Profile cover photo
Profile photo
Astrology Predictions
759 followers -
Astrology
Astrology

759 followers
About
Astrology's posts

Post has attachment

Post has attachment
Weekly Rasi Phalalu 2017 July 02 nd To July 08 th 2017

Post has attachment
సరస్వతీ దేవి - యంత్రం

మేథా శక్తికి బుద్ధి కుశలతకు పరీక్ష జయమునకు పిల్లలు, పెద్దలు పూజించే అమ్మవారు సరస్వతీ దేవి. సరస్వతీ దేవి తెల్లని వస్త్రాలు సాత్వికతను సూచిస్తాయి. విద్యాభ్యాసం చక్కగా సాగాలంటే ఆహారంలో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలో సాత్వికత ఉండాలి. సత్వగుణమే ప్రధానమని సూచిస్తున్నది అమ్మ వస్త్రధారణ. సరస్వతీ దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం నశించనిది. ఎప్పటికీ నిలిచే ఉంటుంది. జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతీ దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది.

చదువు రావాలి, జ్ఞానం పొందాలంటే నేర్చుకున్న విషయాన్ని పలుమార్లు మననం చేసుకోవాలి. మనసులో ధారణ చేసుకోవాలి. అప్పుడే మనకు సారం అర్ధమవుతుంది. సరస్వతీ దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. మిగతా దేవీదేవతలందరూ పువ్వుల్లో కూర్చుంటే చదువుల తల్లి సరస్వతీ దేవి మాత్రం రాయి మీద కూర్చోని ఉంటుంది. ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది. కాని రాయి మాత్రం పదిలంగా నిలిచి ఉంటుంది. ఈ లోకంలో విద్య, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనవి, సంపదలు కొంతకాలం మాత్రమే ఉంటాయి అని చదువులమ్మ సందేశం ఇస్తూ ఎప్పటికీ తరిగిపోని విద్యనే అనుగ్రహిస్తానంటోంది.
సరస్వతీ దేవి - యంత్రం
మేరుతంత్ర గ్రంధమును అనుసరించి 7 విధములైన సరస్వతీ యంత్రములు ఉన్నాయి. ౧. చింతమణి సరస్వతీ, ౨. జ్ఞాన సరస్వతీ, ౩. నీల సరస్వతీ, ౪. ఘట సరస్వతీ, ౫. సరస్వతీ, ౬. అంతరిక్ష సరస్వతీ, ౭.మహా సరస్వతీ .. అను రూపములను పొంది ఉన్నది.

మూల మంత్రం: ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్య్తే స్వాహా

ఈ యంత్ర ప్రయోజనముల విషయానికి వస్తే.. మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము సాధించగలరు. శ్రీమహసరస్వతీ యంత్రంను అర్చించు వారు యంత్రమును రాగి రేకుపై గాని కాగితముపై గాని రాసి పటం కట్టించి యథా శక్తిగా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేస్తే.. మేథా శక్తి బుద్ధి కుశలత, పరీక్షలయందు విజయము కలుగును.

శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య, ప్రాణామాయ, గోత్ర దేశ కాల మాన సంకీర్తణాధికముగా త్రిన్యాస పూర్వకముగా , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును. మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్ గాయిత్రిని కూడా జపదశాంశము గావించిన మహోత్కృష్ట ఫలితములు తప్పక కలుగును.
ధ్యానము, మూల మంత్రము, ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి మంత్ర యంత్రములు పని సాధనలందు అనంత ఫల సాధకములగును.
పై యంత్రం కావలసివారు సంప్రదించు నెంబరు 9866193557
Photo

Post has attachment
సమస్యలు పరిష్కార మంత్రములు - remedies mantra

ఉదయం లేవగానే కర చివరలు చూస్తూ పటించు స్తోత్రం:-
కరాగ్రే వసతే లక్ష్మి – కరమధ్యే సరస్వతి
కరములేతు గోవిందః – ప్రభాతే కర దర్శనం!

నిద్రించుటకు ముందు పటించు స్తోత్రం:-
రామస్కందం హనూమంతం – వైనతేయ వ్రాకోదరం
శయనే యః సమరే నిత్యం – దుస్వప్నస్తన్యనశ్యతి!

