Profile

Cover photo
Kbs Sarma
Worked at NABARD
Lives in Hyderabad
137 followers|16,949 views
AboutPostsPhotosVideos+1's

Stream

Kbs Sarma

Shared publicly  - 
 
 
ఈనాడు తెలుగు-వెలుగు లో 'తెలుగురధం' ప్రత్యేక కథనం - ఆదివారం 19, ఉదయం 11.30ని. ప్రసారం.

ఈనాడు - తెలుగు వెలుగు - ఆదివారం 19 జూలై, ఉదయం 11.30 ని.కు ప్రసారమయ్యే వారం కార్యక్రమంలో - తెలుగురధం - సంస్థ ప్రస్థానం - భాషా,సాహిత్యాలపై సంస్థ అందిస్తున్న సేవలు' పై ప్రత్యేక కథనం - ముఖాముఖీ - తెలుగురధం సభ్యులు, మా నిత్య ప్రేక్షకులు, మిత్రులు, హితైభిలాషులు, సహా భాగస్వామ్యం వహిస్తున్న సంస్థల ప్రతినిథులు - పై కార్యక్రమం వీక్షించి, మాకు తగు సలహాలను అందించి, సూచనలను యివ్వాలని కోరిక. కొంపెల్ల శర్మ, తెలుగురధం.
 ·  Translate
1
Add a comment...

Kbs Sarma

Shared publicly  - 
 
'మీదుమిక్కిలి' పరిపూర్ణుడు, 'నటరత్నాలు' సృష్టికర్త, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు, కళాప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి 'శతజయంతి' ప్రారంభ సభ - తెలుగురధం నిర్వహణలో - 7 జూలై 2015,  మంగళవారం, కళా సుబ్బారావు కళావేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.
కళాప్రియులందరికీ తెలుగురధం ఆహ్వానం అందిస్తోంది.
కొంపెల్ల శర్మ, తెలుగురథం. (9701731333) 
 ·  Translate
1
Suram Krishnamurthy's profile photo
 
Sharma garu, meeru chala manchi pani chestunnaru. ..oka telugu Vadiga nenu mimmalni abhinandistunnanu. .....subhakankshalato. ....suram krishnamurthy bangalore 
Add a comment...

Kbs Sarma

Shared publicly  - 
 
అపహాస్యం పాలైన 'హాస్య'మేథ యాగం

అన్నీ ఉన్నాయి! అల్లుడి నోట్లో శని; అన్న మాదిరి, అన్నీ సవ్యమే; ప్రతిఫలం మాత్రం అపసవ్యంగా, అసమంజసంగా, హాస్యం పేరిట సమగ్ర పరిపూర్ణ అపహాస్యపు యాగంగా మారడం పట్ల - ఎంతో ఆశలు పెట్టుకుని, మండు వేసవిలో, గాలి కించిత్తు కూడా దరికి రాని సమశీతల ఉక్కపోత కళా వేదిక నిండిపోయి, అదనపు కుర్చీలు వేసి మరీ కూర్చేపెట్టేరు పాపం నిర్వాహకులు. వారి ఆదుర్దా వారిది, అర్థంచేసుకోవాల్సిన ఆందోళన వారిది.

అసలు హాస్యవల్లరి సభకు 'హాస్య మేథ యాగం' అన్న పేరు ఎందుకు పెట్టారో, వేదికపై ఉన్న అతిథులకే అర్థంకాక, తికమక పడిపోయిన వైనం మరో కొత్త కోణం. పూర్వపు హాస్యసింహాల హాస్యాన్నీ సక్రమంగా వివరించకపోవడం, వారి అపురూప మేథస్సుల్ని విశ్లేషించక పోవడం, వీరి ప్రతిభను వినియోగించుకోవడంలో కూడా విపరీతంగా అపజయాన్ని ఆహ్వానించడమే కాక, అపహాస్యం పాలయ్యారు.
 
