ఉంటయి. నీల్లకు తిప్పలైతది. కరెంటు కోతలుంటయి. కందిలి ముట్టించ్చుకోని కెసిఆర్‌ ఫైల్లు జూస్తడు. తెలంగానల ఎవ్వరు పచ్చంగిలు దొడ్గద్దని కెటిఆర్‌ అంటడు....
పూర్తి వ్యాసం కొరకు http://www.navatelangana.com/article/net-vyaasam/1650 ను చుడండి , ‪#‎ChitthaBottha‬ ‪#‎TBhanumurthy‬ ‪#‎navtelangana‬
 ·  Translate
1
Add a comment...
Story
Tagline
News Paper
Introduction
తెలంగాణ జర్నలిజంలో ఓ సరికొత్త అధ్యాయానికి నాంది వాక్యం' నవ తెలంగాణ'.
   సమాచారం ఒక ఉద్యమం ప్రజల చేతి ఆయుధం . వాస్తవాల్ని చెప్పడమే కాదు
   వాస్తవాల ఆవలి నేపధ్యాల్ని విశ్లేషిస్తూ కొత్త చైతన్యాన్ని అందించడం ఇవాళ్టి జర్నలిజం
   అవసరం .
website : www.navatelangana.com
twitter: http://twitter.com/nava_telangana
Contact Information
Contact info
Phone
040 - 27665420, 040 - 27673787
Mobile
94900990077
Email
Address
యం.హెచ్. భవన్ ప్లాట్ నేం 21/1. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా . ఆర్ టి సి కళ్యాణ మండపం దగ్గర హైదరాబాద్ - 500 020