విద్యార్ధులకు మంద భుద్ధి తగ్గి చదివినది గుర్తు ఉండుటకు:-
ఓం హ్యీం శ్రీం ఐ వద్వద వాగ్వాదినీ
సరస్వతీ తుష్టి పుష్టి తుభ్యం నమః

ధనం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుటకు:-
ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ భగవతి మమ సంరుద్ధౌ జ్వల జ్వల మా సర్వ సంపదం దేహిదేహి మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ!

ధనసంపదనిచ్చే మంత్రం
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

ధన లాభము పొందుటకు:-
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ, ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా!

ఆపదతొలగించుకొనుటకు:-
ఆపదపమహార్తారం దాతారం సర్వసంపదాం
లోకాబిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం.

సకల విద్యలు పొందడానికి:-
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్పటికాక్రుతిం
ఆధారం సర్వవిధ్యానం హయగ్రీవ ముపాస్మహే

రోగములు తగ్గుటకు:-
ఓమ్ ఇత్థమ్ యదాయదా బాధాదన్వత్థ భవిశ్యేతి!

ఆడవారి [స్త్రీల] తో విరోధాలు ఏర్పడుతూవుంటే :-

ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామా రోగ్యమీ శతాం
యశః పుణ్యం సుఖం మోక్షయం దిరేష్టం ప్రయచ్ఛతుచిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన !
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి!!
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ !
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం!!
Photo

Post has attachment
దంపతుల మధ్య కలహాల నివారణకు..

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెంతో విశిష్టమైనవి. ప్రపంచ దేశాలకే ఆదర్శమైనవి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలు, పరిహారాలు ఉన్నాయి. ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖమయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి.

అలాంటి వాటిలో చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి ఒకటి. ఈ రోజు శివుణ్ని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని శాస్త్ర వచనం. అదేవిధంగా ఈ రోజు మన్మధుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుంది.

భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగత్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.

దంపతుల అన్యోన్యం - వాస్తు ప్రభావం
పంచభూతాల్లో భూమి ఒకటి. మానవుని జీవితానికి ఆధారమైన భూమిని వాస్తు ప్రకారం నైరుతి దిశతో పోల్చుతారు. ఈ దిశను నైరుతి లేదా కుబేర దిశగా పిలుస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు. నైరుతి దిశ వాస్తులో కీలకమని, ఈ దిశలో ప్రధాన ద్వారాలు, తలుపులు, కిటికీలు వంటివి ఏర్పాటు చేయకూడదని వాస్తు చెబుతోంది.

ఈ దిశను తెరిచి వుంచకూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ దిశ ఎప్పుడూ ఎత్తుగా ఉండాలని, ఈశాన్యం తగ్గితే మంచిది. కుబేర దిశలో తలుపులు ఉండకపోవడం ద్వారా ఇంటి యజమానికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు శాస్త్రం చెబుతోంది.

భార్య భర్తల మధ్య విరోధము తొలగిపోవుటకు
మూలమంత్రము:-" ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం (ఆముకం ) మే వశ్యం కురు కురు స్వాహా "
[మంత్రం గురుముఖతగా నేర్చుకోవాలి]
భార్య భర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుటింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం
వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త
తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువెళ్లిపోవును. సుఖంగా కలతలు లేకుండా కాపురం చేయుదురు. ఈ రహస్యం భర్తకు తెలియనియకూడదు.

కుజ దోషం
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు.. రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంట, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని. కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది

వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి. కావున భయపడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి, జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకము, విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.

కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు
· సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
· ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
· బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
· మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
· స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
· ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
· కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
· రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
· పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
· రక్త దానము చేయుట చాల మంచిది.
· అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
· కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
· రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
· కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
· కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
· ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
· కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
Photo

Post has attachment
క‌ల‌లు - ఫ‌లితాలు 2

స్వప్నం అనే పదం సంస్కృత శబ్దార్థం. స్వప్-స్వపితి-సుప్త-సుప్యతే అంటే క్రమపద్ధతిలో పడుకొనుట. ఈ అర్థానికి పరమార్థం స్వప్నించుటకు సిద్ధ‌మవటం అని. అంటే ఇది అతీంద్రియ శక్తి పొందడంతో సమానమన్నమాట. కాలానికీ, కలకు గల సంబంధాన్ని కలాకాష్ట సరస్వతీ అని అర్జునకృత దుర్గాస్తోత్రంలో వర్ణన ఉంది. కల అనేది భవిష్యత్‌ని దర్శించడానికి, సందేశాలు పంపడానికి ఒక మార్గం. కలల ఆధారంగా మనిషి భూత, భవిష్యత్, వర్తమానాల గురించి తెలుసుకోవచ్చు.