అవధానం శైలిలో చేయాలన్న ఆశయంతో వేదికలెక్కిన అతిథులు - ఒకరో, ఇద్దరో మినహాయిస్తే, హాస్యయాగావధానంలో ప్రముఖ భాగం/పాత్ర తీసుకున్న వారి పాత్ర మాత్రం 'అపాత్రత'కే నోచుకొంది. లెక్కలేని పునరుక్తులు, చెప్పిన విషయాలనే తిరిగి తిరిగి తిప్పి తిప్పి చెప్పడం, ఒకరినొకరు మాటలతో, దాటవేతలతో రణరంగం మాదిరి ప్రవర్తనలు, స్త్రీ పురుషులు వేదికపైనా, వేదికముందు ప్రేక్షక పాత్రలోనూ, వయోధర్మాన్ని కూడా పాటించకుండా, యుక్తవయసు ప్రేక్షకులున్నారన్న కనీసపు ధ్యాస కూడా లేకుండా - హాస్యం పేరు చెప్పి, అసభ్యరహితంగా వివరించలేని శృంగారపు అంశాలు, దంపతులు, భార్యాభర్తల సంబంధాలపై కూడా అల్లిన నివారించదగ్గ సంబంధంలేని సంబంధాలని కలిగించి, ప్రశ్నలు సంధించడం, వాటికి సమాధానపరుస్తూ, వాస్తవానికి సమాధానపరచుకోలేని అతిథుల వేదికగా మారుతూ కొనసాగిన కార్యక్రమం - అత్యధిక శాతం ప్రేక్షకుల్ని నిరాశ, నిస్పృహలతో నింపివేసిన సాయం సంధ్య, అసలే వేసవి కాలంలో, హాస్యయాగం ఏ సమిధలు, హవిస్సు, లేకుండానే ప్రజ్వరిల్లింది అని నిర్ద్వందంగా చెప్పితీరాలి.

ప్రతీనిత్యం ఏవేవో సాహిత్య, సాంస్కృతిక, కళా, సంగీత సభలలో పాల్గొనే నిత్య సత్య ప్రేమికులకి, ఆసక్తిపరులకీ మాత్రం - మూస అతిథులే, అవే హాస్యపు ధోరణులే, అవే భాష్యాలే, అవే భావాలే, అవే విరుపులే, ప్రేక్షకులకు అవే విసుగులే.

ఈ దుస్థితి చూస్తే, మన ప్రాచీన కావ్య, ప్రబంధ, పురాణ, ఐతిహాసిక, ఉపనిషత్తు సాహిత్య సంపద లోని నవరస భరిత, సాలంకారిక, అర్థవంత, పరమార్థ, సార్ధకవంతపు సాహితీ సొగసుల్ని, సొబగుల్ని - వాటిలోని చమత్కృతుల్ని, చెణకుల్ని - నేటి ఆధునిక పండితులు, సాహితీకారులు, అధ్యాపకులు, గురువులు, శిక్షకులు, సాహితీవృత్తికారులు, వృత్తి ఏదైనా తమదైన ప్రవృత్తిని స్వంతం చేసుకుని - వారి వారి శైలిలో వక్రభాష్యం, దుష్ట వ్యాఖ్యానాల్ని రచించుకుని, వీలైనన్ని వేదికలపై, అత్యధిక పర్యాయాలు వీటిని జారవిడవడమే వీరి ముఖ్య, ప్రముఖ ఆశ, ఆశయం, ఆకాంక్ష. యిదీ ఒకరకపు జారదనమే కదా!

ఏది ఏమైనా 'హాస్యం', హాస్య సంబంధిత సభలు, కార్యక్రమాలు, సదస్సులు - నూటికి నూరుపాళ్ళు, పదహారణాల తెలుగుదనపు హాస్య సంపదని నేటి హాస్యకారులు అపహాస్యం చేయడమే కాక, హాస్యం ఆరోగ్యకరం అని దొంగ ప్రచారం చేస్తూ, లక్ష్య లక్షణాల్ని లెక్కచేయకుండా, ఒక రోగానికి మరొక వైద్య మూలిక గా, ఒక రోగి రోగానికి అవసరమైన మందు మరొక రోగపు రోగికి అందజేసే అభినవ కుహనా భిషక్కులు - నేటి హాస్యభిషక్కులు, చమత్కార వైద్యులు, పనికిరాని పెరడువైద్యం గా మారిపోయింది.

దయచేసి, హాస్యం పేరుచెప్పి, అపహాస్యం, విదూషక ప్రేలాపనలు, వెకిలిదనపు వెక్కిరింతల భాష్యాలను విడుదల చేయవద్దని మనవి చేస్తూ, చేతులెత్తి మొక్కుతున్నాం, మహాప్రభో!

ఉపశ్రుతి:

దీక్ష, సత్సంకల్పం, మొక్కవోని పట్టుదల, క్రమశిక్షణ, సామాజిక సేవ - యిత్యాది సల్లక్షణాల్ని, సద్గుణాల్ని పుణికిపుచ్చుకున్న స్వచ్చంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతం కావడం కేవలం ఆయా సంస్థల నైపుణ్యపు నిర్వహణ, సమన్వయం వల్ల కాకపోవచ్చు. ఎన్నుకున్న వస్తువు, దానిలోని వైవిధ్యం, కార్యక్రమ ప్రణాళిక, ఆ ప్రకారంగానే ఆచరణ, నిర్వహణ - ముఖ్యంగా కార్యక్రమంలో నిష్ణాతులుగా పాల్గొనే అతిథులతోపాటు ఉత్తమాభిరుచిగల ప్రేక్షకులు, అటువంటి ప్రేక్షకుల్ని నియమ నిష్ఠగా వీక్షించనిచ్చే దయ దాక్షిణ్యం కలుగజేసే అటూ యిటూ పనీ పాటు లేని పచార్లు, నేటి దుస్థితిని అందిస్తున్న చరవాణి సొదలతో, రొదలతో పక్కవారిని యిబ్బంది పెడుతూ, కాలక్షేప సంచార జాతి సంబంధ యితర ప్రేక్షకులు, వేదిక యాజమాన్యపు శ్రద్దాసక్త భక్తులపై ప్రముఖంగా ఆధార పడతాయి.
అయితే, ఈ రోజుల్లో - ప్రముఖంగా ఎవరికి వారు చేసుకునేవి, డబ్బులిచ్చి, వారి వారి దుశ్శాలువాల్ని వారే తెచ్చుకుని, సంస్థల నీడల్లో నిత్య సన్మాన, సత్కార, జీవిత సాఫల్య పురస్కారాల పుంఖానుపుంఖాలుగా కొనసాగుతున్న కోకొల్లల సభలు, లేదా చిత్రగీతాల పేరిట గాయనీ గాయకులు అదే మూసలో అదే రాగంలో నిత్యం గానంచేసే గాయనీ గాయక బృందాలు, సంస్థలకు పాడే పాటకో రుసుమును చెల్లించి, వారి గొంతులో ఉన్న పాటని వేదికపైకి కక్కివేసి, పారిపోయేజాతులే అత్యదికాలు, నేటి దుస్థితిలో భాగాలు.
యింక కవిసమ్మేళనాలు - త్రివేణీ పాపపు సంగమాలు; అంశం యిచ్చి కొత్త కవితతో సంస్థలు ఆహ్వానించినా, కవులు తమదైన ధైర్యంతో అదే పాతకవితని ముడతలతో మడిచి వేదికపైకి వచ్చేకే ఆ చిదంబర రహస్యాన్ని విప్పిచెప్పి, ఆ కవులు/కవయిత్రులు అదే పాత రోత కవితల్ని కక్కేసి తమ సాహిత్యపు దుమ్ముని దులిపేసుకుని, సహా కవుల కవితలను గౌరవంతో వినాలన్న ఇంగితపు ప్రపంచ పరిజ్ఞానం కూడా లేకుండా, భుజాన ఓ శాలువా, ఎంతమాత్రం జ్ఞాపకాల్ని అందించలేని జ్ఞాపికతో వేదికా నిష్క్రమణలో ధన్యత్వం పొందడం కూడా పదేపదే పరిపాటి అయిపోయిన మరో దుష్ట సంప్రదాయంలో కొనసాగుతున్న వైనం.
సాహిత్య,సాంస్కృతిక సభల నేటి తీరు తెన్నులు - ఓరీ! తులువా! పద్ధతులు మార్చు! అన్న వాక్యాన్ని పదబంధ ప్రహేళికలో అలనాడు శ్రీశ్రీ ఏ స్వయంగా సమకూర్చడం, దానికి సమాధానంగా "రీతులు' అని ప్రకటించడం పట్ల - నేటి సాహిత్య,సాంస్కృతిక సభా నిర్వహణల తీరుతెన్నులు, నిర్వహించే స్వచ్చంద ప్రభుత్వేతర సంస్థలు, సభలలో భాగస్వామ్యం వహించే అతిథులు - సక్రమదృష్టి పెట్టి, ఆలోచనలే, ఆచరణలుగా ఈ రెంటి మధ్య తేడాలేని తరహాలలో - సభలని విజయవంతంగా, అర్థంతో పనిలేని అర్థవంతపు సభల్ని జరిగేలా వారి వారి పాత్రల్ని నిర్వహించాల్సిందిగా కోరుకోవడం వినా - ఒక సంస్థ నిర్వాహకునిగా ఏమీ చేయలేని స్థితి, అస్థితి, దుస్థితి, పరిస్థితి. వీటి బారినుంచి బయటపదాం. మన నిజ తెలుగు సంస్కృతికి, సంస్కారానికి, సత్య,సత్వర నీరజనాల్ని సమర్పించుకుందాం.