మ‌న పురాణాల్లో కల భవిష్యత్‌ను దర్శింపజేస్తుందనే వివరణలున్నాయి. స్కంధపురాణంలోని స్వప్నశాస్త్రంలో కలల ఫలితాలు, కలల కారణాల గురించి వివరణ ఉంది. ఒక ఆత్మ కలలో ఉన్నప్పుడు శరీరంతో పూర్తిగా సంబంధం తెగిపోయి స్వేచ్ఛాలోకంలో విహరిస్తుంది. ఏదైనా సమస్యతో బాధపడుతున్నవారు ఆ సమస్య గురించే ఆలోచిస్తూ దైవస్తుతిలో నిద్రకు ఉపక్రమించి కల ద్వారా దైవదర్శనం చేసుకుని సమస్యకు పరిష్కారం పొందుతారు. కల అనేది దైవాన్ని చేరుకోడానికి ఒక మార్గం.

భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి 90 నిముషాల నుండి 2 గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలలో జీవిస్తుంటారు. కొన్నిసార్లు, కలలు స్వాప్నికుని మనసులో ఉన్నవే సూటిగా ఉంటాయి. ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్లుగా, ఒక బీచ్ లో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా లేదా లాటరీలో జాక్పాట్ సంపాదించినట్లుగా కలలు వ‌స్తుంటాయి. కాని కలలు ఎప్పుడు కథలుగా ఏమి ఉండవు. వివిధ సంస్కృతులు, నేపథ్యాల నుంచి వ‌చ్చిన ప్రజలు కన్న కలలను నివేదించినప్పుడు ఆ పరిశోధన మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

కలలు వాటి విశేషాలు
కలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఒనేయిరాలజీ.
కలల వ్యవధి ఒకేలా ఉండదు. కొన్ని కలలు సెకన్ల వ్యవధిలో, కొన్ని 20, 30 నిమిషాల వరకు ఉంటుంది. ఎక్కువసేపు వచ్చిన కలలు గుర్తుండవు.
సగటు వ్యక్తి ఒక రాత్రి 3 నుంచి 5 కలల వరకు కంటాడు.
అంధులు కూడా కలగంటారు. అయితే ఆ కలల్లో దృశ్యాలుండవు, కేవలం శబ్దాలు మాత్రమే ఉంటాయి.
సృజనాత్మకత గల వారికి కలలు ఎక్కువగా వస్తాయి.
మనిషి స్వప్నస్థితిలో ఉన్నప్పుడు కనుగుడ్లు వేగంగా కదులుతాయి.
కలలు గుర్తుపెట్టుకుని తిరిగి చెప్పే శక్తి మగవారి కంటే ఆడవారికే ఎక్కువ.

ఫ‌లితాలు
గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చే కల మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ ఈ విధంగా కల రావడం వలన మరణ వార్త వినవలసి వస్తుంది. పాములు - తేళ్లు ఉన్నచోటుకి వెళుతున్నట్టుగా కలవస్తే, కోరి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ పాములను.. తేళ్ళను చంపినట్టుగా కల వస్తే.. త్వరలోనే శత్రువులు నశిస్తారని అర్థం చేసుకోవాలి.

సూర్యుడు సముద్రం నుంచి పైకి వస్తున్నట్లుగా.. అంటే సూర్యోదయం అవుతున్నట్లుగా కలగంటే అనుకున్న పనులు నెరవేరతాయి. శుభం క‌లుగుతుంది. సూర్యాస్తమయం కనిపించినట్లయితే కీడు, అపనిందలు, వ్యాపార నష్టం కలుగుతుంది. ఇంకా సూర్య కిరణాలు పక్క మీద పడుతున్నట్లు కలగంటే అనారోగ్యం. తమ గది మొత్తం సూర్యకాంతితో ప్రకాశిస్తున్నట్లు కలగంటే ధనలాభం, గౌరవం, సంతాన లాభం కలుగుతుంది. మీ పెళ్లికి సంబంధించిన కల వస్తే అశుభసూచకం. ఇతరుల వివాహం జరుగుతున్నట్టు కల వస్తే శుభసూచకమ‌ని చెప్పాలి.