ఎవరినీ ఉద్దేశ్యపూర్వకంగా, విమర్శ చేయడం లేదని, సాహిత్య, సాంస్కృతిక రంగంలో పాతుకుపోయిన దుస్థితికి రేఖామాత్రంగా, చాయామాత్రంగా విన్నవించుకోవడమే, మనసులోని ఆందోళనని, ఆవేదనని ఈ రూపేనా వివరించడమే అని గ్రహించమని ప్రార్థన, విన్నపం.

క్షమాపణలతో- అందరికీ నమస్కారాలు. సెలవు. కొంపెల్ల శర్మ, తెలుగురధం.
 ·  Translate
2
Add a comment...

Kbs Sarma

Shared publicly  - 
 
తెలుగురధం - సాహిత్య,సాంస్కృతిక,సామాజిక వికాస సంస్థ నిర్వహణలో

శాస్త్రీయ లలిత సంగీత లహరి”

గాయని: శ్రీమతి రేమేళ్ల (తాడేపల్లి) ఉదయలక్ష్మి గారు

కళా సుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, హైదరాబాద్.

2-6-2015, మంగళవారం, సా.6.30 గం.

సాహిత్య, సాంస్కృతిక, కళాభిమానులందరికీ ఆహ్వానం

(కొంపెల్ల శర్మ, అధ్యక్షులు,తెలుగురధం. +919701731333 
 ·  Translate
1
Add a comment...

Kbs Sarma

commented on a video on YouTube.
Shared publicly  - 
 
A VERY MUCH VISUAL FEAST TO THE ART LOVERS, ESPECIALLY CLASSIC MUSIC AND DANCE LOVERS.  SATYAJIT RAY SHOULD HAVE TAKEN A FEATURE FILM ON THE LIFE & ART JOURNEY ON SMT.T.BALA SARASWATHI. Kompella Sarma.
1
Add a comment...
Have him in circles
137 people
Nagabhushanam Gummagatta's profile photo
Phani Kumar's profile photo
baba kishore mutta's profile photo
Satya Reddy's profile photo
anandamohan voruganti's profile photo
rama krishna's profile photo
Sailesh Nimmagadda's profile photo
Ramadas Tadepally's profile photo
Lalitha Kishore's profile photo

Kbs Sarma

Shared publicly  - 
 
మహానది 'గోదావరి' మహా పుష్కరాలు - పది రోజుల్లో ప్రారంభం - పవిత్ర సంఘటన - మరపురాని, మరువలేని మహా ఘటనలు - విధుల్ని విధిగా నెరవేర్చాల్సిన విధులు - పితృ తర్పణాలు
 ·  Translate
1
Add a comment...

Kbs Sarma

Shared publicly  - 
 
భారతీయ సాహిత్యంలో విశ్వకవి 'రవీంద్రనాథ్ టాగోర్' గీతాంజలి కి లభించిన నోబెల్ పురస్కారం తర్వాత, 'గాలివాన' తెలుగు కథానికకు  అంతర్జాతీయ కథానిక పోటీల్లో ద్వితీయ పురస్కారం(1952) పొందిన ప్రముఖ కథకులు పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతి సంవత్సరం 24 జూన్ 2015 తో ముగుస్తోంది. బహుశ, పలు సాహితీపరులకు, సాహితీ వ్యక్తులకూ తెలియని, పట్టించుకోని విషయం అవడం చాలా నిరాశాజనకం. ఈ శతజయంతి సంవత్సరం ఈ నెల 24తో ముగుస్తోంది. ఈ సందర్భంగా - తెలుగురధం & శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ సంయుక్త నిర్వహణలో - బుధవారం శ్రీ త్యాగరాయ గానసభ లో 'పాలగుమ్మి పద్మరాజు' శతజయంతి సమాపన సభ జరుగుతోంది.
ప్రముఖ చలనచిత్ర దర్శక నిర్మాత, దర్శకరత్న డా.దాసరి నారాయణ రావు గారు మరియు పూర్వ సిక్కం గవర్నర్ వి.రామారావు గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేస్టారు.
ఈ సందర్భంగా - పాలగుమ్మి వారి శతజయంతి ప్రత్యెక సంచిక, మరియు పాలగుమ్మి వారి సాహిత్యంతో 'గోదావరి' సన్నిహిత నేపథ్యం పై గ్రంథం ఆవిష్కరణ జరుగుతుంది.
గాలివాన కన్నా చాలా ముందుగానే రాసిన మరో ప్రముఖ కథానిక 'పడవప్రయాణం' ఆధారంగా నిర్మితమైన 'స్త్రీ' చలనచిత్రం ప్రదర్శన జరుగుంది.
పలు సాహితీవేత్తలు, చిత్రపరిశ్రమలో పద్మరాజు గారితో పరిచయపరులు సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సాహితీపరులు పాలగుమ్మి పద్మరాజు శతజయంతి సభలో భాగస్వామ్యం వహించమని, తెలుగురధం కోరుతోంది.
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురధం. (9701731333)
 ·  Translate
2
Add a comment...

Kbs Sarma

Shared publicly  - 
 
ప్రముఖ కవి, పండితులు, విమర్శకులు, ఆధునిక మహాభారతం సృష్టికర్త, గుంటూరు శేషేంద్ర శర్మ గారి వర్థంతి సందర్భంగా సాహితీ ప్రియులందరికీ ఆహ్వానం పలుకుతోంది - తెలుగురధం. కొంపెల్ల శర్మ.
 ·  Translate
 
రేపు సాయంత్రమే ...త్యాగరాయ గాన సభలో.
+Saatyaki S/o Seshendra Sharma  సాదర అహ్వానం.
 ·  Translate
View original post
1
Add a comment...
People
Have him in circles
137 people
Nagabhushanam Gummagatta's profile photo
Phani Kumar's profile photo
baba kishore mutta's profile photo
Satya Reddy's profile photo
anandamohan voruganti's profile photo
rama krishna's profile photo
Sailesh Nimmagadda's profile photo
Ramadas Tadepally's profile photo
Lalitha Kishore's profile photo
Places
Map of the places this user has livedMap of the places this user has livedMap of the places this user has lived
Currently
Hyderabad
Work
Employment
  • NABARD
    AGM, 1982 - 2012
Basic Information
Gender
Male
Kbs Sarma's +1's are the things they like, agree with, or want to recommend.
MEMBERS e-mail addresses
nabretire.blogspot.com

NABRETIRE Available e-mail addresses of members NABARD AP RO - e-mails of Retired Employees as on 10 Sept 2013. 1949satyam@gmail.com, a_ravi