క‌ల‌లో చేపలను చూస్తే.. ఇంట్లో శుభకార్యం జరుగును. మాంసం తింటున్నట్లు మీరు కలగంటే.. దెబ్బలు తగులుతాయి. మీ కలలో మీరు దెబ్బలు తింటున్నట్లు కనపడితే... మీరు పరీక్షలలో అనుత్తీర్ణులయ్యే సూచనలు. కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే... మీకున్న అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు తొలగిపోయనట్లేనని అర్థం.

మీరు కలలో పెళ్ళికూతురుతో ముద్దాడుతున్నట్లు కలవస్తే.. శత్రువులతో సంధికుదుర్చుకుంటారు. పామును పట్టుకోవడంలాంటి కల వస్తే.. మీరు భవిష్యత్తులో ఫలితాలను చేజిక్కించుకుంటారని అర్థం. పెద్దలు మిమ్ములను ఆశీర్వదిస్తున్నట్లు కలవస్తే.. గౌరవ ప్రతిష్టలు లభిస్తాయని అర్థం. మీ కలలో మీ మెడ నిటారుగా ఉంటే.. ధనప్రాప్తి కలుగుతుంది.

మీరు పాలు తాగుతున్నట్లు కలగంటే.. గౌరవ మర్యాదలు లభిస్తాయంటున్నారు. నీళ్ళు తాగుతున్నట్లు కలగంటే.. భాగ్యోదయం కలుగుతుంది. పందెంలో పరుగెత్తుతున్నట్టు కల వస్తే సంతోషకరమైన వార్త వినడానికి సూచన. ఎవరో తరుముతున్నట్లు కల వస్తే ఆపద రాబోతుందని నమ్మకం. కలలో గోధుమలు కనిపిస్తే లాభం కలుగుతుంది. సమాధి మీద ఉన్న అక్షరాలు చూసినట్లు, చదివినట్లు కల వస్తే వల్ల మంచి జ‌రుగుతుంది. గోళ్లు పొడవుగా పెరిగినట్టు కలలో కనిపిస్తే ధనలాభం, ఆనందం. పుస్తకం చదువుతున్నట్టు కల వస్తే వర్తక, వ్యాపారాలలో అభివృద్ధి, విజయం లభిస్తుంది. ఇక చ‌నిపోయిన‌ట్టు కల వస్తే శుభకార్యం జరుగును. 
Photo

Post has attachment

Post has attachment
కలలు - వాటి ఫ‌లితాలు

నిద్ర‌లో క‌లలు క‌న‌డం మాన‌వ స‌హ‌జం. కేవలం మ‌నుషులే మాత్రమే కాదు... ప్రతి పక్షి, ప్రతి జంతువూ, ప్రతి ప్రాణి కలలు గనడం అతిసాధార‌ణ‌మే. సింహ స్వప్నం అనే మాట ఆలా పుట్టినదే. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుంద‌ని అంటారు. జంతులు మాత్రమే కలలకు భయపడతాయా..? కాదు.. కలల పట్ల భయం అనేది మానవులకూ అనాదిగా ఉంది. అందుకు కారణం.. అన్ని కలలు శుభ ఫలితాలనే కలుగజేయవు.

పురాణాల్లోనూ క‌ల‌ల‌కు సంబంధించిన క‌థ‌లు ఉన్నాయి. రామాయ‌ణంలో.. సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒక రోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి, లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది.

కలల ఫ‌లితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి క‌ల‌ల గురించి చెప్పటమేకాక అశుభ స్వప్నాలు వస్తే.. వాటివల్ల కలిగే దుష్పరిణామాల నివారణోపాయాలను ఈ కథా సందర్భంలో వివ‌ర‌ణ‌ కనిపిస్తుంది. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయవాలలో గడ్డి, చెట్లు మొలవటం, నెత్తి మీద పెట్టుకున్న కంచుపాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకొన్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిదికాదు.

అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృ గర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ, భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావటం నష్టహేతువు.

కలలో సముద్రం కనిపిస్తే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనే సూచనగా భావించాలని శాస్త్రం చెబుతోంది. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం శుభ శకునాలు కాదు. స్వలింగ సంపర్కం, దక్షిణ దిక్కు వైపునకు వెళ్ళటం, రోగ పీడితుడిగా ఉండటం, ఇళ్ళను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది. పురాణంలో చెప్పిన స్వప్న శాస్త్రాల ప్రకారం ఇలాంటి చెడ్డ కలలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే మంచిది.

రాత్రి మొదటి జాములో కల వస్తే ఒక ఏడాది కాలం లోపల అది జ‌రుగుతుందని... రెండో జాములో కల వస్తే 6 నెల‌ల లోపున, మూడో జాములో వస్తే 3 నెల‌ల లోపున, నాలుగో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రం చెబుతోంది . సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజులలోపే జరుగుతుందని అంటారు. ఒకే రాత్రి మంచి కల, పీడ కల రెండూ వస్తే రెండోసారి వచ్చిన కలే ఫలవంతమవుతుందని... రెండోసారి వచ్చింది పీడకల అయితే మెలకువ రాగానే మళ్ళీ వెంటనే పడుకోవాలంటారు. అదే శుభస్వప్నమైతే నిద్రపోవటం మంచిది కాదు.

ఆకాశంలో మెరుపు మెరిసినట్లు, ఉరుములు ఉరిమినట్లు, పిడుగు పడినట్లు, తల దువ్వుకుంటున్నట్లు, ఇంట్లో నక్షత్రం ప్రకాశిస్తున్నట్లు, కట్లు ఉన్న కాళ్లతో నడిచినట్లు, కాలు విరిగినట్లు కలలు రావడం మంచిది కాదు. ఇక జంతువులు క‌ల‌లో వ‌స్తే... కుక్క తమను చూసి మొరిగినట్లు, నక్క, కోతి కనిపించినా, పక్షి గుడ్లను పగులగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్టు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిద పైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు కలలు వచ్చినా నిజజీవితంలో మంచి జరగదట.

ఇలా మంచి క‌ల‌ల‌ గురించి, వాటి ఫలితాల నివారణ కోసం తిల హోమంలాంటి వాటి గురించి అగ్నిపురాణం చెబుతోంది. మంచి క‌ల‌ల వరుసను కూడా ఈ సందర్భంలోనే తెలిపింది. పీడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని, అదే శుభశకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిద‌ని పరశురాముడికి పుష్కరుడు ఇలా స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. మనిషి మనుగడకు సంబంధించిన అన్ని విషయాలను, శాస్త్రాలను పురాణాలు స్పృశించాయనటానికి ఇదొక ఉదాహరణ.

చెడు క‌ల‌లు దోష శాంతి కోసం పండిత పూజ, నువ్వులతో హోమం చేయ‌డం మంచిది. బ్రహ్మ, విష్ణు, శివ, సూర్యగణాలను పూజించటం, స్తోత్రాలు, పురుష సూక్తం లాంటి వాటిని పారాయణం చేయాలి.

నిజానికి మనసు బాగోలేనప్పుడు వచ్చే కలలు ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. ఇక మనసు సంతోషంగా వునప్పుడు వచ్చే కలలు ఆహ్లాదకరంగా వుంటాయి. అంటే మనసును ఎక్కువగా ప్రభావితం చేసే విషయాలే దృశ్యరూపాన్ని సంతరించుకుని కలలుగా వస్తుంటాయని మనోవైజ్ఞానిక నిపుణులు చెబుతుంటారు. అయితే అలాంటి స్వ‌ప్నాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వవట‌. మనసు సాధారణమైన స్థితిలో ఉన్నప్పుడు.. తెల్లవారుజామున వచ్చే కొన్నికలలు మాత్రమే ఫలితాన్ని చూపుతాయని చెప్పబడుతోంది.

(క‌ల‌లు - వాటి ఫ‌లితాల గురించి మ‌రిన్ని విష‌యాలురేపేటి పోస్ట్ లో మీకు అందిస్తాను )
Photo

Post has attachment
#Varaphalamulu 25th to 01

Post has attachment
Weekly Rasi Phalalu 2017 June 25 th To July 01 st 2017
Wait while more posts are being loaded